nanded district
-
Maharashtra Incident: నిధులున్నాయి.. అయినా మందులు కొనలేదు
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలపై ఆ రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి హాసన్ షరీఫ్ ఆసుపత్రి వర్గాలపై సీరియస్ అయ్యారు. ఆసుపత్రిలో మందులు కొనుగోలు చేయడానికి రూ .5 కోట్ల నిధులు ఉన్నప్పటికీ వారు ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర శంకర్రావ్ చోహాన్ ఆసుపత్రిలో 48 గంటల వ్యవధిలో 31 మంది మృతిచెందిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటంతో ప్రభుత్వ వర్గాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఆసుపత్రి ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. మంగళవారం ఎంపీ హేమంత్ పాటిల్ ఆసుపత్రిని సందర్శించి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో ఏకంగా డీన్‌తోనే టాయిలెట్లు శుభ్రం చేయించారు. ఇదిలా ఉండగా ఈరోజు ఈ అంశంపై వైద్యవిద్య శాఖ మంత్రి హాసన్ షరీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్త చేశారు. ఆసుపత్రిలో 31 మంది కేవలం మందులు లేక మరణించారని తెలిసి ఆసుపత్రి వర్గాలను నిలదీశారు. దాదాపు రూ.4 నుంచి 5 కోట్లు నిధులు ఉన్నా కూడా వారు మందులు ఎండలు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. దీంతోపాటు ఆసుపత్రి నిర్వహణ, పరిసరాల శుభ్రత వంటి వ్యవహారాల్లో లోపాలపై కూడా మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రిలో మరణాలపై విచారం చేసేందుకు కొంతమంది డాక్టర్లతో కూడిన కమిటీని నియమించామని వారు అతి త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారని ఈ సంఘటనకు కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేదిలేదని అన్నారు. వీలయితే మెడికల్ కాలేజీ సిబ్బందిని ఇక్కడికి రప్పిస్తామని తెలిపారు. మాకు ప్రతి చిన్నారి ప్రాణం ముఖ్యమే. అయితే మందులు కొనడానికి 40% నిధులు ఉన్నప్పటికీ డీన్ నిధులు లేవని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని దానిపైన కూడా విచారణ చేయనున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: పన్నులు పెరిగాయి.. అప్పు కూడా పెరిగింది: పంజాబ్ సీఎం -
ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. 24 గంటల్లో 24 మంది మృతి
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో గడిచిన 24 గంటల్లో 24 మంది మృత్యువాతపడటం తీవ్ర కలకలం రేపుతోంది. మరణించిన వారిలో 12 మంది నవజాత శిశువులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నాందేడ్ జిల్లాలో శంకర్రావు చావన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘోరం వెలుగుచూసింది. అయితే ఆసుపత్రిలో మందులు, సిబ్బంది కొరత వల్లే ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెరుగుతున్న మృతుల సంఖ్య నాందేడ్ ప్రభుత్వ వైద్యశాలలో గత 24 గంటల్లో 24 మంది రోగులు మరణించారు. వీరిలో 12 మంది అప్పుడే పుట్టిన చిన్నారులు కూడా ఉండటం హృదయాలను కలచివేస్తోంది. మరోవైపు నాందేడ్ ఆసుపత్రిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దురదృష్టవశాత్తు మరో ఏడుగురు రోగులు మరణించారు. వీరిలో చనిపోయిన వారిలో 4గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో మంగళవారం ఉదయం నాటికి మరణించిన వారి సంఖ్య 31కు చేరింది. తాజా మరణాలకు సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా తెలియజేశారు. नांदेडमध्ये मृत्यूचे थैमान सुरूच. शासकीय वैद्यकीय महाविद्यालयाच्या रुग्णालयात कालपासून आणखी ७ रुग्णांचा दुर्दैवी मृत्यू. मृतकांमध्ये ४ बालकांचाही समावेश. राज्य सरकारने जबाबदारी निश्चित करावी. — Ashok Chavan (@AshokChavanINC) October 3, 2023 మందుల కొరత వల్లే మరణాలు రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. మరణించిన 12 మంది చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని ఆసుపత్రి డీన్ తెలిపారు. చనిపోయిన మిగతా పన్నెండు మంది పెద్దవారిలో పాము కాటుతో సహా వివిధ వ్యాధుల కారణంగా మరణించారని ఆయన పేర్కొన్నారు. 70-80 కి.మీలో ఏకైక ఆసుపత్రి ఆసుపత్రి తృతీయ స్థాయి కేర్ సెంటర్ మాత్రమేనని, కానీ చుట్టుపక్కల 70,80 కిలీమీటర్ల పరిధిలో ఉన్న ఏకైక హెల్త్ కేర్ సెంటర్ ఇదే కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారని డీన్ తెలిపారు. ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య అధికంగా ఉందని అన్నారు. కొన్నిసార్లు పేషెంట్ల సంఖ్య ఆసుపత్రి బడ్జెట్‌ను మించిపోవడంతో మందుల కొరత ఏర్పడిందని తెలిపారు. చదవండి: ప్రాణం పోయేలా ఉందన్నా.. పడేసి పోయారు! సిబ్బంది బదిలీతోనూ ఇబ్బందులు హాఫ్కిన్ అనే సంస్థ నుంచి మందులను ఆసుపత్రి కొనుగోలు చేయాల్సి ఉందని, అయితే అది జరగడం లేదని అన్నారు డీన్. దీంతో రోగులు స్థానిక మెడికల్ షాపుల నుంచి మందులు కొనుగోలు చేసి తీసుకొచ్చిన తర్వాతే రోగులకు మందులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికితోడు అనేకమంది ఆసుపత్రి సిబ్బందిని బదిలీ చేయడం వల్ల రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తల్లిదండ్రుల ఆవేదన.. మరోవైపు మృతుల్లో నవజాత శిశువులు కూడా ఉండటంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. తమ పిల్లల మరణాలకు ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమని, వైద్యులు సరిగా చికిత్స చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను చూడటానికి సిబ్బంది అనుమతించడం లేదని మరికొంతమంది చెబుతున్నారు. మా బిడ్డ క్షేమంగా ఉన్నాడో లేదో.. మాకు ఏమీ తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాల మండిపాటు ఇక ఈ ఘటన విషయంలో మహారాష్ట్రలోని శివసేన(షిండే వర్గం), బీజేపీ, ఎన్సీపీ(అజిత్ వర్గం) ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నాందేడ్ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 నవజాత శిశువులతో సహా 24 మరణాలు మందుల కొరత వల్ల మాత్రమే సంభవించలేదని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగాయని విరుచుకుపడ్డాయి. పండుగలు, పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి, చిన్నారుల మందుల కోసం డబ్బులు కేటాయించకపోవడం సిగ్గు చేటని దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ దృష్టిలో పేదల ప్రాణాలకు విలువ లేదని మండిపడుతున్నాయి. नांदेड़, महाराष्ट्र के सरकारी अस्पताल में दवाइयों की कमी से 12 नवजात शिशुओं समेत 24 लोगों की मृत्यु का समाचार अत्यंत दुखद है। सभी शोकाकुल परिवारों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। भाजपा सरकार हज़ारों करोड़ रुपए अपने प्रचार पर खर्च कर देती है, मगर बच्चों की दवाइयों के लिए… — Rahul Gandhi (@RahulGandhi) October 2, 2023 విచారణకు ఆదేశం ఎన్సీపీ(శరద్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను డిమాండ్ చేశారు. సంబంధిత మంత్రులను వారి పదవుల నుంచి తొలగించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోరారు. ఇక ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట కల్లా కమిటీ తన రిపోర్టు ఇవ్వనుందని మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ డైరెక్టర్ దిలీప్ మైసేకర్ తెలిపారు. -
కలెక్టర్ రాజేంద్ర బారుద్
‘‘మీరు నాలో చూస్తున్నది ఒక కలెక్టర్‌ని. అయితే మీ కళ్ల ముందు కనిపిస్తున్న నేను... నేను కాదు. మా అమ్మ రెక్కల కష్టాన్ని. నాన్న సహాయం లేకుండా జీవితాన్ని ఈదిన ఒక మహాయోధురాలు మా అమ్మ. నేను ఏడాది పిల్లవాడిగా ఉన్నప్పుడు, మా తమ్ముడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. పేదరికంలోనే పుట్టాను, పేదరికం తో కలిసి పెరిగాను. ఎంతటి పేదరికం అంటే మా నాన్న తన జీవితకాలంలో ఒక్క ఫొటో కూడా తీసుకోలేదు. నాన్న ముఖం ఎలా ఉంటుందో తెలియదు. నాకు అమ్మా... నాన్న రెండూ మా అమ్మే’’ అన్నారు మహారాష్ట్రలోని నందర్బూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ రాజేంద్ర బారుద్. నా భవిష్యత్తు చూసింది రాజేంద్ర సొంతూరు మహారాష్ట్ర, ధూలే జిల్లా, సక్రి తాలూకా, సమోద్ అనే ఆదివాసీ గ్రామం. తండ్రి బందు బారుద్, తల్లి కమలాబాయి. మూడో బిడ్డ భూమ్మీద పడే నాటికే భర్త భూమి పొరల్లోకి వెళ్లిపోయాడు. ముగ్గురు బిడ్డలను పోషించాలి. ఒక చేత్తో బిడ్డను చంకకెత్తుకుని మరో చేత్తో ఇంటి బాధ్యతను భుజానికెత్తుకుంది కమలాబాయి. అంతటి పేదరికంలోనూ ముగ్గురు పిల్లలను బడికి పంపించడమే ఆమె విజ్ఞత. రాజేంద్ర చదువులో చురుగ్గా ఉండడంతో జవహర్ నవోదయ స్కూల్లో చేర్పించమని స్కూలు టీచర్లు సలహా ఇచ్చారు. రాజేంద్ర ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘‘నన్ను హాస్టల్‌కి పంపేటప్పుడు నా భవిష్యత్తు కోసం మా అమ్మ నిబ్బరంగా ఉండగలిగింది. నేను ఏడ్చేశాను. అమ్మను వదిలి ఒక్కరోజు కూడా ఉండింది లేదు. నేనెంత ఏడ్చానో ఇప్పటికీ గుర్తుంది. కానీ చదువులేని మా అమ్మ... ఊరి వదిలి ఎక్కడికీ వెళ్లని ఆమె, బిడ్డ భవిష్యత్తు కోసం అంత గట్టి నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఆ రోజు ఆమె నిర్ణయమే నన్ను ఇలా నిలబెట్టింది’’ అన్నారు. ఎంబీబీఎస్ సీటు రాజేంద్ర పన్నెండవ తరగతిలో స్కూల్ టాపర్. ముంబయిలోని జీఎస్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది. అప్పటివరకు అతడి లక్ష్యం డాక్టర్ అయ్యి తమ తండాలో అందరికీ మంచి వైద్యం చేయవచ్చనేటంత వరకే పరిమితం. ఎంబీబీఎస్‌లో చేరిన తర్వాత అతడి ఆలోచన విస్తరించింది. ఐఏఎస్ అధికారి అయితే తమ వాళ్ల జీవితాలను మెరుగుపరచడానికి పని చేయవచ్చనుకున్నారు. యూపీఎస్సీ పరీక్షలకు కూడా ప్రిపేరయ్యారు. ఎంబీబీఎస్ పరీక్షలతోపాటు అదే ఏడాది యూపీఎస్సీ పరీక్షలు కూడా రాశారు. తొలి ప్రయత్నంలో ఐఆర్ఎస్ అధికారిగా పోస్టింగ్ వచ్చింది. ‘‘అప్పుడు మా ఊరికి వెళ్లాను. తల్లి కమలాబాయితో రాజేంద్ర బారుద్ ఐఏఎస్ ప్రయత్నం, ఐఆర్ఎస్ ఉద్యోగం గురించి చెప్పినప్పుడు మా అమ్మ ‘నువ్వు చదివింది డాక్టర్ చదువు కాదా’ అని అడిగింది. మా అమ్మకే కాదు, మా ఊరి వాళ్లెవరికీ అప్పటివరకు కలెక్టర్ అనే పదమే తెలియదు. నేను ‘కలెక్టర్’ అని చెబుతుంటే ‘కండక్టర్’ అనేవాళ్లు’’ అని నవ్వుతూ చెప్పాడు రాజేంద్ర. రెండవ ప్రయత్నంలో ఐఏఎస్‌కు ఎంపికయ్యి... నాందేడ్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, షోలాపూర్ జిల్లా సీఈవోగా పని చేశారు. 2018లో నందుర్బార్ జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన నలభై వేల ఆదివాసీ కుటుంబాలకు రేషన్ కార్డు సౌకర్యం కల్పించారు. మరో 65 వేల కుటుంబాలకు ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పొందే అవకాశం కల్పించారు. చెరుకు సారా ‘‘మా అమ్మ మమ్మల్ని పెంచడానికి చెరకు ఆకులు, అడవుల్లో దొరికే చెట్ల పూలు తెచ్చి సారా కాచి అమ్మేది. అంత కష్టపడితే ఆమెకు రోజుకు వంద రూపాయలొచ్చేవి. నానమ్మ, అమ్మ, ముగ్గురు పిల్లలు మొత్తం ఐదుగురి పోషణ అందులోనే. ఆ సారా కాయడం, తాగడం చట్టవ్యతిరేకం కాదు. ఆదివాసీ కుటుంబాల్లో అందరికీ ఈ సారా అలవాటే. చిన్నప్పుడు మేము ఊరికే ఏడుస్తూ ఉంటే ఒక చెంచాడు సారా పట్టించేది. మేము నిద్రపోయేవాళ్లం. తన పనికి అడ్డు వస్తుంటే మరేం చేస్తుంది పాపం. అయితే మాకు ఊహ తెలిసిన తర్వాత సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు అమ్మకు సహాయం చేద్దామని ఏదో ఒక పని చేయబోతే... మమ్మల్ని సారా కుండల దగ్గరకు కూడా రానిచ్చేది కాదు. నా చిన్నప్పుడు మా ఆదివాసీలు తాము నిరక్షరాస్యులమని, అత్యంత పేదరికంలో జీవిస్తున్నామనే వాస్తవాన్ని తెలుసుకోలేని అమాయకత్వంలో జీవించేవాళ్లు. వాళ్లను బయట విశాలమైన ప్రపంచం ఉందనే వాస్తవంలోకి తీసుకురావాలనేదే నా కోరిక’’ అన్నారు రాజేంద్ర. ఆయన 2014లో తన విజయాలను, సవాళ్లను వివరిస్తూ రాసిన ‘మై ఏక్ సపన్ పహిల్’ పుస్తకాన్ని తల్లి కమలాబాయికి అంకితం ఇచ్చారు. -
పాఠశాల కాదు పానశాల
ఔరంగాబాద్: మందుబాబులకి ఎక్కడా చోటు దొరకనట్టుంది. సరస్వతీ నిలయమైన పాఠశాలని ఏకంగా పానశాల కింద మార్చేశారు. రాత్రి పూట పాఠశాలలో పూటుగా మందు తాగుతూ చిందులేస్తున్నారు. ఈ ఘోరం మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్లో జరుగుతోంది. ఉదయం పాఠశాలకి వచ్చే విద్యార్థులు, టీచర్లకు పాఠశాల ప్రాంగణంలో చెదురుమదురుగా విసిరేసిన లిక్కర్ సీసాలు కనిపిస్తున్నాయి. వాళ్లు అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత తరగతులు మొదలు పెట్టాల్సి వస్తోందని స్కూలు అధికారి ఒకరు చెప్పారు. నాందేడ్‌లో ముక్రామాబాద్ పోలీసు స్టేషన్‌కి కూతవేటు దూరంలో ఉన్న స్కూల్లో గత కొద్ది రోజులుగా మందుబాబులు పాఠశాలనే తమకు అడ్డాగా మార్చుకున్నారు. అయినప్పటికీ పట్టించుకునే నాథుడే లేడని పేరు వెల్లడించడానికి ఇష్టపడని పాఠశాల అధికారి ఒకరు చెప్పారు. ‘‘ఉదయం పాఠశాలకి వచ్చేసరికి లిక్కర్ బాటిల్స్ కనిపిస్తాయి. కొన్ని బాటిల్స్ విరిగి పడి ఉంటాయి. మా స్కూలుకి ప్యూన్ లేడు. రిటైర్ అయిపోయాడు. దీంతో విద్యార్థులు, టీచర్లే పాఠశాల ఆవరణని శుభ్రం చేయాల్సి వస్తోంది. తరచూ ఈ ఘటన జరుగుతూ ఉండడంతో పోలీసులకి ఫిర్యాదు చేశాము’’ అని ఆ అధికారి చెప్పారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో ఈ సమస్య ఎదుర్కొంటున్నామని ఆయన వివరించారు. ఇలాంటి చర్యలు పాఠశాలలో చదువుకునే వాతావరణాన్ని పాడు చేస్తాయని ముక్రామాబాద్ పోలీసు స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కమలాకర్ అంగీకరించారు. ఇక నుంచి ఆ స్కూలుపై నిరంతర పర్యవేక్షణ జరుపుతామని చెప్పారు. -
గణేశ్ ఉత్సవాలకు 127 ఏళ్లు
భైంసా (ముథోల్): దేశంలో ఆంగ్లేయుల పాలన కొనసాగుతున్నకాలమది. స్వాతంత్రం కోసం జాతీయ నాయకులు పోరాడుతున్నారు. బాలగంగాధర్ తిలక్ సైతం అదేబాటలో నడిచాడు. అందరినీ సమైక్యంగా కలుపుకుపోవాలన్న ఆలోచనతో ముందుకు కదిలాడు. ఆ రోజుల్లో ఆంగ్లేయులు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చేవారు కాదు. నలుగురు ఒక చోట కలుసుకునే అవకాశంలేదు. ఆ రోజుల్లో ఇళ్లలోనే గణపతి పూజలు జరిగేవి. అలాకాకుండా ఏటా గణేశ్ విగ్రహాలను ప్రతిష్టిస్తే అంతా కలిసి ఒకేచోట ఉత్సవాలు జరుపుకుంటారని అనుకుని ఆ దిశగా అడుగులు వేశాడు. 1893లో బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలోని పుణేలో శ్రీ కస్బ గణపతిని ప్రతిష్టించి ఉత్సవాలను ప్రారంభించాడు. అప్పటి నుంచి 127 ఏళ్లుగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కుభీర్‌కు వచ్చి... ఆ సమయంలో ముథోల్ ప్రాంతం నైజాం పరిపాలనలో ఉండేది. ముథోల్ ప్రాంతమంతా నాందేడ్ జిల్లా పరిధిలోకి వచ్చేది. బాలగంగాధర్ తిలక్ దేశమంతా పర్యటిస్తూ ఇప్పటి నిర్మల్ జిల్లాలోని ముథోల్ నియోజకవర్గ పరిధిలో గల కుభీర్‌కు చేరుకున్నారు. అప్పుడు కుభీర్‌ను పాలించే యశ్వంత్‌రావుదేశ్‌ముఖ్‌కు బాలగంగాధర్‌తిలక్ దగ్గరి బంధువు. 1905లోనే భైంసాకు వచ్చిన బాలగంగాధర్‌తిలక్ పట్టణానికి చెందిన నారాయణ్‌వాగ్‌తో సమావేశమయ్యారు. అప్పుడే కుభీర్‌లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో కుభీర్‌నుపాలించే యశ్వంత్‌రావుదేశ్‌ముఖ్ గణేశ్ ఉత్సవాలను నిర్వహించేవారు. 1950 నుంచి 40ఏళ్లపాటు కుభీర్‌కు చెందిన వైద్యనాథ్ ఉత్సవాల నిర్వాహణను చూసుకున్నారు. నేడు గ్రామస్తులు ఈ ఉత్సవాలను కొనసాగిస్తున్నారు. భైంసా పట్టణంలో 101 ఏళ్లుగా.. భైంసాలో 1919లో సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో గోపాలకృష్ణ మందిరంలో మొదటిసారిగా నారాయణ వాగ్ సమక్షంలో ఉత్సవాలు ప్రారంభించారు.101 ఏళ్ళుగా గోపా లకృష్ణ మందిరంలో గణేశ్ ఉత్సవాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిమజ్జనం రోజున ఇక్కడే పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభిస్తారు. 1921లో హతిగణేశ్ మండలి ఉత్సవాలను ప్రారంభించింది. నేడు భైంసా పట్టణంలో 100కు పైగా మండళ్లు గణేశ్ ఉత్సవాలను జరుపుకుంటున్నాయి. అప్పట్లో అంతా కలిసి భజనలు చేస్తూ ఒకేచోట ఉత్సవాలు చేసుకునేవారు. నేడు గణేశ్ మండళ్ల సంఖ్య 100కు పైగానే చేరింది. ఫోటోలు ‘సాక్షి’కి పంపండి... నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము www.sakshi.com వెబ్సైట్లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
బోధన్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నర్సి గ్రామ సమీపంలోని లాగావ్ పాటక్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన నలుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బంధువుల కథనం ప్రకారం... బోధన్ పట్టణం గోషాలకాలనీకి చెందిన షేక్ అన్వర్ (29) తన భార్యాపిల్లలతో కలిసి నర్సిలో జరిగే బంధువుల ఫంక్షన్‌కు ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. నర్సికి ఐదు కిలోమీటర్ల సమీపంలోని లాగవ్ పాఠక్ వద్ద ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనం వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అన్వర్, ఆయన భార్య పర్వీన్ బేగం (25) కొడుకు వాహెద్(3) కూతురు నిదా (18 నెలలు) మృతి చెందారు. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. నాయ్‌గావ్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బోధన్‌కు తరలించారు. మృతి చెందిన పర్వీన్ బేగం గర్భిణీ.