Nadighar committee
-
సినీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
సాక్షి, చెన్నై: కరోనా మహమ్మారి సినీ కళాకారులను మరోసారి ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా షూటింగ్‌లు రద్దు అవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా నడిగర్ సంఘం ఎన్నికలు జరిగినా ఫలితాలు నిలిపివేయడంతో రెండేళ్లకు పైగా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. దీంతో ఆ సంఘానికి చెందిన పేద సభ్యులకు ఎలాంటి సాయం అందని పరిస్థితి. దీంతో సంఘం సమస్యను పరిష్కరించాల్సిందిగా విశాల్ ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఆ సంఘం మాజీ అధ్యక్షుడు నాజర్ కూడా సంఘం సభ్యులను ఆర్థికసాయంతో ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న సినీ, నాటక రంగ కళాకారులకు నడిగర్ సంఘం ట్రస్ట్ సభ్యుడు పూచి మురుగన్ సోమవారం బియ్యం, కాయగూరలు వంటి నిత్యావసర వస్తువులను అందించారు. సుమారు 300కు పైగా సంఘ సభ్యులు ఈ కరోనా సాయాన్ని అందుకున్నారు. పూచి మురుగన్‌తో పాటు నటి కోవై సరళ, నటుడు దాడి బాలాజీ పాల్గొన్నారు. చదవండి: తమిళనాడు: ఆ ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయి? -
విశాల్ వర్గానికి షాక్
తమిళనాడు,పెరంబూరు: నటుడు విశాల్, నాజర్, కార్తీ వర్గానికి చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ సంఘానికి గత ఏడాది జూన్‌లో జరిగిన ఎన్నికలు చెల్లవంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. గత ఏడాది జూన్ 23వ తేదీన నడిగర్ సంఘం (దక్షిణ భారత నటీనటుల సంఘం)కు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నాజర్ అధ్యక్షతన పాండవర్ పేరుతో ఒక జట్టు, దర్శక, నటుడు కే.భాగ్యరాజ్ అధ్యక్షతన స్వామి శంకరదాస్ పేరుతో ఒక జట్టు పోటీ చేశాయి. ఎన్నికలు జరిగినా ఓట్ల లెక్కింపు చేపట్ట లేదు. కారణం తమకు ఓటు హక్కును రద్దు చేయడంతో ఎన్నికలను బహిష్కరించాలని సంఘ సభ్యులు బెంజిమెన్, ఏలుమలై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంఘ నిర్వాకంలో పలు అవకతవకలు జరిగాయని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల గడువు పూర్తయిన ఆరు నెలల తరువాత నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపును నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాండవర్ జట్టుకు చెందిన నాజర్, విశాల్, కార్తీ తదితరులు సంఘం ఎన్నికలు సక్రమంగానే జరిగాయని, సంఘం నుంచి అర్హత లేని సభ్యులనే తొలగించామని, కాబట్టి ఓట్ల లెక్కింపునకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ రిట్ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఎన్నికల వ్యవహారం కోర్టులో ఉండడంతో ప్రభుత్వం సంఘ నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక అధికారిని నియమించింది. ఆ అధికారి నియమాకాన్ని వ్యతిరేకిస్తూ విశాల్ వర్గం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ఎన్నికలపై నమోదైన పిటిషన్లపై పలు దఫాలుగా కోర్టు విచారణ జరిపింది. అన్ని పిటిషన్లపై తీర్పును శుక్రవారం వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి కల్యాణ సుందరం గురువారం ప్రకటించారు. శుక్రవారం న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. అందులో ఇంతకు ముందు జరిగిన సంఘం ఎన్నికలు చెల్లవని, సంఘ నిర్వాకం గడువు పూర్తి అయిన తరువాత ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్ధమని తెలిపారు. సంఘానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఆదీ మూడు నెలల్లో నిర్వహించాలని ఆదేశించింది. సంఘం సభ్యుల పట్టికను కొత్తగా తయారు చేయాలని, ఎన్నికల పర్యవేక్షణకు పూర్వ న్యాయమూర్తి గోకుల్‌దాస్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. అప్పటి వరకూ ఎన్నికల అధకారిణిగా గీతనే సంఘం బాధ్యతలను నిర్వహిస్తారని న్యాయస్థానం పేర్కొంది. కాగా హైకోర్టు తీర్పు నాజర్ వర్గానికి షాక్‌కు గురిచేసింది. మరి ఈ తీర్పును సవాల్ చేస్తూ వారు సుప్రీం కోర్టుకు వెళ్లతారా, లేక చెన్నై హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటారా? అన్నది చూడాలి. విశాల్ వర్గం సుప్రీంకు వెళ్లకూడదు మద్రాసు హైకోర్టు తీర్పు సినీ వర్గాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంఘ మాజీ కార్యదర్శి, సంఘం నుంచి సస్పెండ్ అయిన సభ్యుడు, సీనియర్ నటుడు రాధారవి న్యాయస్థానం తీర్పును స్వాగతించారు. ఆయన మాట్లాడుతూ సంఘం నుంచి సాధారణ సభ్యులకు ఆర్థిక సాయం అందాలన్నారు. కాబట్టి తొలగించిన సభ్యులను మళ్లీ చేర్చుకుని మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న తీర్పు మంచిదేనన్నారు. తనను సంఘం నుంచి తొలగించడమే తప్పు అని అన్నారు. అది చట్టప్రకారం చెల్లదని, తనను సంఘంలో ఉండకూడదని భావించి చేసిన కుట్ర అది అని అన్నారు. చెడ్డవాడు చెడునే భావిస్తాడన్నారు. విశాల్ మంచి వాడేనని, కాలు పెడితే కొలనులో తాబేలు మాదిరి అన్నీ తను కాలు పెట్టిన నడిగర్ సంఘం, నిర్మాతల సంఘం నాశనమయ్యాయన్నారు. సక్రమంగా ఉంటే మంచిగా జరిగేదన్నారు. విశాల్వర్గం కాల వ్యవధి దాటిన తరువాత ఎన్నికలు నిర్వహించడం పెద్ద తప్పు అని, అలాగే పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సంఘ సభ్యులకు పెన్షన్లు ఆగిపోతున్నాయని చెబుతున్న విశాల్ వర్గం మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, సుప్రీంకోర్టుకు వెళ్లితే ఆ కేసు విచారణకు మూడేళ్లు పడుతుందని చెప్పారు. కాగా న్యాయస్థానం తీర్పును విశాల్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన నిర్మాత ఐసరి గణేశ్ స్వాగతించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
క్రైంబ్రాంచ్ పోలీసుల ఎదుటకు విశాల్
చెన్నై ,పెరంబూరు: నడిగర్ సంఘం స్థల విక్రయ వ్యవహారంలో ఆ సంఘం కార్యదర్శి, నటుడు విశాల్ మంగళవారం ఉదయం కాంచీపురం నేర పరిశోధన పోలీసుల ఎదుట హాజరయ్యారు. వివరాలు చూస్తే కాంచీపురం జిల్లా వేంకట మగళంలో నడిగర్ సంఘంకు చెందిన 26 సెంట్ల స్థలం ఉండేది. దాన్ని గత సంఘ నిర్వాహకులైన నటుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి విక్రయంలో అవకతవకలకు పాల్పడినట్లు ప్రస్తుత సంఘ కార్యదర్శి కాంచీపురం నేర పరిశోధన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. కాగా ఈ కేసును వేరే న్యాయ మూర్తి విచారించేలా మార్చాల్సిందిగా ప్రస్తుత సంఘ కార్యదర్శి న్యాయస్తానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి విశాల్ ఫిర్యాదుపై సమగ్రంగా దర్యాప్తు చేసి రెండు వారాల్లో వివరాలను కోర్టుకు సమర్పించాల్సిందిగా కాంచీపురం జిల్లా నేరపరిశోధన పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నటుడు విశాల్‌ను కేసుకు సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా ఇటీవల సమన్లు జారీ చేశారు. అయితే అప్పుడు వేరే ప్రాంతంలో షూటింగ్లో ఉండడం వల్ల హాజరు కాలేనని చెప్పిన విశాల్ మంగళవారం ఉదయం కాంచీపురం నేరపరిశోధన పోలీసుల ముందు హాజరై కేసుకు సంబంధించిన వివరాలను పోలిసులకు అందజేశారు. -
వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం : విశాల్
తమిళసినిమా : ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ ఉద్ఘాటించారు. ఈనెల 18న ఈ సంఘం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. శరత్‌కుమార్ జట్టుతో పోటీపడ్డ విశాల్ జట్టు విజయం సాధించిన సంగతి విదితమే. సంఘం నూతన కార్యవర్గం ఆదివారం ఉదయం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో పత్రికల వారికి ధన్యవాద సమావేశం ఏర్పాటు చేశారు. తమిళ నిర్మాతల మండలి, తమిళ దర్శకుల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య, సినీ పీఆర్ఓల సంఘం, సినీ పత్రికా విలేకరుల సంఘం, సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సంఘం నిర్వాహకులు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్‌సంఘం) నూతర కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నటుడు మోహన్‌బాబు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తన అనుచరునితో పూలగుచ్ఛం పంపి అభినందనలు తెలిపారు. మంచి చెయ్యాలన్న లక్ష్యంతోనే.. సంఘం అధ్యక్షుడు నాజర్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపునకు తోడ్పడిన వారందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ఎన్నికలకు ముందు సంఘటనలను మరచి సంఘ సభ్యుల పరిరక్షణ కోసం సంఘటితంగా కృషి చేస్తామని అన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రధానంగా సంఘం భవన నిర్మాణం గురించి త్వరలోనే సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణానికి సంబంధించిన ఒప్పంద రద్దు విషయాన్ని శరత్‌కుమార్ విలేకరుల సమావేశంలో ప్రకటించారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ చేతికి అందగానే తదుపరి చర్యలపై చర్చిస్తామని చెప్పారు. సంఘం ట్రస్టీగా కమలహాసన్.. ముఖ్యమైన విషయం ఏమిటంటే దక్షిణ భారత నటీనటుల సంఘం ట్రస్టీగా వ్యవహరించడానికి నటుడు కమలహాసన్ అంగీకరించారని విశాల్ తెలిపారు. సంఘ సభ్యులకు సేవా కార్యక్రమాల గురించిన ముఖ్య విషయాలను వేల్స్ విశ్వవిద్యాలయం చాన్సలర్ ఐజనీ గణేశ్ వెల్లడిస్తారని అన్నారు. బాధ్యతలను పంచుకున్నాం సంఘం కోశాధికారిగా బాధ్యతలు చేపట్టిన నటుడు కార్తీ మాట్లాడుతూ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ఈ విషయంలో బాధ్యతలను పంచుకున్నామని చెప్పారు. ముందుగా రంగస్థల నటుల వివరాలను సేకరించే పనిలో భాగంగా రాష్ట్రంలోని ఊరూరా తిరిగి వారి స్థితిగతులను తెలుసుకుని ఆర్థిక సాయం, వైద్య సేవలు, పిల్లలకు విద్యాసాయం తదితర అంశాల గురించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉపాధ్యక్షుల్లో ఒకరయిన పొన్వన్నన్ మాట్లాడుతూ తాము చేసిన 41 వాగ్దానాల్లో ఇప్పటికే ఐదు నెరవేర్చామని, మిగిలినవీ అమలు పరుస్తామని అన్నారు. వేల్స్ విశ్వవిద్యాలయం చాన్సలర్ ఐజనీ గణేశ్ మాట్లాడుతూ తన తండ్రి పేరుతో నెలకొల్పిన ఐజరీ వేల్స్ ట్రస్ట్ ద్వారా ఇంతకు ముందు 100 మంది నాటక కళాకారులకు ప్రతినెలా 500 రూపాయల చొప్పున సాయం అందించానని, ఇకపై ఆ మెత్తాన్ని వెయ్యికి పెంచుతున్నానని వెల్లడించారు. 105 మంది నాటకరంగ కళాకారుల పిల్లలకు ఉచ్చిత విద్య అందించనున్నట్లు హామీ ఇచ్చారు. సంఘం భవన నిర్మాణానికి తనవంతు సాయం ఉంటుందన్నారు. దీనిపై అక్కడికి హాజరైన సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
నడిగర్ సంఘానికి హీరో సూర్య విరాళం
తమిళ సినిమా : దక్షిణ భారత నటీనటుల సంఘానికి హీరో సూర్య రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆదివారం చెన్నైలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి వివరించిన సంఘం నిర్వాహకులు సంఘం భవన నిర్మాణం గురించి మాట్లాడుతూ అందుకు నిధి చాలా అవసరం అవుతుందన్నారు. ప్రస్తుతం సంఘానికి 29 లక్షల 37 వేల 17 రూపాయల 84పైసలతో పాటు 87 లక్షల 75 వేలు బ్యాంక్ డిపాజిట్ మాత్రమే ఉందన్నారు. ఈ వ్యవహారంలో పూర్తిగా ఆడిటింగ్ జరపాల్సి ఉందన్నారు. భవన నిర్మాణం కోసం స్టార్ నైట్ కార్యక్రమాలు లాంటివి చేస్తామని చెప్పారు. యువ నటులంతా కలిసి ఓ చిత్రంలో నటించి దాని ద్వారా నిధిని రాబడతామని, అలాగే స్టార్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని సంఘ కార్యదర్శి విశాల్ వెల్లడించారు. ఈ సమావేశం జరుగుతుండగానే నటుడు సూర్య సంఘానికి 10 లక్షల విరాళం అందించనున్నట్లు సంఘం నిర్వాహకులు వెల్లడించారు.