నందికొట్కూరు: కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ప్రసాద్‌పై హత్యాయత్నం జరిగింది. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణం సుబ్బారావుపేటలో ప్రసాద్‌కు చెందిన వేరుశెనగల లారీ వెళ్తుండగా.. కారులో వచ్చిన చిలక సత్యం తన కారును రోడ్డుకు అడ్డుగా ఉంచాడు.
దీనిపై వాగ్వాదం జరుగుతుండగా సత్యం సోదరుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. వారిద్దరూ కలసి ప్రసాద్‌పై దాడి చేసి కొట్టారు. అనంతరం కత్తితో పొడిచేందుకు యత్నించగా ప్రసాద్ త్రుటిలో తప్పించుకున్నాడు. దీనిపై ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిలక సత్యం, అతని సోదరుడు ఇద్దరూ టీడీపీలో క్రియాశీల కార్యకర్తలు కావడం గమనార్హం.
వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం
Published Wed, Sep 2 2015 7:00 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement