nail cutter
-
బాబోయ్.. అసలు ఇంతకాలం నువ్వు ఎలా బతికావ్!
వాషింగ్టన్: పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అని సామెత. దీనికి తగ్గట్లుగానే మనుషులకు రకరకాల ఆసక్తులుంటాయి. కొన్ని వినడానికి.. చూడటానికి బాగుంటాయి. కొందరు ఆసక్తులు గమనిస్తే.. బాబోయ్ ఇదేం పిచ్చి అనిపిస్తుంది. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన వారంతా వీడియోలో ఉన్న మహిళను అసలు ఇంతకాలం నువ్వు ఎలా బతికావ్ అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఆ మహిళ ఆసక్తి ఏంటి.. ఎందుకు ఆమెని ఇలా ప్రశ్నస్తున్నారో తెలియాలంటే ఇది చదవాల్సిందే. అమెరికాకు చెందిన అయాన్న విలియమ్స్‌కు చేతి వేలి గోర్లు పెంచడం ఆసక్తి. మీరు చదివింది నిజమే. నెయిల్స్ పెంచడం అంటే ఇమెకు ఎంత పిచ్చి అంటే గత ముప్పై ఏళ్లుగా ఒక్క సారి కూడా తన చేతి గోళ్లను కత్తిరించలేదు. సాధారణంగా వారం రోజుల పాటు నెయిల్స్ కట్ చేయకుంటేనే పొడవుగా పెరుగుతాయి. అలాంటిది ముప్పై ఏళ్లుగా గోళ్లను కట్ చేయకపోతే ఇక అవి ఏ రేంజ్లో పెరిగి ఉంటాయో మీరే ఊహించుకోండి. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం అనగా 2017లో అయాన్న విలియమ్స్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోర్లు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డులోకి కూడా ఎక్కింది. ఇప్పుడు ఈ మహిళ వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే.. కొద్ది రోజుల క్రితం అయాన్న తన గోర్లను కట్ చేసింది. 28 ఏళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా పెంచిన గోళ్లను కట్ చేసింది. దీనికి ముందు ఆమె నెయిల్స్ సైజును మరోసారి కొలిచారు. 2017తో పోలిస్తే.. అయాన్న గోళ్ల పొడవు ఇప్పుడు మరింత పెరిగింది. దాంతో ఆమె తన రికార్డును తానే అధిగమించింది. ప్రస్తుతం అయాన్న గోళ్లు 24.07 పీట్స్ పొడవున్నాయి. ఎలక్ట్రిక్ కట్టర్‌తో అయాన్న గోళ్లను కత్తిరించారు. ఈ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా అయాన్న మాట్లాడుతూ.. ‘‘దాదాపు గత 3 దశాబ్దాలుగా నేను నా చేతి వేలి గోళ్లను కాపాడుకుంటూ వచ్చాను. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వీటిని పెంచాను. కానీ ఇప్పుడు మారాల్సిన సమయం వచ్చింది. అందుకే వాటిని కత్తిరించాను’’ అని తెలిపారు. ఇక అయాన్న గోర్లు చూసిన వారంతా అసలు ఇంత కాలం నీవ్వు ఇంటి పనులు ఎలా చేసుకున్నావ్.. ఇంత పెద్ద గోర్లతో తల దువ్వుకోవడం.. ఇంటిని శుభ్రపర్చడం.. గిన్నెలు తోమడం, బట్టలుతకడం వంటి పనులు ఎలా చేశావ్.. ఈ పనులన్నింటికి ఇబ్బంది పడుతూ నువ్వు ఎలా బతికావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. చదవండి: 13 గిన్నిస్లు సాధించిన హైదరాబాద్ యువతి -
గోరు గిల్లుకోకుండా చేశారు! :
ఆవిష్కరణం చాలామందికి ఇప్పటికీ గోళ్లు గిల్లుకునే అలవాటు ఉంటుంది. పాపం నెయిల్ కటర్ వచ్చాక వారి పనిని తప్పుపట్టే వారు పెరిగారు. అంతకముందయితే గోళ్లు కత్తిరించుకోవడానికి అదో మార్గం. ఆ తర్వాత అది ఓ చెడ్డ అలవాటు తప్ప ఇంకేం కాదని తేలిపోయింది. నెయిల్ కటర్ కనిపెట్టడంతో బ్లేడుతో అతి జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సిన బాధ పోయింది. చాలా సింపుల్‌గా ఒక్క నిమిషంలో గోళ్లన్నీ తీసేసుకునే సౌలభ్యం కలిగింది. మనిషి నాగరికత నేర్చి ఇప్పటికి నాలుగువేల సంవత్సరాలు దాటింది. అప్పట్లోనే గోళ్లు తీసుకునే అలవాటు ఉండేది. చిన్న పదునైన కత్తితో వారు గోళ్లు తీసుకునేవారు. చిత్రమేంటంటే... దాదాపు వందేళ్ల క్రితం వరకు కూడా దానికోసం మనవాళ్లు ఏమీ కనిపెట్టలేకపోయారు. 18వ శతాబ్దంలో నెయిల్ కటర్ ఆవిష్కరణ జరిగింది. దీన్ని ఎవరు కనిపెట్టారన్నది సరిగ్గా తెలియదు గాని... తొలి పేటెంట్ మాత్రం 1875లో వేలంటైన్ ఫర్గెటీ అనే ఓ అమెరికన్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత చిన్న చిన్న మార్పులతో దాదాపు ఒక యాభై పేటెంట్లు దాకా వేర్వేరు వ్యక్తులు పొందారు. 1947లో విలియం ఇ బాసెట్... కాస్త సౌకర్యవంతంగా దాన్ని రూపొందించారు. ఇదే ఇపుడు అందుబాటులో ఉన్నది. నెయిల్ కటర్లు రెండు రకాలు... మనమే కట్ చేసుకునేవి, ఎక్కువగా ఇళ్లలో వాడే చిన్నవి. ఇంకోటి వైర్ కటర్లాగా ఉండేది. ఇది బార్బర్ షాపుల్లో కనిపిస్తుంటుంది. ఇవి కాస్త ఎక్కువ మన్నికగా ఉంటాయి. నెయిల్ కటర్‌తో పాటు వచ్చే నెయిల్ క్లీనర్, నెయిల్ రబ్బర్ కూడా యాభై-అరవై ఏళ్ల క్రితం జతపరిచినవే.