చిన్నారిపై అత్యాచారం.. హత్య
Published Fri, Oct 14 2016 11:05 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM
బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్యచేశాడు. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లె సమీపంలోని కోళ్లపారంలో కుమార్, బుజ్జమ్మ దంపతులకు అమ్ములు(5) అనే కుమార్తె ఉంది. గురువారం రాత్రి తమకు పరిచయస్తుడైన మునుస్వామితో కలసి వారంతా సినిమాకు వెళ్లారు. తిరిగి వస్తూ దారిలో ముగ్గురూ మద్యం తాగారు.
ఇంటికి చేరుకున్న తర్వాత కుమార్ దంపతులు తమ నివాసంలో నిద్రించారు. శుక్రవారం ఉదయం నిద్ర లేచి చూసేసరికి అమ్ములు సమీపంలో విగతజీవిగా పడి ఉంది. మునుస్వామి కనిపించకుండా పోయాడు. అమ్ములుపై అత్యాచారం చేసిన ఆనవాళ్లు కనిపించడంతో మునిస్వామి ఈ అఘాయిత్యం చేసి చంపేసి ఉంటాడని వారు భావిస్తున్నారు. ఈమేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement