Mutual fund company
-
టాటా ఈక్విటీ పీఈ ఫండ్ పనితీరు భేష్
ఈక్విటీ మార్కెట్లు అదే పనిగా నూతన గరిష్టాలకు ర్యాలీ చేస్తుండడంతో స్టాక్స్ విలువలు మరితంగా విస్తరించాయని.. కొన్నింటి విలువలు మరీ మితిమీరిన స్థాయికి చేరాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వ్యాల్యూ స్టాక్స్ పట్ల దృష్టి సారించాలన్న సూచన వినిపిస్తోంది. వ్యాల్యూ స్టాక్స్ అన్నవి.. వాటి అంతర్గత విలువతో (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) పోలిస్తే ఆకర్షణీయమైన ధరల వద్ద లభించేవి. గ్రోత్ స్టాక్స్ మాదిరి వ్యాల్యూ స్టాక్స్ ధరలు పరుగులు పెట్టవు. కానీ స్థిరమైన పనితీరు చూపిస్తుంటాయి. అస్థిరతలు తక్కువ. దీర్ఘకాలంలో వ్యాల్యూ స్టాక్స్ సైతం మంచి రాబడులను ఇస్తాయని చాలా మంది నిపుణుల అంచనా. కనీసం ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి, దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోని వ్యాల్యూ ఫండ్స్ విభాగాన్ని ఎంపిక చేసుకోవవచ్చు. ఈ విభాగంలో టాటా ఈక్విటీ పీఈ ఫండ్ పనితీరును గమనించినట్టయితే నిలకడగా కనిపిస్తుంది. పెట్టుబడుల విధానం బీఎస్ఈ సెన్సెక్స్ పీఈ కంటే 12 నెలల ట్రెయిలింగ్ పీఈ రేషియో తక్కువగా ఉన్న స్టాక్స్‌ను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 70 శాతాన్ని ఈ స్టాక్స్‌కే కేటాయిస్తుంటుంది. ఇలా ఎంపిక చేసిన కంపెనీల్లోనూ భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న వాటిని తుది జాబితాగా తీసుకుంటుంది. ఆయా రంగాల్లో కంపెనీల స్థానం ఏంటి, వాటికి ఉన్న వృద్ధి అవకాశాలు, రాబడుల రేషియోలు ఎలా ఉన్నాయి, స్టాక్ లిక్విడిటీ ఈ అంశాలన్నింటికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రంగాల మధ్య, అన్ని స్థాయిల కంపెనీల్లోనూ (లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్) ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ పథకానికి ఉంది. పనితీరు ఈ పథకం రాబడులను గమనించినట్టయితే.. గడిచిన ఏడాది కాలంలో 47 శాతంగా ఉన్నాయి, మూడేళ్లలో చూసినా వార్షికంగా 14.52 శాతం రాబడిని ఇచ్చింది. ఐదేళ్లలో 13.61 శాతం, ఏడేళ్లలో 14.26 శాతం, పదేళ్లలో 16.62 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. 2004లో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి చూసుకున్నా గానీ వార్షికంగా 19 శాతం చొప్పున పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్నిచ్చింది. వ్యాల్యూ ఆధారిత విభాగం సగటు రాబడులతో పోల్చి చూస్తే ఏడేళ్లు, పదేళ్లలో ఈ పథకంలో ఎక్కువ రాబడులు కనిపిస్తాయి. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.5,021 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో 95.5 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా.. మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలోనే కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 37 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్‌లోనే 53 శాతం పెట్టుబడులు ఉండడం గమనార్హం. పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్ సగటు పీఈ రేషియో 23.77 శాతంగా ఉంది. 69 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించగా.. మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో 27 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 4 శాతం వరకు పెట్టుబడులు పెట్టి ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 34 శాతానికి పైనే పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు, ఇంధనం, ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. చదవండి: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏదీ మంచిది ? -
వ్యాల్యూ డిస్కవరీ ఫండ్... పెట్టుబడులకు విలువ తెచ్చిపెట్టేది..!
