వైఎస్సార్సీపీలో మరో నియామకం
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిండెంట్‌గా నాన్యంపల్లె హరీష్ కుమార్ యాదవ్‌ను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్రకార్యాలయ వర్గాలు తెలిపాయి. పార్టీ స్థాపించినప్పటి నుంచి రాష్ట్ర యువజన విభాగంలో హరిష్ కుమార్ చురుగ్గా పనిచేశారు. ఇప్పటి వరకూ ఆయన యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హరీష్ కుమార్‌ను యవజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి.