మేకను తప్పించబోయి మృత్యు ఒడికి..
పావగడ: రంగసముద్రానికి చెందిన త్రియంబకేశ్వర గ్రామీ ణ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు హెచ్బీ మురుడప్ప(52) రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు. స్వాతంత్య్ర వేడుకలు ముగించుకుని సరుకులు తీసుకురావడానికి బైకులో పావగడకు వెళ్తుండగా మార్గ మధ్యంలోని శైలాపురం వద్ద ఎదురుగా వచ్చిన మేకను తప్పించే ప్రయ త్నంలో ఈ సంఘటన జరిగిందని ఎస్ఐ నారాయణస్వామి తెలిపారు. మృతుడికి భార్య మంజువాణి, కుమారుడు చేతన్ కుమార్, కుమార్తె అశ్విని ఉన్నారు. హెచ్ఎం గంగాధరప్ప, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.