n harikrishna
-
'టీడీపీ' అవకాశవాద రాజకీయాలకు కేంద్రం: కేటీఆర్
అవకాశవాదానికి, అనైతిక రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ కేంద్రంగా మారిందని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలుగుదేశంపార్టీపై టీఆర్ఎస్ నేత కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. తెలుగు జాతి కలిసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారన్నా హరికృష్ణ వాదనకు అర్థం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో రాష్ట్రాన్ని విభజించాలని ఎన్టీఆర్ స్వయంగా కోరారని ఈ సందర్బంగా కేటీఆర్ గుర్తు చేశారు. హరికృష్ణ చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబును తెలుగుదేశం పార్టీలకి తీసుకోవద్దని గతంలోనే ఎన్టీఆర్‌కు చాలా మంది సూచించారని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇంత జరుగుతున్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు తప్ప మరే కమిటీలను అంగీకరించమని కేటీఆర్ స్పష్టం చేశారు. -
తెలంగాణపై మళ్లీ కమిటీలు వేస్తే తీవ్ర పరిణామాలు
తెలంగాణపై మళ్లీ కమిటీలు వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు కేంద్రాన్ని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా ఆలస్యం జరిగితే తెలంగాణ ప్రాంతంలో ప్రశాంతత కొరవడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటుపై భారతీయ జనతాపార్టీ అనుసరిస్తున్న వైఖరి పలు అనుమానాలకు తావిస్తుందని హరీష్ రావు సందేహాం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై హరీష్ రావు ఈ సందర్భంగా ఘాటుగా స్పందించారు. సొంత సోదరుడు బాలకృష్ణ తో కలిసి ఉండలేని హరికృష్ణ తెలుగు ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నారని ప్రశ్నించారు. తెలుగు ప్రజలకు బహిరంగలేఖ రాసే బదులు తెలుగుదేశం పార్టీ అధినేత, బావ చంద్రబాబుకు లేఖ రాస్తే మంచిదని హరీష్‌రావు ఈ సందర్భంగా హరికృష్ణకు సూచించారు. కన్న తండ్రి ఎన్టీఆర్‌పై సొంత బావ చంద్రబాబు కోసం చెప్పులు వేయించిన ఘనత హరికృష్ణ సొంతమని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి హరికృష్ణ ఇప్పడు తన తండ్రి ఆశయాలు అంటూ మాట్లాడుతున్నారని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. -
రాహుల్ కోసమే రాష్ట్ర విభజన: హరికృష్ణ
-
రాహుల్ కోసమే రాష్ట్ర విభజన: హరికృష్ణ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని దేశ ప్రధాన మంత్రిని చేసేందుకే యూపీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మొగ్గు చూపుతోందని రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఆరోపించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేంలో ఆయన మాట్లాడారు. రానున్న సాధారణ ఎన్నికల్లో రాహుల్‌ను మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోందని ఆయన పేర్కొన్నారు. విభజనకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తర్వలో యాత్ర చేపడతానన్నారు. హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాలవారి సమాహారం అని హరికృష్ణ తెలిపారు. అలనాడు మహాభారతంలో పాండవులు, కౌరవులు మధ్య శకుని పోషించిన పాత్రను ఈనాడు కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ గురువారం తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. హరికృష్ణ చర్యపై ఓయూ జేఏసీ గురువారం తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసింది. నందమూరి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ చిత్రాల విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హరికృష్ణ శుక్రవారం పై విధంగా స్పందించారు.