ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలపై ఆ రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి హాసన్ షరీఫ్ ఆసుపత్రి వర్గాలపై సీరియస్ అయ్యారు. ఆసుపత్రిలో మందులు కొనుగోలు చేయడానికి రూ .5 కోట్ల నిధులు ఉన్నప్పటికీ వారు ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు.
మహారాష్ట్ర శంకర్‌రావ్ చోహాన్ ఆసుపత్రిలో 48 గంటల వ్యవధిలో 31 మంది మృతిచెందిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటంతో ప్రభుత్వ వర్గాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఆసుపత్రి ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. మంగళవారం ఎంపీ హేమంత్ పాటిల్ ఆసుపత్రిని సందర్శించి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో ఏకంగా డీన్‌తోనే టాయిలెట్లు శుభ్రం చేయించారు.
ఇదిలా ఉండగా ఈరోజు ఈ అంశంపై వైద్యవిద్య శాఖ మంత్రి హాసన్ షరీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్త చేశారు. ఆసుపత్రిలో 31 మంది కేవలం మందులు లేక మరణించారని తెలిసి ఆసుపత్రి వర్గాలను నిలదీశారు. దాదాపు రూ.4 నుంచి 5 కోట్లు నిధులు ఉన్నా కూడా వారు మందులు ఎండలు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. దీంతోపాటు ఆసుపత్రి నిర్వహణ, పరిసరాల శుభ్రత వంటి వ్యవహారాల్లో లోపాలపై కూడా మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రిలో మరణాలపై విచారం చేసేందుకు కొంతమంది డాక్టర్లతో కూడిన కమిటీని నియమించామని వారు అతి త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారని ఈ సంఘటనకు కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేదిలేదని అన్నారు. వీలయితే మెడికల్ కాలేజీ సిబ్బందిని ఇక్కడికి రప్పిస్తామని తెలిపారు. మాకు ప్రతి చిన్నారి ప్రాణం ముఖ్యమే. అయితే మందులు కొనడానికి 40% నిధులు ఉన్నప్పటికీ డీన్ నిధులు లేవని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని దానిపైన కూడా విచారణ చేయనున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: పన్నులు పెరిగాయి.. అప్పు కూడా పెరిగింది: పంజాబ్ సీఎం
Comments
Please login to add a commentAdd a comment