Mugulu
-
ముగ్గుల ఫోటోలు తీస్తుండగా విషాదం..ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి..
సాక్షి, కుషాయిగూడ: పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. అపార్టుమెంట్ ముంగిట వేసిన ముగ్గుల ఫొటోలు తీస్తుండగా జారీ పడి ఓ బాలిక మృతిచెందిన సంఘటన శనివారం కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఉపేందర్యాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాప్రా, సాధనవిహార్ కాలనీ, ఆవాస్ అపార్టుమెంట్లో ఉంటున్న పోతిశెట్టి కిన్నెర (14) 9వ తరగతి చదువుతోంది. శనివారం బోగి పండుగ సందర్భంగా అపార్ట్మెంట్ ఆవరణలో వేసిన ముగ్గులను ఐదో అంతస్తునుంచి సెల్ఫోన్లో ఫొటో తీస్తూ ప్రమాదవశాత్తు జారి కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెద్దలకు తెలియజేయడమే శాపమైందో ఏమో! ఆ ప్రేమ జంట..) -
500 ఎకరాల్లో హార్టీకల్చర్ వర్సిటీ: కేసీఆర్
మెదక్: గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సందర్శించారు. 500 ఎకరాల్లో ఫారెస్ట్ వర్సిటీ, మరో 500 ఎకరాల్లో హార్టీకల్చర్ యూనివర్సిటీ నెలకొల్పుతామని ఈ సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు. 75 ఎకరాల్లో హాస్టళ్లు, ఆఫీసు రూముల ఏర్పాటు చేస్తామని, దీనంతటికి రూ. వెయ్యి కోట్లు అవసరమవుతుందని తెలిపారు. రూ.200 కోట్లు కేంద్రం నుంచి మంజూరయ్యాయరని, వారం రోజుల్లో తానే శంకుస్థాపన చేస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు.