గురుపూజకు బయల్దేరుతున్న ముఖ్యమంత్రి | Panneerselvam to visit Pasumpon for Guru Poojai | Sakshi
Sakshi News home page

గురుపూజకు బయల్దేరుతున్న ముఖ్యమంత్రి

Published Mon, Oct 27 2014 1:30 PM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

గురుపూజకు బయల్దేరుతున్న ముఖ్యమంత్రి

గురుపూజకు బయల్దేరుతున్న ముఖ్యమంత్రి

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన మంత్రివర్గంలోని సీనియర్ సహచరులతో కలిసి గురుపూజకు బయల్దేరుతున్నారు. రామనాథపురం జిల్లాలోని ముత్తురామలింగ దేవర్ను పూజించేందుకు ఆయన ఈనెల 30న వెళ్లనున్నారు. ముత్తురామలింగ దేవర్ స్మారకార్థం ఆ జిల్లాలోని పసుంపాన్ గ్రామంలో ఓ నిర్మాణానికి ఆయన భూమిపూజ కూడా చేస్తారు.

ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు గృహనిర్మాణ శాఖ మంత్రి ఆర్. వైద్యలింగం, సహకార సంఘాల శాఖ మంత్రి సెల్లూర్ కె. రాజు, ఆహార శాఖ మంత్రి ఆర్. కామరాజ్, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సుందర రాజ్, రెవెన్యూ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్, మురికివాడల బోర్డు చైర్మన్ కె. తంగముత్తు, హౌసింగ్ బోర్డు ఛైర్మన్ ఆర్. మురుగయ్య పాండ్యన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు యు. ముత్తురామలింగ దేవర్ 107వ జయంతి, 52వ గురుపూజ ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement