మద్యం దుకాణం వద్ద గలాటా.. వ్యక్తి మృతి
ములపర్రు (పెనుగొండ) : పాతకక్షల నేపథ్యంలో ములపర్రు గ్రామంలో మద్యం దుకాణం వద్ద జరిగిన గలాటాలో ఓ వ్యక్తి మృతి చెందారు. పోలీసులు తె లిపిన వివరాల ప్రకారం.. కొల్లి ఆశీర్వాదం(55), వడ్లపాటి ల క్ష్మణరావు మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కొల్లి ఆశీర్వాదం ములపర్రు మద్యం దుకాణం వద్ద మద్యం సేవిస్తుండగా లక్ష్మణరావు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. స్థానికులు ఆశీర్వాదంను కాకినాడ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు.