బీసీలను అణగదొక్కే కుట్ర
గ్రూపులతో సిట్టింగులకు ఎసరు
డీసీసీ నేతల తీరుపై నందీశ్వర్ ఫైర్
సామాజిక తెలంగాణే కావాలి
సోనియా దయవల్లే ప్రత్యేక రాష్ట్రం
సంగారెడ్డిలో అభినందన సభ
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్:
గ్రూపు రాజకీయాలతో సిట్టింగు ఎమ్మెల్యేలకు ఎసరు పెట్టే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతగా మంగళవారం సంగారెడ్డిలో ని జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూ పాల్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, ముత్యంరెడ్డి, నందీశ్వర్‌గౌడ్, పార్టీ జిల్లా ఇన్చార్జ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ.. విమర్శించటాని కి ఇది సమయం కాదంటూనే.. ఘాటైన విమర్శలు చేశారు. జిల్లా జనాభాలో 80 శాతం ఉన్న బీసీలకు కనీసం నాలుగు స్థానాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒకే ఒక సీటు ఇచ్చారని, ఇప్పుడు ఆ ఒక్క సీటును కూడా లాగేసుకునేందుకు కుట్ర లు చేస్తున్నారని ఆరోపించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పోటీగా ఇతర నాయకులు వచ్చి టికెట్ మాకే వస్తుందంటూ అస త్య ప్రచారం చేసి కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని, ఇది ఎంతమాత్రం మంచిది కాద న్నారు. 60 ఏళ్ల తెలంగాణ చరిత్రలో కేవలం ఏడాదిన్నర మాత్రమే దళిత, వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తులు పరిపాలన చేశారని తెలిపారు. ఇప్పటికైనా దొరల తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు బీసీ కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టు కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఘనతే అని అన్నారు. కల సాకారం చేసినందు కు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చంద్రబాబు వైఖరి వల్లే యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ సహకరించినందుకు జిల్లా కమిటీ తరపున ఆ పార్టీ అగ్రనేతలకు కృతజ్ఞత లు తెలిపారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ ఆశీస్సులతో 60 ఏళ్ల కల సాకారమైందన్నారు. ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మాట్లాడుతూ తాము మొ దటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న విషయాన్ని ప్రజలకు వివరిస్తూ వచ్చామన్నారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు డోకూరి రామ్మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పీసీసీ ప్రధాన కార్యదర్శి సాజిద్ పాషా, డీసీసీబీ చైర్మన్ భూపాల్‌రెడ్డి, డీసీఎం ఎస్ చైర్మన్ సిద్దన్నపాటిల్, జడ్పీ మాజీ చైర్మన్ బాలయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదర్శ్‌రెడ్డి పాల్గొన్నారు.