మోస్తరు రాబడులు చాలు.. రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లకు వ్యాల్యూ డిస్కవరీ ఫండ్స్ విభాగం చక్కగా నప్పుతుంది. కంపెనీ వ్యాపారం, ఆర్థిక బలాల ఆధారంగా వాస్తవ విలువ షేరులో ప్రతిఫలించని సందర్భాలు కొన్ని వస్తుంటాయి. అటువంటి సందర్భాలను వ్యాల్యూ డిస్కవరీ పథకాలు అనుకూలంగా మలుచుకుని, మంచి కంపెనీలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ విభాగంలో 17 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పథకం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్. పదేళ్లు, అంతకుమించిన కాలానికి ఈ పథకాన్ని ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. రాబడులు ఈ పథకం నిర్వహణలో ఈ ఏడాది జూలై నాటికి రూ.21,195 కోట్ల ఆస్తులున్నాయి. వ్యాల్యూ ఫండ్స్ విభాగంలో అతిపెద్ద పథకం ఇది. మొత్తం వ్యాల్యూ ఫండ్స్ పరిధిలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 30 శాతం ఒక్క ఈ పథకంలోనే ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 48 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 13.49 శాతం, ఐదేళ్లలో 12.66 శాతం, ఏడేళ్లలో 12.69 శాతం, పదేళ్లలో 18.16 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. 2004 ఆగస్ట్‌లో ఈ పథకం మొదలు కాగా.. నాటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 20 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో నిఫ్టీ50టీఆర్ఐ కాంపౌండెడ్ వార్షిక రాబడి రేటు 15.91 శాతంగానే ఉంది. ఈ ప్రకారం సూచీల కంటే మెరుగైన పనితీరును చూపించిందని అర్థమవుతోంది. ఈక్విటీ విభాగంలో వీటిని మెరుగైన రాబడులుగా చూడొచ్చు. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.1.46 లక్షలు అయి ఉండేది. ఈ పథకంలో కనీసం రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.100 చొప్పున కూడా పెట్టుబడులకు ఈ పథకం అనుమతిస్తోంది. పెట్టుబడులు పెట్టిన ఏడాదిలోపు వైదొలిగితే 1 శాతం ఎగ్జిట్‌లోడ్‌ను చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ పథకం ఆరంభంలో రూ.లక్షను ఇన్వెస్ట్ చేసి (17 ఏళ్ల క్రితం) అలాగే కొనసాగించి ఉంటే నేటికి .22.13లక్షలు అయి ఉండేది. పెట్టుబడుల విధానం కంపెనీ వాస్తవ విలువతో పోలిస్తే తక్కువలో లభిస్తున్న కంపెనీలను, వివిధ రంగాల వారీగా ఎంపిక చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆర్థిక వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా అవసరమైతే స్వల్ప మార్పులను కూడా తీసుకుంటుంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు తగినంత సమయం ఉన్న వారికి వ్యాల్యూ డిస్కవరీ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల పరంగా ఈ పథకం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ప్రస్తుతానికి మొత్తం పెట్టుబడుల్లో 92 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించింది. డెట్‌లో 2 శాతం పెట్టుబడులు ఉన్నాయి. మిగిలిన మేర నగదు నిల్వలను కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 69 స్టాక్స్ ఉన్నాయి. 82 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌నకే కేటాయించింది. మిడ్‌క్యాప్‌లో 13 శాతం, మిగిలిన మొత్తాన్ని స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇంధనం, ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, ఆటోమొబైల్, కమ్యూనికేషన్ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేయడాన్ని గమినించొచ్చు. ధర్మేష్ కక్కాడ్ ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈక్విటీ టాప్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం సన్‌ఫార్మా 10.05 భారతీ ఎయిర్టెల్ 6.96 ఎన్టీపీసీ 6.90 ఎంఅండ్ఎం 6.72 ఐటీసీ 5.33 యాక్సిస్బ్యాంకు 5.02 ఓఎన్జీసీ 4.32 హిందాల్కో 4.24 ఇన్ఫోసిస్ 4.08 బీపీసీఎల్ 3.61 చదవండి: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏదీ మంచిది ? -
ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటీ? తెలుసుకోండిలా..
