muniswami
-
కర్ణాటక రోడ్డు ప్రమాదం: గాడిదలు కాస్తున్నారా! ఆర్టీఓ అధికారులపై ఎంపీ ఆగ్రహం..
సాక్షి, చింతామణి (కర్ణాటక): తాలూకాలోని మరినాయకనహళ్లి క్రాస్ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందిన ఘటనపై ఎంపీ మునిస్వామి అధికారులపై నిప్పులు చెరిగారు. సోమవారం ఉదయం ఆయన చింతామణి ఆస్పత్రిలో మృతదేహాలకు నివాళులర్పించిన అనంతరం ఆర్టీఓ అధికారులను అక్కడికే పిలిపించారు. వారిని చూడగానే ఎంపీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. విధులు నిర్వహించకుండా గాడిదలు కాస్తున్నారా... చేతకాకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండి అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అక్రమంగా నడుపుతున్న వాహనాలను సీజ్ చేయకపోవడంతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అంతకు ముందు ఆయన మృతుల కుటుంబాలకు రూ. లక్ష అందించారు. ఎంపీ వెంట డీఎస్పీ లక్ష్మయ్య, తహశీల్దార్ హనుమంత రాయప్ప తదితరులు ఉన్నారు. చదవండి: ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య -
సీరియల్ కిల్లర్ శుక్రవారపు హత్యలు
ఎన్నో హత్యలు.. కొన్ని పోలీసుల రికార్డుల్లో నమోదయ్యాయి. మరికొన్ని కాలేదు. మరెన్నో హత్యాయత్నాలు. 50కు పైగా చోరీలు.. దోపిడీలు. సైకో సీరియల్ కిల్లర్ మునస్వామిను పట్టుకోవడంలో చిత్తూరు పోలీసు యంత్రాంగం పడ్డ శ్రమ, కష్టం ఎందరో ప్రాణాలను నిలబెట్టింది. వరుస హత్యల కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చూపించడంతో ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. అయితే మునస్వామి చేసిన దారుణాల్లో 99 శాతం శుక్రవారం అర్ధరాత్రి, తెల్లవారుజామునే చేయడం గమనార్హం. చిత్తూరు అర్బన్: ఉన్మాద హంతకుడు మునస్వామి (42)ను అరెస్టు వివరాలను మంగళవారం చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు మీడియాకు తెలియజేశారు. స్థానిక పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీలు ఐ.రామకృష్ణ, సుబ్బారావుతో కలిసి ఎస్పీ వివరాలను వెల్లడించారు. జిల్లాలో గత నెల 25న నగరికి చెందిన రత్నమ్మ (62), పాలసముద్రానికి చెందిన వళ్లియమ్మ (68) హత్య కేసుల్లో ఇతడు ఉన్మాది వ్యవహరించినట్లు స్పష్టం చేశారు. శుక్రవారం హత్యలు.. జిల్లాలో జరిగిన రెండు హత్యలతో పాటు ఈనెల 16న తమిళనాడు రాష్ట్రంలో చేసిన హత్యలున్నీ దాదాపు శుక్రవారమే చేసినట్లు విచారణలో తేలింది.వేలూరులోని కొండపాలయం వద్ద దైవయాన (60)ను , గతేడాది డిసెంబరు 9న (శుక్రవారం అర్ధరాత్రి), వేలూరు జిల్లా నెమలి తాలూకాలో శకుంతల (65)ను, అదే ఏడాది ఫిబ్రవరి నెల ఓ శుక్రవారం మరో హత్య, మేలోని మరో శుక్రవారంలో రూ.50 కోసం ఏడాదిన్నర వయస్సున్న బాలికను హత్య చేసినట్లు తమిళనాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇవి కాకుండా ఈనెల 16న (శుక్రవారం) తమిళనాడులోని వేలూరు తాలిక్కాల్ గ్రామం శాంతమ్మ (65)పై బండరాయి వేసి హత్యాయత్నం, గతేడాది డిసెంబరు 