mukhesh
-
యూఎస్‌లో కారు ప్రమాదం, టెకీ, కూతురు మృతి
సాక్షి, బెంగళూరు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన తండ్రీ కుమార్తెలు మృత్యువాత పడ్డారు. బీదర్‌కు చెందిన టెక్కీ ముఖేశ్ శివాజీవార దేశ్‌ముఖ్ (27), ఆయన రెండేళ్ల కుమార్తె దివిజా రోడ్డు ప్రమాదంలో అసువులు బాసినట్లు ఇక్కడికి సమాచారం అందింది. బీదర్ జిల్లా భాల్కి తాలూకా కొంగళ్లికి చెందిన ముఖేశ్ అమెరికాలోని ఉత్తర కరోలినాలో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం తన సతీమణి మౌనిక, కుమార్తె దివిజాలతో కారులో వెళుతున్నారు. ముఖేశ్ కారును డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సమయంలో కారు అదుపు తప్పి ఓ ట్రక్‌ను ఢీ కొట్టడంతో తండ్రీకుమార్తెలు ఇద్దరూ అక్కడికక్కడే మరణించగా, మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చే విషయమై భారతీయ రాయబారి కార్యాలయంతో బీదర్ ఎంపీ భగవంత్ ఖోబా సంప్రదింపులు జరిపారు. -
కొత్త సందేశాలకు వేదికలవుతున్న లగ్నపత్రికలు
ఒకప్పుడు పెళ్లి పత్రిక అంటే వ్యక్తిగత విషయంగా ఉండేది. ఇప్పుడది పూర్తిగా కొత్త రూపు సంతరించుకుంటోంది. సామాజిక సందేశాలతో పెళ్లి పత్రికలు కొత్తబాట పట్టాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయపరమైన ప్రచార హోరులోనూ అవి భాగమవుతుండడం విశేషం. సాక్షి, సిటీబ్యూరో :మీ రాక మా కోరిక. మాకు ఆనందదాయకం అనీ, కానుకలు వద్దు.. మీరు రావడమే మాకు సంతోషం. వధూవరులకు ఆశీర్వచనాలివ్వండి లాంటి విన్నపాల స్థానంలో ఇప్పుడు ఫలానా పార్టీకి ఓటేయండి అంటూ అభ్యర్థనలు చోటు చేసుకుంటున్నాయి. ‘అవును నేను మోదీ భక్తుణ్నే’ అని సగర్వంగా చెబుతున్నారు శంషాబాద్ నివాసి వై.ముఖేష్‌రావు (27). మహాత్మా గాంధీ తర్వాత మోదీ మాత్రమే అంత గొప్ప నేత అని నిస్సందేహంగా విశ్వసించే ముఖేష్.. ఆ విశ్వాసాన్ని చూపించడంలో అందరికంటే వినూత్నమైన దారిని ఎంచుకున్నారు. కానుకలొద్దు..ఓటే ముద్దు.. అని అభ్యర్థిస్తున్నారు ముఖేష్. తన పెళ్లికి వచ్చేవారెవరూ ఎటువంటి కానుకలూ తేవద్దని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా ప్రధాని మోదీకి మద్దతుగా ఓటేయడమే తమకు అతిథులు ఇచ్చే కానుక అంటూ ఆయన త్వరలో జరగనున్న తన పెళ్లి పత్రికపై ముద్రించడం విశేషం. ‘పెళ్లి పత్రిక ద్వారా ఓటు వేయమని అడగడం గురించి మొదట్లో మా బంధుమిత్రులు అభ్యంతరం పెట్టారు. నేను వాళ్లని కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది’ అంటారు ముఖేష్. మనం రోజువారీ జీవితపు హడావుడిలో పడి దేశం కోసం ఏమీ చేయలేకపోతున్నా ప్రజల పురోభివృద్ధికి పనిచేస్తున్న నేతకు మద్దతు తెలపడం మన కనీస బాధ్యత అంటున్నారీ మోదీ భక్తుడు. దేశవ్యాప్తంగానూ.. పెళ్లి పత్రికలు సామాజిక సందేశాలను మోసుకురావడమనేది కొంతకాలంగా ఉందని బల్కంపేటలోని వెంకటరమణ గ్రాఫిక్స్‌కు నిర్వాహకులు వి.వి.