mystery reveal
-
టీచర్ సులోచన కేసులో వీడిన మిస్టరీ.. గాయత్రి భర్తే కారణం!
మైసూరు: సుమారు 6 నెలల కిందట మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణంలో జరిగిన వసతి పాఠశాల ఉపాధ్యాయురాలు సులోచన (45) హత్య కేసు మిస్టరీ వీడిపోయింది. నంజనగూడు నగరసభ సభ్యురాలితో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మొరార్జి దేశాయి వసతి పాఠశాల హిందీ టీచర్ సులోచన మార్చి నెల 9వ తేదీన దారుణ హత్యకు గురైంది. అప్పటి నుంచి హంతకుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నగరసభ సభ్యురాలు గాయత్రి మురుగేశ్, ఆమె బంధువు భాగ్య, నాగమ్మ, కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని వెల్లడైంది. తన భర్తతో సన్నిహితంగా ఉందని.. సులోచన భర్త నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఇక గాయత్రి భర్త మురుగేష్ శ్రీకంఠేశ్వర దేవాలయంలో డి గ్రూప్ ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ఇతనికి, టీచర్‌కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఉండడం అనేకసార్లు గాయత్రి గమనించి కసితో రగిలిపోయింది. తన భర్తను కలవవద్దని గాయత్రి టీచరమ్మను హెచ్చరించినప్పటికీ తీరు మారలేదు. దీంతో శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలనుకుంది. నంజనగూడులోనే అద్దె ఇంట్లో సులోచన ఉండేది. మరో ముగ్గురి సహకారంతో సులోచన ఇంటికి వెళ్లి ఆమెను గొంతు పిసికి చంపి హత్య చేసినట్లు గాయత్రి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సులోచనకు ఒక పెళ్లయిన కూతురు, బెంగళూరులో ఉద్యోగం చేసే కొడుకు ఉన్నారు. ఇది కూడా చదవండి: అర్పిత 31 ఎల్ఐసీ పాలసీల్లో నామినీగా పార్థ ఛటర్జీ! -
వీడిన ఏడు నెలల మిస్టరీ
♦ చోరీ విషయం బయటపడుతుందనే హత్య! ♦ 7 నెలల తర్వాత వీడిన వృద్ధురాలి హత్య మిస్టరీ ♦ నిందితుడిని పట్టించిన సెల్‌ఫోన్ కాల్‌డేటా ♦ వివరాలు వెల్లడించిన తాండూరు రూరల్ సీఐ సైదిరెడ్డి తాండూరు రూరల్: ఏడు నెలల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడితోపాటు అతడికి సహకరించిన కుటుంబీకులను కటకటాల వెనక్కి పంపారు. తన చోరీ విషయం బయటపడుతుందని భయపడి గతంలో పనిచేసిన పాలేరు వృద్ధురాలి గొంతు నులిమి చంపేశాడు. కేసు వివరాలను రూరల్ సీఐ సైదిరెడ్డి సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. మండలంలోని మిట్టబాస్పల్లికి చెందిన పట్లోళ్ల అనసూజమ్మ(81) గత ఏడాది డిసెంబర్ 25న హత్యకు గురైంది. ఆమె రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు గొంత నులిమి చంపేశారని పోలీసులు గుర్తించి విచారణ ప్రారంభించారు. మిట్టబాస్పల్లికి చెందిన షేక్ ఇస్మాయిల్ గతంలో అనసూజమ్మ ఇంట్లో పదేళ్లు పాలేరుగా పనిచేశాడు. అనంతరం పనిమానేసి ఖాళీగా తిరుగుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గతంలో తాను పాలేరుగా పనిచేసిన అనసూజమ్మ ఇంటిని ఎంచుకున్నాడు. ఈక్రమంలో గత డిసెంబర్ 24న రాత్రి అతడు అనసూజమ్మ ఇంట్లోకి చొరబడ్డాడు. దేవుడి గదిలో ఉంచిన హుండీలో ఉన్న రూ. వెయ్యితో పాటు 8 గ్రాముల బంగారం, ఒక సెల్‌ఫోన్ అపహరించాడు. అలికిడికి అనసూజమ్మ నిద్రలేచింది. చోరీకి పాల్పడిన ఇస్మాయిల్‌ను గుర్తించింది. ఇస్మాయిల్ అనసూజమ్మ తన చోరీ విషయం బయటకు చెబుతుందని భయపడ్డాడు. దీంతో ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి ఇంటికెళ్లాడు. మరుసటి రోజు ఇస్మాయిల్ వద్ద ఉన్న డబ్బును గమనించిన అతడి భార్య నసీమాబేగం గొడవకు దిగింది. దీంతో ఇస్మాయిల్‌ను తండ్రి ఫక్రొద్దీన్ నిలదీశాడు. జరిగిన విషయాన్ని ఇస్మాయిల్ కుటుంబీకులకు చెప్పాడు. భయాందోళకు గురైన ఫక్రొద్దీన్ కొడుకు, కోడలిని కరణ్‌కోట గ్రామానికి వలస పంపాడు. అయితే గత రంజాన్ పండుగ సమయంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో చోరీ చేసిన 8 గ్రాముల బంగారాన్ని విక్రయించాలని ఇస్మాయిల్ నిర్ణయించుకున్నాడు. అంతారం అనుబంధ దస్తగిరిపేటలోని తన సమీప బంధువు ఇబ్రహీంకు బంగారం ఇవ్వడంతో అతడు తాండూరు పట్టణంలోని ఓ జ్యువెలరీ షాపులో విక్రయించాడు. చోరీ చేసిన సెల్‌ఫోన్‌ను ఇస్మాయిల్ ఓ హిటాచీ డ్రైవర్‌కు రూ.600కు విక్రయించాడు. సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు హిటాచీ డ్రైవర్‌ను విచారించారు. దీంతో ఇస్మాయిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరుపగా తానే హత్య చేశానని నేరం అంగీకరించాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన భార్య నసీమాబేగం, తండ్రి ఫక్రొద్దీన్పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం రిమాండుకు తరలించారు. -
చంపుతాడేమోనని భయపడి చంపేశాడు!
♦ వీడిన యువకుడి హత్య మిస్టరీ ♦ నిందితుడి అరెస్టు ♦ వివరాలు వెల్లడించిన ఏసీపీ అశోక్‌కుమార్ రంగారెడ్డి జిల్లా: శామీర్‌పేట్ యువకుడి హత్య మిస్టరీ వీడింది. డబ్బుల విషయమై తనను చంపుతాడేమోననే భయంతో హతుడి తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి అతడిని చంపేశాడు. శామీర్‌పేట్ ఠాణాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అశోక్‌కుమార్ సీఐ సత్తయ్యతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. గురువారం మండలంలోని మజీద్‌పూర్ శివారులో ఐలయ్య అనే వ్యక్తి హత్య వెలుగుచూసిన విషయం తెలిసిందే. మండలంలోని మూడుచింతలపల్లికి చెందిన బుడగజంగం చింతల గోపాల్(52) పశువుల కాపరి. అతడు మెదక్ జిల్లా గజ్వేల్‌కు చెందిన సత్తమ్మతో సహజీవనం చేస్తూ మజీద్పూర్లో ఉంటున్నాడు. ఆమెకు ఓ కూతురుతోపాటు కుమారుడు ఐలయ్య(28) ఉన్నాడు. ఐలయ్య గజ్వేల్‌లోని ఓ సినిమా థియేటర్లో పనిచేస్తూ తరచూ తల్లి వద్దకు వస్తుండేవాడు. అయితే, తల్లి, గోపాల్ సంపాదన విషయంలో ఐలయ్య గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 26 సాయంత్రం ఐలయ్య మజీద్‌పూర్ వచ్చి ఇంటి అరుగు మీద నిద్రించాడు. తల్లితోపాటు వచ్చిన గోపాల్‌తో అతడు తిరిగి డబ్బుల విషయమై గొడవపడ్డాడు. రాత్రి 9గంటల సమయంలో సత్తమ్మ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించింది. అనంతరం ఐలయ్య, గోపాల్‌తో మళ్లీ ఘర్షణకు దిగారు. గోపాల్‌ను చంపుతానని ఐలయ్య బెదిరించాడు. తనను చంపుతానని ఐలయ్య బెదిరించడంతో గోపాల్ భయపడ్డాడు. తనను ఎలాగైనా అంతం చేస్తాడని భావించాడు. ఐలయ్యతో తనకు ఎప్పటికైనా ముప్పు పొంచి ఉందనుకున్నాడు. ఈ క్రమంలో ఐలయ్యను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదేరోజు రాత్రి 11:30 గంటలకు గోపాల్ తన ఇంట్లో ఉన్న రాతి రోలును ఐలయ్య తలపై మోదడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఐలయ్య చనిపోయాడని నిర్ధారణకు వచ్చిన గోపాల్ ఇంట్లో మృతదేహం ఉంటే తనపై అనుమానం వస్తుందని భావించి దానిని అక్కడి నుంచి ఊరు బయట పడవేయాలనుకున్నాడు. గ్రామ పంచాయతీ చెత్త తీసుకెళ్లే రిక్షాను తీసుకొచ్చి ఐలయ్య మృతదేహాన్ని అందులో వేసి గ్రామ శివారులోని మజీద్‌పూర్-మేడ్చల్ రహదారి పక్కన పడేశాడు. ఘటన వెలుగుచూసిన రోజు పోలీసులు క్లూస్ టీం, జాగిలాలతో వివరాలు సేకరించారు. హతుడి తల్లి సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు. ఈమేరకు గోపాల్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా హత్య విషయం అంగీకరించి పైవిషయాలు వెల్లడించారు.