రోడ్డు ప్రమాదంలో ఎమ్మార్వో దంపతులకు గాయాలు
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఎదురుగట్ల గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తహశీల్దార్ దంపతులకు గాయాలు అయ్యాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట తహశీల్దార్ కనకయ్య, భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఆదివారం స్వగ్రామం ఎదురుగట్లకు వచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణమైన కొద్దిసేపటికే వారి కారును ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. కనకయ్య, ఆయన భార్యకు గాయాలు కాగా, వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.