'ఏర్పేడు ప్రమాదంలో కుట్రకోణం'
మునగలపాలెం: ఏర్పేడు ప్రమాద ఘటనలో కుట్రకోణం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మునగలపాలెంలో ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇసుక మాఫియే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో యథేచ్చగా ఇసుక అక్రమ దందా జరుగుతోందని.. ఇందులో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కు వాటా ఉందని అన్నారు. ఇసుక మాఫియాపై మునగలపాలెం గ్రామస్తులు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదన్నారు.
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
చిత్తూరు జిల్లాలో యథేచ్చగా ఇసుక అక్రమ దందా జరుగుతోంది
ఒక్క కాళహస్తిలో 8 చోట్ల ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారు
ఇసుక దందాపై స్థానికులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు
600 ట్రాక్టర్లను సీపీఎం, వైఎస్సార్ సీపీ నేతలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, అయినా అధికారుల్లో చలనం రాలేదు
టీడీపీ నేతలు ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడు, మణి నాయుడు ఇసుక దందా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు
అధికార టీడీపీ నాయకులతో అధికారులు కుమ్మక్కయ్యారు
గ్రామస్తులు ఫిర్యాదు చేయడానికి పోతే ఎమ్మార్వోలు ఎప్పుడు ఉండరు
కంప్లయింట్ ఇవ్వడానికెళితే పోలీస్ స్టేషన్ల గేట్లు మూసివేస్తారు
ఎక్కడైనా పోలీస్ స్టేషన్ గేట్లు మూసేస్తారా?
సాక్షాత్తూ ఎస్పీ స్టేషన్ లో ఉండగా ఏర్పేడు ప్రమాదం జరిగింది
స్థానికుల్ని ఎవర్ని అడిగినా మమ్మల్ని హత్య చేయించారని అంటున్నారు
ధనుంజయ, చిరంజీవి, మణి నాయుడులపై కేసులు ఎందుకు పెట్టలేదని గ్రామస్తులు అడుగుతున్నారు
బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు
వీళ్లకు అసలు మానవత్వం ఉందా?
ఇసుక అక్రమ దందాలో టీడీపీ నాయకులు రూ. 200 కోట్లు సంపాదించారు
ఇదంతా రికవరీ చేసి దాంట్లో రూ. 50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చినా న్యాయం జరగదు
స్వర్ణముఖి నదిలో విచ్చలవిడిగా తవ్వేయడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి
ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పరిస్థితుల్లో ఏర్పేడు దారుణం జరిగింది
అధికారులతో మంత్రులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై సంపాదించుకుంటున్నారు
ఏది చూసినా దోపిడీయే.. ఏది ముట్టుకున్న లంచాలు, కరప్షన్, దోపిడీ
ఇప్పటికైనా ప్రభుత్వానికి జ్ఞానోదయం కాకపోతే పోరాటం ఉధృతం చేస్తాం
ఇసుక దందాకు వ్యతిరేకంగా మా పార్టీ నాయకులు 8 సార్లు ధర్నాలు చేశారు. అంత దారుణంగా ఇసుక మాఫియా జరుగుతోంది.
మనం నోరెత్తకపోతే ప్రభుత్వానికి జ్ఞానోదయం కాదు
ఏర్పేడు ప్రమాదంలో కుట్రకోణం కన్పిస్తోంది.
ఎన్నో సందర్భాల్లో కేసులు పెట్టడానికి స్థానికులు ప్రయత్నిస్తే కేసులు నమోదు చేయలేదు
ప్రభుత్వం ఎందుకు ఇంతగా ఇసుక మాఫియాకు సపోర్ట్ చేస్తోంది?
లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరముంది
ఇసుక దందా చేస్తున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టేందుకు వెళ్లిన మునగలపాలెం గ్రామస్తులు ప్రమాదంలో చనిపోయారు
బాధితులు అన్న మాటలే మీ దృష్టికి తీసుకొస్తున్నా
ఎవరు వెనుకున్నారన్నది అందరికీ తెలుసు అయినా ఎందుకు హైలెట్ కాలేదు
ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
బాధిత కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటాం