ఎస్ఎంఎస్లతో ప్రయాణీకుల ఫిర్యాదుల స్వీకరణ
ఆర్టీసీ నిర్ణయం.. నెల రోజుల్లో అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: ప్రయాణీకులు బస్సుల్లో ఎదుర్కొంటున్న తమ సమస్యలను ఫిర్యాదు చేయడానికి ఏపీఎస్ ఆర్టీసీ ఎస్ఎంఎస్ (సంక్షిప్త సమాచారం) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా మొబైల్ ఫోన్ల నుంచి బస్సుల్లో ప్రయాణిస్తూనే క్షణాల్లో డిపో మేనేజర్లకు సమస్యల్ని తెలియజేయవచ్చు.
ఈ విషయాల్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ముక్కాల రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎంఎస్ పంపిన కొన్ని క్షణాల్లో ఫిర్యాదు ర సీదు నెంబర్ను తిరిగి ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు దారునికి పంపిస్తారు.
ఈ కొత్త పద్ధతిని రావులపాటి టెక్ హబ్ సంస్థ ఆధ్వర్యంలో నెల రోజుల్లో ప్రవేశపెడతారు. ఎస్ఎంఎస్లు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే సైట్లు, వెబ్ పోర్టల్ వివరాలను త్వరలో తెలియజేస్తామని వివరించారు.