Multiple Floors Building
-
ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో... భవనానికి నిప్పంటించి...
కొంతమంది ప్రేమ పేరుతోనే లేక స్నేహితులు కారణంగానో తెలిసో/ తెలియకో దారుణంగా మోసపోతుంటారు. దీంతో వారు ఆ మోసాన్ని జీర్ణించు కోలేకపోవడమే గాక మరోకర్ని నమ్మాలన్న భయపడుతుంటారు. ఇలాంటి పరిస్థితి నుంచి సాధ్యమైనంత తొందరగా బయటకొచ్చేందుకు యత్నించాలి గానీ తనను తాను గాయపర్చుకోవడమే లేక పక్కవారికి హాని తలపెట్టడమో చేయకూడదు. ఇక్కడొక మహిళ అలాంటి దారుణానికి ఒడిగట్టి కటకటాలపాలైంది. వివరాల్లోకెళ్తే....తైవాన్‌లోని 51 ఏళ్ల హువాంగ్ కే కే అనే మహిళ తన ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో కాహ్‌సియుంగ్‌లో ఉన్న బహుళ అంతస్తుల భవనానికి నిప్పంటించింది. దీంతో సుమారు 46 మృతి చెందగా, దాదాపు 41 మంది గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆమెపై హత్య నేరం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడిందని, పైగా ఆమెలో పశ్చాత్తాపం కూడా లేదంటూ ఉరితీయాలని డిమాండ్ చేశారు న్యాయవాదులు. అయితే కోర్టు విచారణలో ఆమెను దోషిగా నిర్థారించింది గానీ భవనంలోని నివాసితులకు నష్టం కలిగించే ఉద్దేశ్యం ఆమెకు లేదని పేర్కొంది. అంతేకాదు ఆమె ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడలేదని కూడా స్పష్టం చేసింది. ప్రియుడు మోసం చేయడంతో జీర్ణించుకోలేక ఆవేశంతో సదరు వ్యక్తిని ఇబ్బందులకు గురిచేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొంది. పైగా దీన్ని ఉద్రేకపూరితమైన చర్యగా భావించి కోర్టు ఆమెకు జీవిత ఖైదు జీవించింది. ఐతే ఆమె తన నేరాన్ని కోర్టులో ఒప్పుకుంది, కానీ ఈ ఘటనకు ప్పాలడే ముందు ఏ జరిగిందనేది అస్పష్టంగా ఉంది. అదీగాక ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన న్యాయవాదులు పై కోర్టుకి అప్పీలుకి వెళ్తామని తేల్చి చెప్పారు. (చదవండి: నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. పలువురి దుర్మరణం) -
ఉస్మానియా ట్విన్ టవర్స్‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ట్విన్ టవర్స్ నిర్మాణానికి సీఎం కె.చంద్రశేఖరరావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, డీఎంఈ డాక్టర్ రమణిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉస్మానియా భవనం దుస్థితిపై ఇటీవల ‘సాక్షి’లో ‘హా..స్పత్రి’.., ‘మళ్లీ కూలిన పైకప్పు’ వంటి శీర్షికలతో వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. దీనికితోడు వైద్యులంతా సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగడం, ఆ తర్వాత ఉద్యోగ సంఘాలన్నీ కలసి ఉస్మానియా పరిరక్షణ కమిటీ పేరుతో జేఏసీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులతో సమావేశమై బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆస్పత్రిని హెరిటేజ్ పరిధి నుంచి తొలగించే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఈ మేరకు ప్రస్తుత భవనం స్థానంలోనే మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని, ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు, ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్‌ను ఆదేశించారు. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో బహుళ అంతస్తుల భవనానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ వైద్యుల సంఘం గౌరవ అధ్యక్షుడు బొంగు రమేశ్, ఉస్మానియా ఆస్పత్రి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నాగేందర్‌లు హర్షం వ్యక్తం చేశారు.