హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌ | The arrest of the two accused in murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

Published Sun, Sep 25 2016 1:09 AM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

The arrest of the two accused in murder case

మొగుళ్లపల్లి : మం డలంలోని చింతలపల్లి శివారు పాత ఇస్సిపేటలో ఈ నెల 17న జరిగిన జన్నె యాదగిరి హత్య కేసులో నిం దితులను శనివారం అరెస్ట్‌ చేసినట్లు చిట్యాల ఇన్‌చార్జీ సీఐ కృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. చింతలపల్లి శివారు పాతఇస్సిపేట గ్రామానికి చెందిన జన్నె యాదగిరి, కుటుంబ సభ్యులతో కలిసి జూలై 8న వన భోజనాలకు వెళ్లాడు. పరకాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన చిలువేరు కృష్ణప్రసాద్‌కు పాత ఇస్సిపేటలో బంధువులు ఉన్నారు.
 
తన బంధువులు  కూడా వనభోజనాలకు వెళ్లగా కృష్ణప్రసాద్‌ అక్కడికి వచ్చాడు. అక్కడే ఉన్న జన్నె యాదగిరితో కృష్ణప్రసాద్‌కు ఘర్షణ జరిగి గొడవకు దారి తీసింది. వారి ఘర్షణలో కృష్ణప్రసాద్‌ తల కు గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందు తూ మృతిచెందాడు. దీంతో అప్పటి నుంచి యాదగిరిపై  కృష్ణప్రసాద్‌ బంధువులు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17న ఇంటి ముందు మంచంలో నిద్రిస్తున్న యాదగిరిని బొచ్చు తిరుపతి అలి యాస్‌ రాజు, దుగ్గెల తిరుపతి గొడ్డలితో తలపై నరికి హత్య చేశారు. యాదగిరి మామ ఫిర్యాదు మేరకు నిందితులను శనివారం అరెస్ట్‌  చేసి, కోర్టులో హజరుపర్చినట్లు సీఐ కృష్ణ తెలిపారు. ఎస్సై చల్లా రాజు, పీఎస్సై అభినవ్, ఏఎస్సై సురేందర్,  సిబ్బంది ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement