
సాక్షి, కుషాయిగూడ: పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. అపార్టుమెంట్ ముంగిట వేసిన ముగ్గుల ఫొటోలు తీస్తుండగా జారీ పడి ఓ బాలిక మృతిచెందిన సంఘటన శనివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఉపేందర్‌యాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాప్రా, సాధనవిహార్ కాలనీ, ఆవాస్ అపార్టుమెంట్లో ఉంటున్న పోతిశెట్టి కిన్నెర (14) 9వ తరగతి చదువుతోంది.
శనివారం బోగి పండుగ సందర్భంగా అపార్ట్‌మెంట్ ఆవరణలో వేసిన ముగ్గులను ఐదో అంతస్తునుంచి సెల్‌ఫోన్‌లో ఫొటో తీస్తూ ప్రమాదవశాత్తు జారి కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment