nandikotkuru
-
నందికొట్కూరు మండలం అల్లూరులో విషాదం
-
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు
నందికొట్కూరు: అవకాశ వాద రాజకీయాలతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. శనివారం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2014లో కాంగ్రెస్ పార్టీని తిట్టి బీజేపీతో దోస్తీ చేసి అధికారం చేపట్టిన చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీని తిట్టి కాంగ్రెస్‌తో దోస్తీకి సిద్ధం కావడం చూస్తే ప్రపంచంలోనే ఆయనంత అవకాశవాద రాజకీయ నాయకుడు ఇంకొకరు ఉండరన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు నిమిత్తం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చలు జరిపేందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం జనాలకు తెలిసిపోయిందన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప అధికారంలోకి రాలేనని చంద్రబాబుకు తెలిసిపోయిందన్నారు. అందుకే ప్రతిసారి ఎవరో ఒకరితో అంటకాగుతూనే ఉన్నారన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే కేసీఆర్‌లాగా ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. వైఎస్సార్ చేసిన మేలు ముస్లింలు మరవరని, వారు ఎప్పుడూ వైఎస్సార్సీపీ వెంటే ఉంటారన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు అందరూ గమనిస్తున్నారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసేంత వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేది లేదన్నారు. 22 కేసులున్న కోడెల శివప్రసాద్‌ను అసెంబ్లీ స్పీకర్ ఎలా చేశారని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తంగడంచ ఫారం భూముల్లో పరిశ్రమలే స్థాపించలేదన్నారు. వేల కోట్లు దోచుకునేందుకే ప్రాజెక్ట్‌ల పేరుతో నాటకమాడుతున్నారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి 50 ఎకరాల తంగడంచ ఫారం భూములు కేటాయించాలని ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్‌కు పంపినా స్పందన లేదన్నారు. -
రోడ్డుపై విషమంగా వ్యక్తి.. పిలిచినా రాని '108'
నందికొట్కూరు: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సత్వరమే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే సదుద్దేశంతో తీసుకొచ్చిన పథకం '108'. ఒక్క ఫోన్ కాల్‌తో బాధితులను ఆదుకొని.. ప్రాణాలు నిలబెట్టాల్సిన '108' పథకం నానాటికీ నీరుగారిపోతున్నది. తాజాగా ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై.. విషమ పరిస్థితిలో ఉన్నా.. '108' సిబ్బంది సకాలంలో స్పందించలేదు. దీంతో రోడ్డుమీద విలవిలలాడుతున్న బాధితుడిని స్థానికులే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరు శివారులో సోమవారం రాత్రి జరిగింది. బైక్‌పై వెళుతున్న మధు (35) అనే వ్యక్తిని ఓ వాహనం ఢీకొనడంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు 108కు ఫోన్ చేశారు. అరగంట అయినా '108' అంబులెన్స్ సంఘటనాస్థలానికి చేరుకోలేదు. దీంతో స్థానికులే అరగంట తర్వాత బాధితుడిని వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. -
వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం
నందికొట్కూరు: కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ప్రసాద్‌పై హత్యాయత్నం జరిగింది. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణం సుబ్బారావుపేటలో ప్రసాద్‌కు చెందిన వేరుశెనగల లారీ వెళ్తుండగా.. కారులో వచ్చిన చిలక సత్యం తన కారును రోడ్డుకు అడ్డుగా ఉంచాడు. దీనిపై వాగ్వాదం జరుగుతుండగా సత్యం సోదరుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. వారిద్దరూ కలసి ప్రసాద్‌పై దాడి చేసి కొట్టారు. అనంతరం కత్తితో పొడిచేందుకు యత్నించగా ప్రసాద్ త్రుటిలో తప్పించుకున్నాడు. దీనిపై ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిలక సత్యం, అతని సోదరుడు ఇద్దరూ టీడీపీలో క్రియాశీల కార్యకర్తలు కావడం గమనార్హం.