స్టాక్‌మార్కెట్‌పై ఇండియన్లలో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న డిమ్యాట్ ఖాతాలే ఇందుకు నిదర్శనం. షేర్మార్కెట్లో తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి పొందడమనేది ఎంతో కీలకం. ఇందుకు అనుగుణంగా ఉండే వాటిలో ఫ్లెక్సీక్యాప్ పథకం ఒకటి. అసలు ఫ్లెక్సీక్యాప్ అంటే ఏంటీ ? ఇటీవల అధికంగా లాభాలు అందిస్తోన్న ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్కి సంబంధించిన వివరాలు... ఫ్లెక్సీక్యాప్ ఫ్లెక్సీక్యాప్ పథకాలు గతంలో మల్టీక్యాప్ ఫండ్స్ పేరుతో ఉండేవి. మల్టీక్యాప్ పథకాలు కచ్చితంగా స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ పథకాల్లో 25 శాతం చొప్పున కనీస పెట్టుబడులను నిర్వహించాల్సిందేనని.. లేదంటే ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి మారిపోవచ్చంటూ సెబీ గతేడాది నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో మల్టీక్యాప్ విభాగం నిబంధనలను కట్టుబడలేని పథకాలు ఫ్లెక్సీక్యాప్గా పేరు మార్చుకున్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ గడిచిన కొన్నేళ్లలో ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చాయి. ఫ్లెక్సీ క్యాప్ విభాగంలో మార్కెట్ విలువ పరంగా తమకు అనుకూలం అనిపించిన, భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకునే స్వేచ్ఛ ఫండ్ మేనేజర్లకు ఉంటుంది. ఫలానా విభాగంలో (స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్) కచ్చితంగా ఇంత మేర పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనలు ఈ పథకాలకు వర్తించవు. ఈ విభాగంలో కొన్ని పథకాలు గడిచిన ఏడాది కాలంలో గణణీయమైన రాబడులను అందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం (కనీసం పదేళ్లు అంతకుమించి) ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఫ్లెక్సీక్యాప్ పథకాలకు కొంత చోటు కల్పించుకోవచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ కూడా ఒకటి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ ఇన్వెస్టర్లకు 58 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఇదే కాలంలో ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడులు 51 శాతంగానే ఉండడాన్ని గమనించాలి. బీఎస్ఈ 500 సూచీ రాబడులు 53 శాతంతో పోల్చినా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం మెరుగైన పనితీరును చూపించినట్టు తెలుస్తోంది. ఇక గత మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 14 శాతానికి పైనే సగటు వార్షిక రాబడులను ఇచ్చింది. అంతేకాదు ఐదేళ్లలోనూ, ఏడేళ్లలోనూ, పదేళ్లలో కూడా వార్షిక సగటు రాబడులు 15 శాతం స్థాయిలోనే ఉన్నాయి. నిలకడైన పనితీరును ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. లక్ష ఇన్వెస్టే చేస్తే కోటి రూపాయలు ఆదిత్య బిర్లా ఫెక్సీక్యాప్ పథకంలో 22 ఏళ్ల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి అలాగే కొనసాగించి ఉంటే ప్రస్తుతం రూ.1.04 కోట్లు సమకూరేది. అంటే 104 రెట్లు వృద్ధి చెందేది. వార్షికంగా 22.57 శాతం చొప్పున కాంపౌండింగ్ రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో ఈ రిస్క్‌ను మించి రాబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌పై దృష్టి ప్రస్తుతం ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం నిర్వహణలో రూ.14,571 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 96.2 శాతం ఈక్విటీల్లో, డెట్ సాధనాల్లో 3.5 శాతం చొప్పున పెట్టుబడులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతానికి 65 స్టాక్స్‌ను నిర్వహిస్తోంది. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 68 శాతం, మిడ్‌క్యాప్‌లో 25 శాతం, స్మాల్‌క్యాప్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26 శాతం పెట్టుబడులు ఈ విభాగంలోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీల్లో 14 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 13 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. ఆయా రంగాల్లో దిగ్గజ కంపెనీలు, బలమైన యాజమాన్యాలు, కార్పొరేట్ పాలనలో పారదర్శకత, బలమైన బ్యాలన్స్ షీట్ ఇటువంటి అంశాల ఆధారంగా కంపెనీలను ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసుకుంటారు. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంకు 8.77 ఇన్ఫోసిస్ 8.46 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 7.05 డాక్టర్ రెడ్డీస్ 6.19 భారతీ ఎయిర్టెల్ 4.35 హెచ్‌సీఎల్ టెక్ 3.66 సన్‌ఫార్మా 2.75 బజాజ్ ఫైనాన్స్ 2.45 కోటక్ బ్యాంకు 2.24 ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ 2.22 -
మ్యూచువల్ ఫండ్లకు ఆర్బీఐ భారీ ప్యాకేజీ
సాక్షి, ముంబై : కోవిడ్ -19 సమయంలో ఆర్థిక భారాన్నిఎదుర్కొంటున్న సంస్థలను ఆదుకునేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)సోమవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ (ఎస్ఎల్ఎఫ్-ఎంఎఫ్), ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి రూ. 50,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్నిఅందించాలని నిర్ణయించినట్లు ఆర్బిఐ తెలిపింది. ఈ సదుపాయం ఈ రోజు నుంచి మే 11వ తేదీవరకు అందుబాటులో వుంటుందని స్పష్టం చేసింది. (కరోనా కట్టడి ఆశలు : లాభాల్లో మార్కెట్లు) కరోనా వైరస్ , లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఎమ్‌ఎఫ్‌లపై లిక్విడిటీ ఒత్తిడిని తగ్గించే ఉద్దేశ్యంతో, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎస్ఎల్ఎఫ్-ఎంఎఫ్ కింద, ఆర్బిఐ 90 రోజుల వ్యవధిలో రెపో కార్యకలాపాలను నిర్ణీత రెపో రేటుతో ఆర్బీఐ నిర్వహిస్తుంది. 2020 ఏప్రిల్ 27 నుండి 2020 మే 11 వరకు లేదా కేటాయించిన మొత్తానికి అనుమతి వుంటుంది. ఎస్ఎల్ఎఫ్-ఎంఎఫ్,ఆన్-ట్యాప్ఓ,పెన్-ఎండెడ్,బ్యాంకులుసోమవారం- శుక్రవారం వరకు(సెలవులు మినహాయించి) సంబంధిత నిధులు పొందటానికి తమ బిడ్లను సమర్పించవచ్చని తెలిపింది. ఎస్ఎల్ఎఫ్-ఎంఎఫ్ కింద లభించే లిక్విడిటీ సపోర్ట్ హెచ్‌టిఎమ్ పోర్ట్‌ఫోలియోలో చేర్చడానికి అనుమతించిన మొత్తం పెట్టుబడిలో 25 శాతానికి మించి మెచ్యూరిటీ (హెచ్‌టిఎం) ఉంటుందని వెల్లడించింది. ఈ మద్దతు బ్యాంకుల క్యాపిటల్ మార్కెట్ ఎక్స్పోజర్ పరిమితుల నుండి మినహాయించ బడుతుందని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్ధిక ఒత్తిడిపై ఆర్బిఐ అప్రమత్తంగా,ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.మరోవైపు ఈ వార్తలతో మ్యూచువల్ ఫండ్ షేర్లన్నీ దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో లాభాల జోష్ లో ఉన్నాయి. (కరోనా ఎఫెక్ట్ : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలనం) -
హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ ఐపీఓ 25 నుంచి
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎమ్‌సీ) ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 25 నుంచి ఆరంభమవుతోంది. దేశంలో రెండో అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ అయిన హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ ఈ ఐపీఓ ద్వారా రూ.2,800 కోట్లు సమీకరిస్తుందని అంచనా. రూ.5 ముఖ విలువ గల షేర్లను జారీ చేసే ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.1,095– 1,100ను కంపెనీ నిర్ణయించింది. కనీసం 13 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 27న ఈ ఐపీఓ ముగుస్తుంది. వచ్చే నెల 6న ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. 2.54 కోట్ల షేర్ల జారీ... హెచ్డీఎఫ్సీ, స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్ జాయింట్ వెంచర్‌గా హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఐపీఓలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో హెచ్డీఎఫ్సీ 4.08 శాతం వాటాకు సమానమైన 85.92 లక్షల షేర్లను, స్డాండర్డ్ లైఫ్ సంస్థ 7.95 శాతం వాటాకు సమానమైన 1.68 కోట్ల షేర్లను విక్రయిస్తాయి. మొత్తం 2.54 కోట్ల షేర్లను జారీ చేస్తారు. వీటిల్లో 2.21 కోట్ల షేర్లను మాత్రమే ప్రజలకు జారీ చేస్తారు. 3.20 లక్షల షేర్లను హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ ఉద్యోగులకు, 24 లక్షల షేర్లను హెచ్డీఎఫ్సీ ఉద్యోగులకు రిజర్వ్ చేస్తారు. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా), కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, బోఫా మెరిల్ లించ్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, సీఎల్ఎస్ఏ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, జేఎమ్ ఫైనాన్షియల్, జేపీ మోర్గాన్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ ఇండియాలు వ్యవహరిస్తున్నాయి. లిస్టవుతున్న ఐదో హెచ్డీఎఫ్సీ గ్రూప్ కంపెనీ ఈ ఏడాది మార్చినాటికి హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ నిర్వహణ ఆస్తులు రూ.3 లక్షల కోట్లుగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న రెండో మ్యూచువల్ ఫండ్ సంస్థ ఇది. గత ఏడాదే రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఏఎమ్‌సీ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. కాగా హెచ్డీఎఫ్సీ గ్రూప్ నుంచి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న ఐదో కంపెనీ ఇది. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్, గృహ్ ఫైనాన్స్‌లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. -
ఫండ్ డివిడెండులో పన్ను కోత ఉంటుందా?
నేను సుందరం గ్లోబల్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఇటీవలే ఈ ఫండ్ ఒక్కో యూనిట్‌కు రూ.1 డివిడెండ్‌ను ప్రకటించింది. ఆ ప్రకారం నాకు రూ.1,042 డివిడెండ్ లభించాలి. కానీ నాకు రూ.756.45 డివిడెండ్ మాత్రమే వచ్చింది. ఈ విషయమై సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థను సంప్రదించాను. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) పోగా మిగిలిన మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లించామని ఆ సంస్థ వెల్లడించింది. నేను చాలా సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాను. ఎలాంటి మినహాయింపులు లేకుండా పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు నాకు డివిడెండ్లు చెల్లించేవి. డీడీటీ కోత నాకు ఇదే మొదటిసారి. ఇప్పుడు నేను ఏం చేయాలి? - సాదిక్ ఆలీ, నిజామాబాద్ సుందరం గ్లోబల్ అడ్వాంటేజ్ ఫండ్ సంస్థ చేసినది సరైనదే. ఈక్విటీ యేతర మ్యూచువల్ ఫండ్లు డివిడెండ్లు చెల్లిస్తే, వీటిపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) తప్పనిసరి. అయితే ఈక్విటీ, బ్యాలెన్స్డ్ ఫండ్స్ డివిడెండ్లపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మీరు ఇన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకూ మీకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) పడలేదంటే మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉండి ఉండాలి. మొదటిసారిగా ఈక్విటీయేతర ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుంటారు. దీంతో డీడీటీ మీకు కొత్తగా అనిపిస్తుంది. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్ డీడీటీ మదింపు గత ఏడాది బడ్జెట్ నుంచి మారింది. గతంలో ఏదైనా సంస్థ రూ.100 డివిడెండ్‌ను ప్రకటిస్తే, రూ.128.3 డివిడెండ్ చెల్లింపుల కోసం కేటాయించేది. రూ.100 ఇన్వెస్టర్‌కు, రూ.28.3 పన్నులుగా చెల్లించేది. ఇలా కాకుండా స్థూల డివిడెండ్ మొత్తంపై డీడీటీని చెల్లించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీని ప్రకారం ఏదైనా డివిడెండ్ సంస్థ రూ.100 డివిడెండ్‌ను ప్రకటిస్తే, దానిపై 28.33 శాతం డీడీటీని ప్రభుత్వానికి, మిగిలిన దానిని ఇన్వెస్టర్‌కు మ్యూచువల్ ఫండ్ సంస్థలు చెల్లిస్తున్నాయి. నా వయస్సు 38 సంవత్సరాలు. వారం క్రితం ఈక్విటీ ఫండ్స్ నుంచి పెద్ద మొత్తమే రిడీమ్ చేశాను. మరో మూడు నెలల తర్వాత కానీ వీటి అవసరం నాకు ఉండదు. అప్పటి వరకూ ఈ పెద్ద మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటారా? లేక డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏమైనా పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? అలా అయిన పక్షంలో కొన్ని ఉత్తమమైన డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి. నేను 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. - పవన్, సికింద్రాబాద్ కార్పొరేట్ బాండ్లు, గిల్ట్ల్లో స్వల్పకాలానికి ఇన్వెస్ట్ చేసే షార్ట్ టెర్మ్ డెట్ ఫండ్స్‌ను ఎంచుకోండి. పన్ను ప్రయోజనాల విషయానికొస్తే ఫిక్స్డ్ డిపాజిట్లకు, డెట్ ఫండ్స్‌కు తేడా ఏమీ లేదు. వీటిపై వచ్చే రాబడులను మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ శ్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. పన్ను విషయాల్లో కాకుండా కొన్ని విషయాల్లో డెట్ ఫండ్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లకంటే మెరుగైనవి. డెట్ ఫండ్స్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపసంహరించుకోవచ్చు. ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. అదే ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికొస్తే, వాటిని మధ్యలో ఉపసంహరించుకుంటే కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని డెట్ ఫండ్స్ 7.5 శాతం నుంచి 10 శాతం రేంజ్లో రాబడులు ఇస్తాయి. ఇక మీరు ఇన్వెస్ట్ చేయడానికి పరిశీలించదగ్గ కొన్ని షార్ట్ టెర్మ్ డెట్ ఫండ్స్- పీర్లెస్ షార్ట్‌టెర్మ్, సుందరం సెలెక్ట్ షార్ట్‌టెర్మ్ డెట్ అసెట్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా ఆల్ట్రా షార్ట్ టెర్మ్ బాండ్ ఫండ్, టారస్ ఆల్ట్రా షార్ట్ టెర్మ్ బాండ్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ ఇన్కమ్ ఫండ్లు. నేను ఇటీవలనే ఎస్బీఐ ఎఫ్ఎంసీజీ ఫండ్‌లో రూ.లక్ష వరకూ ఇన్వెస్ట్ చేశాను. ఇది మంచి నిర్ణయమేనా? -మేఘమాల, విజయవాడ ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, ఇతర రంగాలు ఏమంత మంచి పనితీరు కనబరచకపోయినప్పటికీ, ఎఫ్ఎంసీజీ రంగం మాత్రం మంచి వృద్ధినే సాధించింది. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో ఎంత మంచి రాబడి ఇస్తున్న మ్యూచువల్ ఫండ్‌లోనైనా ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. మరీ ముఖ్యంగా ఏదైనా ప్రత్యేక రంగానికి చెందిన ఫండ్ అయితే అది అసలు మంచి నిర్ణయమే కాదు. అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేది వివిధీకరణ ప్రయోజనాలు పొందడానికే. అందుకని మీ పెట్టుబడులను కనీసం మూడు విభిన్నమైన మ్యూచువల్ ఫండ్స్‌కు విస్తరించండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని(సిప్) అనుసరిస్తే మంచి ప్రయోజనాలు పొందగలరు.