9న (శుక్రవారం) వేలూరు జిల్లా నెమలి తాలూక పల్లికన్నత్తూరుకు చెందిన లక్ష్మి (45)పై రాయి వేసి హత్యాయత్నం, డిసెంబరు 30న (శుక్రవారం అర్ధరాత్రి) తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూక త్యాగాపురంలో ప్రమీళ (25) అనే మహిళపై బండరాయి వేసి హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు పొందలేకపోవడం, నేరం చేసినప్పుడు పోలీసుల ప్రవర్తన, సమాజం తనను చూసిన విధానాలే మునస్వామి ఉన్మాది మారడానికి కారణమైనట్లు తేలింది. మరిన్ని కేసులు.. 1992లో తమిళనాడులోని వాలాజ ప్రాంతంలోని చేసిన చోరీ ఇతని నేర ప్రయాణానికి పునాదిగా మారింది. దాని తరువాత 1994లో రాణిపేటలో జరిగిన 3 చోరీల్లో నాలుగు నెలల జైలుశిక్ష, 1996లో రెండు చోరీల్లో 2 నెలల జైలుశిక్ష, 2000లో మూడు చోరీ కేసుల్లో 10 నెలల జైలుశిక్ష, 2001లో తొమ్మిది చోరీల్లో 10 నెలల జైలుశిక్ష, 2007లో ఓ హత్య, దోపిడీ, ఆరు చోరీల్లో 66 నెలల జైలుశిక్ష అనుభవిం చాడు. ఇప్పటి వరకు ఒక్కటి మినహా మిగిలిన హత్యలన్నీ మునస్వామి శుక్రవారమే చేసినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధ మహిళల్ని చంపి.. మృతదేహాల ఛాతి భాగాన్ని పళ్లతో కొరకి మృనస్వామి వికృతానం దం పొందేవాడని విచారణలో స్పష్టమైంది. అత్యాచారం చేస్తే తనకు ఎయిడ్స్ సోకుతుందనే భయంతో అత్యాచారానికి పాల్పడలేదని విచారణలో తెలిపడం Výæమనార్హం. ఇక బంగారు ఆభరణాలు దొంగిలిస్తే వీటిని అమ్మేటప్పుడు పోలీసులకు దొరికిపోతామని ఎక్కడా బంగారం ముట్టేవాడుకాదు. కానీ హత్యా స్థలాల్లో అతడి వేలిముద్రలు నమోదయ్యాయి. పట్టించిన టెక్నాలజీ.. వేలిముద్రల ఆధారంగా దాదాపు 52 వేల పాత నేరస్తుల వేలిముద్రలను పరిశీలించిన పోలీసుశాఖకు వేలూరు జిల్లా పోలీసుల వద్ద ఉన్న ముద్రలతో సరిపోలాయి. వీటి ఆధారంగా చిత్తూరు పోలీసులు ఉపయోగిస్తున్న ఫేస్టాగర్ ఆధారంగా మునస్వామి ఫొటో ప్రత్యక్షమవడంతో అతన్ని కాపుకాసి పట్టుకోవడంతో మరిన్ని సీరియల్ హత్యలు జరగకుండా పోలీసులు నిరోధించారు. ఈ కేసు ఛేదనలో దాదాపు 60 మంది వరకు పోలీసు అధికారులు, సిబ్బంది కష్టపడ్డారు. ప్రధానంగా చిత్తూరు సీసీఎస్ డీఎస్పీ ఐ.రామకృష్ణ, అర్బన్ డీఎస్పీ సుబ్బారావుతో పాటు పశ్చిమ సీఐ ఎం.ఆదినారాయణ, వేలిముద్రల సేకరణ నిపుణులు దినేష్‌కుమార్, దస్తగిరీషా, స్పెషల్ పార్టీ, క్రైమ్ పార్టీ, తాలూక, పశ్చిమ విభాగం పోలీసుల్ని ఎస్పీ రాజశేఖర్‌బాబు అభినందించి నగదు రివార్డులను అందజేశారు. -
చిన్నారిపై అత్యాచారం.. హత్య
బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్యచేశాడు. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లె సమీపంలోని కోళ్లపారంలో కుమార్, బుజ్జమ్మ దంపతులకు అమ్ములు(5) అనే కుమార్తె ఉంది. గురువారం రాత్రి తమకు పరిచయస్తుడైన మునుస్వామితో కలసి వారంతా సినిమాకు వెళ్లారు. తిరిగి వస్తూ దారిలో ముగ్గురూ మద్యం తాగారు. ఇంటికి చేరుకున్న తర్వాత కుమార్ దంపతులు తమ నివాసంలో నిద్రించారు. శుక్రవారం ఉదయం నిద్ర లేచి చూసేసరికి అమ్ములు సమీపంలో విగతజీవిగా పడి ఉంది. మునుస్వామి కనిపించకుండా పోయాడు. అమ్ములుపై అత్యాచారం చేసిన ఆనవాళ్లు కనిపించడంతో మునిస్వామి ఈ అఘాయిత్యం చేసి చంపేసి ఉంటాడని వారు భావిస్తున్నారు. ఈమేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
