కురవిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
కురవి(వరంగల్ జిల్లా): కురవి మండలం మూడుగుడిసెల తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్పై ఇద్దరు వ్యక్తులు మైపాడు నుంచి కురవి వస్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. మృతులు ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలవాసులుగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.