deadbodys
-
మైలవరం జలాశయంలో పెనువిషాదం
-
మైలవరం జలాశయంలో మృతదేహాల కలకలం
-
మైలవరం జలాశయంలో మృతదేహాల కలకలం
కడప: వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న మైలవరం జలాశయంలో ఐదు మృతదేహాలను స్థానికులు కనుగొన్నారు. అందులో ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశారు. అదేవిధంగా జలాశయం వద్ద 5 ఆధార్ కార్డులను కనుగొన్నారు. మరో రెండు మృతదేహాలను వెలికి తీయాల్సి ఉంది. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన షేక్ వాహెద్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గోదావరిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం
కొవ్వూరు: ఆదివారం సాయంత్రం గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణానికి చెందిన నందిగాం జయదేవ్(15), సూర్యసుమంత్(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో.. కొవ్వూరు గోశ్పాద క్షేత్రం వద్ద స్నాన ఘట్టంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం ఉదయం మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.