కోటగిరి ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి
నిజామాబాద్(కోటగిరి): నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని చెరువు నుంచి వాటర్ లీకేజీ అవుతున్నాయని, వెంటనే మరమ్మతులు చేయించి నీటిని వృధాగా పోకుండా అరికట్టాలని కోరుతూ బుధవారం రైతులు మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం తహశీల్దార్‌ను కలిసి సమస్యను వివరించారు. చెరువుకు మర్మమత్తులు వెంటనే చేయించకపోతే సాగునీటికి, తాగునీటికి కష్టాలు మొదలవుతాయని తెలిపారు.