muthuramalinga thevar
-
విమానంలో నిరసన..పార్టీ అధ్యక్షుడి అరెస్ట్
సాక్షి, మధురై: విమానంలో నిరసన చేపట్టారని ఒక పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన ఘటన శనివారం తమిళనాడులోని మధురై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై నుంచి మధురై వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) అధినేత కేఏ మురుగన్ నిరసనకు దిగారు. మధురై విమానాశ్రయ పేరును యు. ముత్తురామలింగ థేవార్గా మార్చాలని, మురుగన్‌తోపాటు ఏఐఎఫ్బీ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. విమానం మధురై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే, నినాదాలకు దిగిన మురుగన్, ఏఐఎఫ్బీ కార్యకర్తలను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ముత్తురామలింగది థేవార్ సామాజికవర్గం. మాజీ పార్లమెంట్ సభ్యుడు ముత్తురామలింగ 1963లో మరణించారు. ఆయనను థేవార్ కులస్థుల ఆరాధ్య నాయకుడిగా చెప్తుంటారు. మధురై విమానాశ్రయ పేరును ముత్తురామలింగ థేవార్గా మార్చాలని మురుగన్, తమిళనాడు ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కలసి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. కొద్దిసేపటి తర్వాత మురుగన్‌తో సహా సదరు పార్టీ కార్యకర్తలను పోలీసులు విడిచిపెట్టారు. -
గురుపూజకు బయల్దేరుతున్న ముఖ్యమంత్రి
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన మంత్రివర్గంలోని సీనియర్ సహచరులతో కలిసి గురుపూజకు బయల్దేరుతున్నారు. రామనాథపురం జిల్లాలోని ముత్తురామలింగ దేవర్‌ను పూజించేందుకు ఆయన ఈనెల 30న వెళ్లనున్నారు. ముత్తురామలింగ దేవర్ స్మారకార్థం ఆ జిల్లాలోని పసుంపాన్ గ్రామంలో ఓ నిర్మాణానికి ఆయన భూమిపూజ కూడా చేస్తారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు గృహనిర్మాణ శాఖ మంత్రి ఆర్. వైద్యలింగం, సహకార సంఘాల శాఖ మంత్రి సెల్లూర్ కె. రాజు, ఆహార శాఖ మంత్రి ఆర్. కామరాజ్, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సుందర రాజ్, రెవెన్యూ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్, మురికివాడల బోర్డు చైర్మన్ కె. తంగముత్తు, హౌసింగ్ బోర్డు ఛైర్మన్ ఆర్. మురుగయ్య పాండ్యన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు యు. ముత్తురామలింగ దేవర్ 107వ జయంతి, 52వ గురుపూజ ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.