in murder case
-
అనుమానం పెనుభూతమై..
భార్యను హత్యచేసిన భర్త పోస్టుమార్టం నివేదికతో నిందితుడి అరెస్టు రామచంద్రపురం : కట్టుకున్న భార్యను అనుమానంతో కడతేర్చిన భర్త ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేసి చివరకు పోలీసులకు లొంగిపోయాడు. రామచంద్రపురం డీఎస్పీ ఎ¯ŒS.బీ.ఎం.మురళీకృష్ణ గురువారం స్థానిక పోలీస్టేçÙ¯ŒSలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మండపేట మండలం మారేడుబాకకు చెందిన పడాల వీరవెంకట సతీష్‌కు 2014లో కె.గంగవరం మండలం కూళ్ల గ్రామానికి చెందిన నాగదుర్గ ప్రసన్న (24) తో వివాహం అయ్యింది. మారేడుబాకలోనే నివసిస్తున్న వారికి ప్రస్తుతం 11నెలల కుమారుడున్నాడు. ఇటీవల కాలంలో సతీష్ తన భార్య నాగదుర్గప్రసన్న ప్రవర్తనపై అనుమానం పెంచుకుని ఆమెను కొట్టి అమ్మ గారింటికి కూళ్లకు పంపించివేశాడు. కాగా ప్రసన్న అనారోగ్యానికి గురైందని ఆమె ఇంటి నుంచి ఫో¯ŒS రావడంతో సతీష్ కూళ్ల వచ్చాడు. గత నెల 9న తెల్లవారు జామున భార్యనాగదుర్గ ఫో¯ŒSలో మాట్లాడుతుండగా చూసి అనుమానంతో తన భార్యను చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈమేరకు పడుకున్న ఆమె పీక నొక్కి, తలగడతో ముఖంపై అదిమి ఊపిరాకుండా చేసి హతమార్చాడు. హత్య చేసినట్లు తెలియకుండా ఉండాలని సాక్ష్యాలు లేకుండా చేశాడు. అనంతరం ఆమె తల్లితో అనారోగ్యంగా ఉండడం వల్ల మాట్లాడడం లేదని చెప్పడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే నాగదుర్గ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈమేరకు నాగదుర్గ తల్లి అడపా రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో హత్య చేయబడినట్టు ఉండడం, దీనికి తోడు సతీష్ తన అత్తగారితో ఫో¯ŒSలో మాట్లాడుతూ ‘నీకూతుర్ని నేనే హత్యచేసాను, మీరు నన్నేమీ చేయలేరు’ అని బెదిరించడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులు గాలిస్తున్నారని తెలిసిన సతీష్ భయపడి మారేడుబాక వీఆర్వో వద్ద తను చేసిన నేరాన్ని ఒప్పుకుని అతని ద్వారా పామర్రు పోలీసుస్టేçÙ¯ŒSలో బుధవారం లొంగిపోయినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు ముద్దాయి సతీష్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ కె. శ్రీధర్‌కుమార్, ఎస్సై నరేష్‌లను డీఎస్పీ అభినందించి, రివార్డులను అందించనున్నట్లు తెలిపారు. ఎస్సై ఎల్.శ్రీనునాయక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
మొగుళ్లపల్లి : మం డలంలోని చింతలపల్లి శివారు పాత ఇస్సిపేటలో ఈ నెల 17న జరిగిన జన్నె యాదగిరి హత్య కేసులో నిం దితులను శనివారం అరెస్ట్ చేసినట్లు చిట్యాల ఇన్చార్జీ సీఐ కృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. చింతలపల్లి శివారు పాతఇస్సిపేట గ్రామానికి చెందిన జన్నె యాదగిరి, కుటుంబ సభ్యులతో కలిసి జూలై 8న వన భోజనాలకు వెళ్లాడు. పరకాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన చిలువేరు కృష్ణప్రసాద్‌కు పాత ఇస్సిపేటలో బంధువులు ఉన్నారు. తన బంధువులు కూడా వనభోజనాలకు వెళ్లగా కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చాడు. అక్కడే ఉన్న జన్నె యాదగిరితో కృష్ణప్రసాద్‌కు ఘర్షణ జరిగి గొడవకు దారి తీసింది. వారి ఘర్షణలో కృష్ణప్రసాద్ తల కు గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందు తూ మృతిచెందాడు. దీంతో అప్పటి నుంచి యాదగిరిపై కృష్ణప్రసాద్ బంధువులు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17న ఇంటి ముందు మంచంలో నిద్రిస్తున్న యాదగిరిని బొచ్చు తిరుపతి అలి యాస్ రాజు, దుగ్గెల తిరుపతి గొడ్డలితో తలపై నరికి హత్య చేశారు. యాదగిరి మామ ఫిర్యాదు మేరకు నిందితులను శనివారం అరెస్ట్ చేసి, కోర్టులో హజరుపర్చినట్లు సీఐ కృష్ణ తెలిపారు. ఎస్సై చల్లా రాజు, పీఎస్సై అభినవ్, ఏఎస్సై సురేందర్, సిబ్బంది ఉన్నారు.