గిరి చెప్పారు. ఆహారాన్ని వృథా చేయొద్దనీ, కొంతమంది మొక్కలు పెంచమని పర్యావరణానికి మద్దతుగా, కొన్ని పత్రికల్లో స్వచ్ఛభారత్‌ను ప్రోత్సహిస్తూ కొంత మంది క్లయింట్లు వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయమని అడుగుతుంటారని ఆయన చెప్పారు. అయితే రాజకీయ పార్టీల ప్రచారం గురించి ఇప్పటిదాకా తమను ఎవరూ సంప్రదించలేదన్నారు. పెళ్లి పత్రికలు పార్టీల ప్రచార మార్గాలు కావడమనేది తాజాగా మొదలైన ట్రెండ్. ఇటీవలే దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి. జైపూర్‌కి చెందిన భన్వర్‌లాల్ గత జనవరి 22న కుమార్తె పెళ్లి పత్రికలో బేటీ బచావో, బేటీ పడావో అంటూ సందేశాన్ని ప్రచురించి దాంతోపాటే రానున్న ఎన్నికల్లో మోదీకి ఓటేయమంటూ అభ్యర్థనను ముద్రించడం మీడియాను ఆకర్షించింది. అలాగే గుజరాత్‌కి చెందిన ఓ పెళ్లి ఆహ్వాన పత్రికలో కూడా ఇలాంటి అభ్యర్థనే చోటుచేసుకోవడంతో అది వైరల్‌గా మారింది. అలాగే మరో వెడ్డింగ్ కార్డ్ మీద రాఫేల్ డీల్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ, మోదీకి మద్దతుగా జరిగిన ప్రచారం కూడా సంచలనం సృష్టించింది. -
100 మీ. పరుగు విజేతలు ముఖేశ్, ఝాన్సీ
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతోన్న అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీల్లో ముఖేశ్, ఝాన్సీ సత్తాచాటారు. గురువారం జరిగిన 100 మీ. పరుగు ఈవెంట్ బాలుర విభాగంలో మాల్ తుమ్మెద వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన ఎన్. ముఖేశ్ విజేతగా నిలవగా... ఎల్. నరేశ్ (పాలెం), సాయి సందీప్ (కంపా సాగర్) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల విభాగంలో కంపా సాగర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన బి. ఝాన్సీ, ఎస్. తేజస్విని (పాలెం), బి. అనూష (జగిత్యాల) వరుసగా తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. క్రికెట్, వాలీబాల్, బాల్‌బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్, టేబుల్ టెన్నిస్, చెస్, షాట్‌పుట్ విభాగాల్లో గురువారం పోటీలు జరుగగా టేబుల్ టెన్నిస్ ఈవెంట్ బాలికల విభాగంలో రాజేంద్రనగర్ అగ్రి ఇంజనీరింగ్ కళాశాల టైటిల్‌ను గెలుచుకుంది. జగిత్యాల పాలిటెక్నిక్ కాలేజీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. క్యారమ్స్‌లో మధిర వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, రుద్రూర్ విత్తన పాలిటెక్నిక్ కళాశాలలు వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. షటిల్ బ్యాడ్మింటన్‌లో రాజేంద్రనగర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, జగిత్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. బాలుర విభాగంలో జరిగిన చెస్ పోటీల్లో కంపాసాగర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల చాంపియన్‌గా నిలిచింది. క్యారమ్స్‌లో పాలెం వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, మాల్తుమ్మెద జట్లు... వాలీబాల్‌లో పాలెం, కంపాసాగర్ కాలేజీ జట్లు ఫైనల్లో ప్రవేశించాయి. అథ్లెటిక్స్ ఈవెంట్లో విజేతల వివరాలు బాలుర 200 మీ. పరుగు: 1. ఎన్. ముఖేశ్ (మాల్ తుమ్మెద), 2. ఎల్. నరేశ్ (పాలెం), 3. వంశీకృష్ణ (కంపాసాగర్). బాలికలు: 1.