మైలవరానికి కృష్ణా జలాలు
జమ్మలమడుగు,న్యూస్‌లైన్: మైలవరం జలాశయానికి మరో రెండు రోజుల్లో రెండు టీఎంసీల కృష్ణ జలాలు రానున్నాయి. మైలవరం, పెద్దముడియం, జమ్మల మడుగు, రాజుపాళెం మండలాలకు చెందిన రైతులు పత్తి, మిరప, పొద్దుతిరుగుడు,శనగ తదితర పంటలు వేశారు. రెండు నెలల నుంచి సరైన వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి.
నీటి కోసం అధికారుల చుట్టూ తిరిగి..
మైలవరం జలాశయంలో ఉన్న ఒక్క టీఎంసీ నీటిని మైలవరం ఉత్తర కాలువ ద్వారా టంగుటూరు, నొస్సం బ్రాంచ్, దేవగుడిబ్రాంచ్ కాలువకు విడుదల చేయాలని రైతులు అధికారులను కోరారు. దీంతోపాటు దక్షిణ కాలువకు కూడ నీటిని విడుదల చేయిస్తే పంటలకు కాస్త ఊరట కలుగుతుందని అధికారులు చుట్టూ తిరిగారు. జలాశయంలో ఉన్న టీఎంసీ నీటిని రైతుల కోసం విడుదల చేస్తే వచ్చే వేసవిలో ప్రజలు తా గునీటి కోసం ఇబ్బందులు పడతారని భావించిన కలెక్టర్ కోన శశిధర్ రైతులకోసం రెండు టీఎంసీల కృష్ణ జలాలు విడుదల కోరు తూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒత్తిడితో..
మరో వారం రోజుల్లో పంటపొలాలకు నీటిని వదలకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని వెంటనే రెండు టీఎంసీల నీటిని విడుదలచేయాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇరిగేషన్ మంత్రి సుదర్శన్‌రెడ్డిని కోరారు. నీటి విడుదల ఫైల్‌పై మంత్రి సంతకం చేయించడం తోపాటు ఫైల్ తొందరగా కదిలేటట్లు చర్యలు తీసుకున్నా రు. దీంతో రెండు టీఎంసీలనీరు ఆవుకు నుంచి గాలేరు-నగరి కాలువ ద్వారా విడుదలకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నాలుగు మండలాల రైతులకు ఊరట..
వర్షాలు పడక పంటలు దెబ్బతింటున్న రైతులకుృకష్ణ జలాలు విడుదలైతే కాస్త ఊరట కలుగుతుంది. మైలవరం, పెద్దముడియం జమ్మలమడుగు మండలాలకు చెందిన రైతులకే కాకుండ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాళెం రైతులకు కూడ ఈ నీరు ఉపయోగకరం. నాలుగు మండలాల్లో దాదాపు 15వేలకు పైగా పంట వివిధరకాల పంటలను వేశారు. రెండుటీఎంసీలనీటిని ఆవుకు నుంచి విడుదల అయితే వెంటనే ఉత్తరకాలువతోపాటు ఉపకాలువలకు కూడ నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.