ముగ్గురు వాహన దొంగలు అరెస్టు
- 15 బైక్ లు స్వాధీనం
విజయవాడ
ద్విచక్ర వాహనా చోరీలకు పాల్పడుతునన ముగ్గురు దొంగలను విజయవాడ నగరంలో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగరంలో ద్విచక్ర వాహనాల మాయంపై ఫిర్యాదులు పెరుగుతుండడంతో కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల సందర్భంగా బొండు నాగ మోహన్ (40), కిరణ్(19)తోపాటు ఓ జువైనల్ను పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తాము ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్టు వెల్లడించంతో... వారి నుంచి 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.