ఎస్.తేజస్విని (పాలెం), 2. నౌషీన్ (రాజేంద్రనగర్), 3. సిరిచందన (వరంగల్). బాలుర షాట్‌పుట్: 1. సాయి సందీప్ (కంపాసాగర్), 2. జె. ప్రశాంత్ (రాజేంద్రనగర్), 3. ఎం. గోపి (రుద్రూర్ విత్తన పాలిటెక్నిక్) బాలికలు: 1. బి. అనూష (జగిత్యాల), 2. ఎం. అఖిల (కంపాసాగర్), 3. టి. నవనీత (పాలెం). బాలుర జావెలిన్ త్రో: 1. ఆర్. సుమన్ (కంపాసాగర్), 2. ఎల్. నరేశ్ (పాలెం), 3. ఎం. అరుణ్ (జమ్మికుంట) బాలికలు: 1. ఎం. సుకన్య (వరంగల్), 2. బి. అనూష (జగిత్యాల), 2. కోమల (కంపాసాగర్), 3. వి. శిరీష (రుద్రూర్). -
కోర్టులో స్పృహ తప్పి పడిపోయిన నటి సరిత
చెన్నై: సీనియర్ నటి సరిత కోర్టులో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అక్కడ కాసేపు కలకలం వాతావరణం నెలకొంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నాయకిగా నటించి పేరు గాంచిన సరిత.. మలయాళ నటుడు ముఖేష్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అలాంటిది కొంత కాలం తరువాత సరిత, ముఖేష్ మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఫలితం విడాకులకు దారి తీసింది. 2009లో ముఖేష్ సరిత నుంచి వివాహ రద్దు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ కాలం సాగిన ఈ కేసు విచారణ రెండేళ్ల క్రితం ముఖేష్, సరితకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది. దీంతో ముఖేష్.. మిధుల అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం చెల్లదంటూ నటి సరిత కేరళ, కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ చెన్నై కోర్టులో ముఖేష్ వివాహ రద్దు కోరుతూ వేసిన పిటీషన్‌పై విచారణ జరిగే సమయంలో తాను దుబాయిలో ఉన్నానన్నారు. దీంతో కోర్టు జారీ చేసిన నోటీసులను తాను అందుకోలేకపోయానని వివరించారు. తాను కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అందువలన ముఖేష్ రెండో వివాహం చెల్లదని తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా సరిత, ముఖేష్‌లిద్దరూ గురువారం కొచ్చి కుటుంబ సంక్షేమ కోర్టుకు హాజరయ్యారు. విచారణానంతరం కోర్టు బోనులోంచి వెనుదిరిగిన సరిత అనూహ్యంగా స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో కోర్టు ఆవరణలో కాసేపు కలకలం చెలరేగింది. వెంటనే సరిత సన్నిహితులు ఆమెకు సపర్యలు చేసి స్పృహ తెప్పించి ఇంటికి తీసుకెళ్లారు. -
నోవాటెల్‌లో ఉద్యోగినిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ : శంషాబాద్ నోవాటెల్ హోటల్లో దారుణం చోటుచేసుకుంది. హోటల్లోని మహిళా ఉద్యోగినిపై ముంబయికి చెందిన ముఖేష్ అత్యాచారయత్నం చేశాడు. దాంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ముఖేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. హౌస్ కీపింగ్ ఉద్యోగిని తనపై అత్యాచారయత్నం జరిగిందని, హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించింది. దాంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.