ఎంపీడీఓల బదిలీలు షురూ.. | mpdo transfers confirmed | Sakshi
Sakshi News home page

ఎంపీడీఓల బదిలీలు షురూ..

Published Wed, Feb 19 2014 6:02 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

mpdo transfers confirmed

 జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ :  ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎంపీడీవోల బదిలీలు జరుగుతున్నారుు. ఇవి మల్టీజోన్ పోస్టులు కావడంతో జోన్ మార్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలిసింది. అన్ని జిల్లాలకు చెందిన ఎంపీడీఓల బదిలీల జాబితా తయారైనప్పటికీ తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువ మంది రంగారెడ్డి జిల్లాకు వెళ్లేందుకు అప్షన్ ఇవ్వడంతో కమిషనర్ కార్యాలయంలోని అధికారులకు తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై సందిగ్ధం నెలకొన్నప్పటికీ మంగళవారం జిల్లా నుంచి రాయపర్తి ఎంపీడీఓ సువర్ణరాజు ప్రకాశం జిల్లాకు బదిలీ కావడంతో ప్రక్రియ ప్రారంభమైంది.
 
  1వ జోన్‌లోని ప్రకాశం జిల్లా కొనకలమిట్ట మండ లానికి చెందిన ఎంపీడీఓ బానోతు సరితను 2వజోన్ పరిధిలోని వరంగల్ జిల్లాకు, ఆమె స్థానంలో రామపర్తి మండలం ఎంపీడీఓ సువర్ణరాజును ఆదే జిల్లాకు బదిలీ చేశారు. రెండు రోజుల్లో ఎంపీడీఓల బదిలీల ప్రక్రియ పూర్తవుతుందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement