మైలవరం జలాశయంలో మృతదేహాల కలకలం | bodys found in Mylavaram Dam | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 15 2017 3:25 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న మైలవరం జలాశయంలో ఐదు మృతదేహాలను స్థానికులు కనుగొన్నారు. అందులో ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశారు. అదేవిధంగా జలాశయం వద్ద 5 ఆధార్‌ కార్డులను కనుగొన్నారు. మరో రెండు మృతదేహాలను వెలికి తీయాల్సి ఉంది. రాజీవ్‌ నగర్‌ కాలనీకి చెందిన షేక్‌ వాహెద్‌ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement