సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతోన్న అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీల్లో ముఖేశ్, ఝాన్సీ సత్తాచాటారు. గురువారం జరిగిన 100 మీ. పరుగు ఈవెంట్ బాలుర విభాగంలో మాల్ తుమ్మెద వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన ఎన్. ముఖేశ్ విజేతగా నిలవగా... ఎల్. నరేశ్ (పాలెం), సాయి సందీప్ (కంపా సాగర్) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల విభాగంలో కంపా సాగర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన బి. ఝాన్సీ, ఎస్. తేజస్విని (పాలెం), బి. అనూష (జగిత్యాల) వరుసగా తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు.
క్రికెట్, వాలీబాల్, బాల్‌బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్, టేబుల్ టెన్నిస్, చెస్, షాట్‌పుట్ విభాగాల్లో గురువారం పోటీలు జరుగగా టేబుల్ టెన్నిస్ ఈవెంట్ బాలికల విభాగంలో రాజేంద్రనగర్ అగ్రి ఇంజనీరింగ్ కళాశాల టైటిల్‌ను గెలుచుకుంది. జగిత్యాల పాలిటెక్నిక్ కాలేజీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. క్యారమ్స్‌లో మధిర వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, రుద్రూర్ విత్తన పాలిటెక్నిక్ కళాశాలలు వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. షటిల్ బ్యాడ్మింటన్‌లో రాజేంద్రనగర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, జగిత్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. బాలుర విభాగంలో జరిగిన చెస్ పోటీల్లో కంపాసాగర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల చాంపియన్‌గా నిలిచింది. క్యారమ్స్‌లో పాలెం వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, మాల్‌తుమ్మెద జట్లు... వాలీబాల్‌లో పాలెం, కంపాసాగర్ కాలేజీ జట్లు ఫైనల్లో ప్రవేశించాయి.
అథ్లెటిక్స్ ఈవెంట్‌లో విజేతల వివరాలు
బాలుర 200 మీ. పరుగు: 1. ఎన్. ముఖేశ్ (మాల్ తుమ్మెద), 2. ఎల్. నరేశ్ (పాలెం), 3. వంశీకృష్ణ (కంపాసాగర్).
బాలికలు: 1.ఎస్.తేజస్విని (పాలెం), 2. నౌషీన్ (రాజేంద్రనగర్), 3. సిరిచందన (వరంగల్).
బాలుర షాట్‌పుట్: 1. సాయి సందీప్ (కంపాసాగర్), 2. జె. ప్రశాంత్ (రాజేంద్రనగర్), 3. ఎం. గోపి (రుద్రూర్ విత్తన పాలిటెక్నిక్)
బాలికలు: 1. బి. అనూష (జగిత్యాల), 2. ఎం. అఖిల (కంపాసాగర్), 3. టి. నవనీత (పాలెం).
బాలుర జావెలిన్ త్రో: 1. ఆర్. సుమన్ (కంపాసాగర్), 2. ఎల్. నరేశ్ (పాలెం), 3. ఎం. అరుణ్ (జమ్మికుంట)
బాలికలు: 1. ఎం. సుకన్య (వరంగల్), 2. బి. అనూష (జగిత్యాల), 2. కోమల (కంపాసాగర్), 3. వి. శిరీష (రుద్రూర్).