గీత కార్మికుల పోరుబాట
తాడేపల్లిగూడెం రూరల్ : గీత కార్మికుల సమస్యలపై ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నామని, కల్లు గీత కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జుత్తిగ నరసింహారావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా విస్తృత సమావేశం స్థానిక సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, మద్యం సిండికేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని విమర్శించారు. అక్టోబరు 1 నుంచి నూతన టాడీ పాలసీని ప్రకటించాల్సి ఉందని, అయితే ఇప్పటివరకు సంబంధిత శాఖ మంత్రి ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. తాటిబెల్లం ఫెడరేషన్ చైర్మన్ బొల్ల ముసలయ్య గౌడ్ మాట్లాడారు. తొలుత జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జక్కంశెట్టి సత్యనారాయణ స్థానే జుత్తిగ నరసింహమూర్తిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నాయకులు పూరెళ్ల శ్రీనివాస్, సీహెచ్ వెంకటేశ్వరరావు, దాసరి సూరిబాబు పాల్గొన్నారు. -
చిత్తూరులో భారీ వర్షాలు - ముగ్గురి మృతి
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల్లో ఇప్పటి వరకూ ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతైయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 50 కి పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా చెరువులకు జల కళ వచ్చింది. జిల్లాలో ఉన్న 940 చెరువులు నీటితో నిండుకుండలను తలపిస్తున్నాయి. బహుదా, ఆర్మియా, తుంబా ప్రాజక్టులు జలంతో కళకళలాడాయి. మల్లమడుగు, పింఛా, పూలకంటారావు పేట ప్రాజక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గార్గేయ నదిలో మంగళవారం కొట్టుకు పోయిన తండ్రీ, కూతురుల మృత దేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నది దిగువ ప్రాంతంలో కూతురు మృత దేహం గాలింపు బృందాలకు లభించింది. కాగా.. తండ్రి మునిస్వామి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక తిరుమల లో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డు లోని ట్రాఫిక్ ను లింక్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నారు. కాగా.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని జలాశయాలు, జలపాతాలు నీటితో కళకళ లాడుతున్నాయి. ఆకాశ గంగ, గోగర్భం, పాప వినాశనానికి జలకళ వచ్చింది. కుమార ధార, పసుపు ధార డ్యాముల్లో 80 శాతం మేర నీరు చేరింది. ఇప్పటి వరకూ జలాశయాల్లో వచ్చి చేరిన సరిగా వినియోగిస్తే.. మరో రెండేళ్ల పాటు తిరుమలకు నీటి కష్టాలు తీరినట్టే నని అధికారులు అభిప్రాయపడ్డారు.