ఎస్‌ఎంఎస్‌లతో ప్రయాణీకుల ఫిర్యాదుల స్వీకరణ | SMS adoption of passenger complaints | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంఎస్‌లతో ప్రయాణీకుల ఫిర్యాదుల స్వీకరణ

Published Sun, Dec 28 2014 1:50 AM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM

ఎస్‌ఎంఎస్‌లతో ప్రయాణీకుల ఫిర్యాదుల స్వీకరణ - Sakshi

ఎస్‌ఎంఎస్‌లతో ప్రయాణీకుల ఫిర్యాదుల స్వీకరణ

  • ఆర్టీసీ నిర్ణయం.. నెల రోజుల్లో అందుబాటులోకి
  • సాక్షి, హైదరాబాద్: ప్రయాణీకులు బస్సుల్లో ఎదుర్కొంటున్న తమ సమస్యలను ఫిర్యాదు చేయడానికి ఏపీఎస్ ఆర్టీసీ ఎస్‌ఎంఎస్ (సంక్షిప్త సమాచారం) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా మొబైల్ ఫోన్ల నుంచి బస్సుల్లో ప్రయాణిస్తూనే క్షణాల్లో డిపో మేనేజర్లకు  సమస్యల్ని తెలియజేయవచ్చు.  

    ఈ విషయాల్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ముక్కాల రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎంఎస్ పంపిన కొన్ని క్షణాల్లో ఫిర్యాదు ర సీదు నెంబర్‌ను తిరిగి ఎస్‌ఎంఎస్ ద్వారా ఫిర్యాదు దారునికి పంపిస్తారు.

    ఈ కొత్త పద్ధతిని రావులపాటి టెక్ హబ్ సంస్థ ఆధ్వర్యంలో నెల రోజుల్లో ప్రవేశపెడతారు. ఎస్‌ఎంఎస్‌లు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సైట్లు, వెబ్ పోర్టల్ వివరాలను త్వరలో తెలియజేస్తామని వివరించారు.    
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement