Murugadoss Mahesbabu
-
సాలెగూళ్లో చిక్కారు!
సాలెగూడులో పడి ఎటూ వెళ్లలేక కొన్ని పురుగులు గిల గిల గింజుకుంటుంటే ఎలా ఉంటుందో... సేమ్ టు సేమ్ అలాంటి సిచ్యువేషనే మహేశ్‌బాబు ‘స్పైడర్’ సెట్లో కనిపిస్తోందట! మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్ ‘స్పై’... అదే సీక్రెట్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగారు ‘స్పై’ అని తెలీక, కొందరు చీడ పురుగులు చాలా చాలా చెడు పనులు చేసేశారు. చివరకు, కథ కంచెకు చేరే టైమ్‌లో సాలీడులా మన ‘స్పై’ అల్లిన సాలెగూడు (ఉచ్చు)లో చిక్కుకుంటారు. ఆ సాలెగూళ్లో చిక్కుకున్న బద్మాష్లకు సంబంధించిన సీన్లను ఇప్పుడు చెన్నైలో షూటింగ్ చేస్తున్నారు. ఈ 16న చెన్నైలో ‘స్పైడర్’ క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభమైంది. వచ్చే నెల 2వ తేదీ వరకు క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుందట! ఆ తర్వాత పాటల చిత్రీకరణకు ఫారిన్ వెళ్తారట! చెన్నై షెడ్యూల్లో హీరోతో పాటు సినిమాలో విలన్‌గా నటిస్తున్న దర్శకుడు ఎస్.జె. సూర్య తదితరులు పాల్గొంటున్నారు. రకుల్ íహీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు హ్యారీస్ జయరాజ్ స్వరకర్త. -
ఈసారైనా కుదురుతుందా?
తెలుగు పరిశ్రమలో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ ఒకరు. స్టార్ హీరోల సరసన దూసుకెళుతున్న రకుల్‌కి ప్రత్యేకంగా ఓ స్టార్ హీరో సరసన నటించాలనే ఆకాంక్ష ఉంది. ఆ స్టార్ ఎవరో కాదు.. హ్యాండ్సమ్ హీరో మహేశ్‌బాబు. వాస్తవానికి ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో కాజల్ అగర్వాల్ చేసిన క్యారెక్టర్‌కి ముందు ఈ బ్యూటీనే అనుకున్నారు. ఐతే.. బ్యాడ్ లక్. డేట్స్ కుదరక ఆ అవకాశాన్ని వదులుకున్నారు రకుల్. ‘భవిష్యత్తులో మహేశ్ సరసన నటించే అవకాశం వస్తుందనే నమ్మకం ఉంది’ అని ఆ సమయంలో రకుల్ పేర్కొన్నారు. ఆ సమయం ఇప్పుడు వచ్చేసిందని సమాచారం. మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో పరిణీతీ చోప్రాను కథానాయికగా తీసుకున్నారనే వార్త వినిపించింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ పేరు వినిపిస్తోంది. మహేశ్‌తో సినిమా చేయడానికి రకుల్ ఆసక్తిగా ఉన్నారు కాబట్టి, ఈ అవకాశాన్ని వదులుకోకూడదనుకుంటున్నారట. మరి.. ఈసారైనా ఈ జోడీ కుదురుతుందో? లేదో చూడాలి. ఆ సంగతలా ఉంచితే.. ఆల్రెడీ పరిణీతి పేరు వినిపించింది కాబట్టి ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారేమోననే ఊహాగానాలు నెలకొన్నాయి. ఓ నాయికగా రకుల్, మరో నాయికగా పరిణీతి నటిస్తారేమో? ఈ నెలలోనే ఈ చిత్రం ఆరంభం కానుంది. సో.. మహేశ్ సరసన ఎవరు చాన్స్ కొట్టేస్తారనేది త్వరలోనే తెలిసిపోతుంది.