న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎమ్‌సీ) ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 25 నుంచి ఆరంభమవుతోంది. దేశంలో రెండో అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ఈ ఐపీఓ ద్వారా రూ.2,800 కోట్లు సమీకరిస్తుందని అంచనా. రూ.5 ముఖ విలువ గల షేర్లను జారీ చేసే ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.1,095– 1,100ను కంపెనీ నిర్ణయించింది. కనీసం 13 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 27న ఈ ఐపీఓ ముగుస్తుంది. వచ్చే నెల 6న ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.
2.54 కోట్ల షేర్ల జారీ...
హెచ్‌డీఎఫ్‌సీ, స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ జాయింట్ వెంచర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఐపీఓలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో హెచ్‌డీఎఫ్‌సీ 4.08 శాతం వాటాకు సమానమైన 85.92 లక్షల షేర్లను, స్డాండర్డ్ లైఫ్ సంస్థ 7.95 శాతం వాటాకు సమానమైన 1.68 కోట్ల షేర్లను విక్రయిస్తాయి. మొత్తం 2.54 కోట్ల షేర్లను జారీ చేస్తారు. వీటిల్లో 2.21 కోట్ల షేర్లను మాత్రమే ప్రజలకు జారీ చేస్తారు. 3.20 లక్షల షేర్లను హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ఉద్యోగులకు, 24 లక్షల షేర్లను హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు రిజర్వ్ చేస్తారు.
ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా), కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, బోఫా మెరిల్ లించ్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, సీఎల్‌ఎస్‌ఏ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్, జేఎమ్ ఫైనాన్షియల్, జేపీ మోర్గాన్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ ఇండియాలు వ్యవహరిస్తున్నాయి.
లిస్టవుతున్న ఐదో హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ కంపెనీ
ఈ ఏడాది మార్చినాటికి హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ నిర్వహణ ఆస్తులు రూ.3 లక్షల కోట్లుగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న రెండో మ్యూచువల్ ఫండ్ సంస్థ ఇది. గత ఏడాదే రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఏఎమ్‌సీ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. కాగా హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ నుంచి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న ఐదో కంపెనీ ఇది. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్, గృహ్ ఫైనాన్స్‌లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి.
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ఐపీఓ 25 నుంచి
Published Wed, Jul 18 2018 12:35 AM | Last Updated on Wed, Jul 18 2018 12:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment