Narang
-
AKA: గీతాచిత్రలహరి
బాలీవుడ్ అనే మహా సముద్రంలో ప్రతి అల అరుదైన అనుభవాలు, జ్ఞాపకాలను మోసుకు వస్తుంది. వాటిని అందుకునే వారు అరుదుగా ఉంటారు. ఈ అరుదైన కోవకు చెందిన రైటర్, ఎడిటర్, డైరెక్టర్ గీతికా నారంగ్ అబ్బాసి కేరళలో జరిగిన ‘ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డ్ గెలుచుకుంది... నార్త్ దిల్లీలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గీతికా నారంగ్ అబ్బాసికి బాల్యంలో ఏకైక వినోద మాధ్యమం సినిమా. కాస్త చమత్కారంగా చెప్పాలంటే, ఆమె బాల్యజీవితంలో బాల్య జ్ఞాపకాల కంటే బాలీవుడ్ సినిమాలే ఎక్కువ! తండ్రి నారంగ్ అబ్బాసి బిమల్‌రాయ్, గురుదత్, రాజ్కపూర్ల గురించి చెప్పడమే కాదు వారి సినిమాలు చూపించేవాడు. చిన్నప్పుడు గీతికకు ఇష్టమైన కథానాయకుడు రాజ్‌కపూర్. గీతిక మాటల్లో చెప్పాలంటే రాజ్‌కపూర్ తన హావభావాలతో గ్రేట్ చార్లి చాప్లిన్‌ను తనకు పరిచయం చేశాడు. చార్లి చాప్లిన్ సినిమాలు చూసి... ‘ఈయన రాజ్‌కపూర్‌ను బాగా కాపీ కొడుతున్నాడు’ అని అమాయకంగా అనుకునే రోజులవి! దిల్లీలోని హిందూ కాలేజి నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకుంది గీతిక. ఆ తరువాత ఎడ్వర్టైజింగ్లో పీజి చేసింది. అయితే ఆ చదువేమి తనకు అంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఒక సాయంత్రం కాఫీ సేవిస్తూ... ‘నాట్ మై కప్ ఆఫ్ టీ’ అనుకుంది ప్రకటనల రంగం గురించి. దిల్లీలోని ఒక ఫిల్మ్‌ప్రొడక్షన్ కంపెనీలో చేరడంతో ఫిల్మ్ మేకింగ్‌పై తనకు అవగాహన ఏర్పడింది. కొన్ని డాక్యుమెంటరీలకు సహాయకురాలిగా పనిచేసింది. ‘హాలీవుడ్‌తో పోల్చితే మన దగ్గర డాక్యుమెంటరీల సంఖ్య చాలా తక్కువ. ఎందుకు ఇలా!’ అనుకునేది చాలాసార్లు. ఆ లోటును తనవంతుగా భర్తీ చేయడానికి అన్నట్లుగా తొలిసారిగా ‘గుడ్‌నైట్’ పేరుతో మొదటి సారిగా షార్ట్ డాక్యుమెంటరీ తీసింది. నాన్న తనకు సినిమాలకు సంబంధించిన విశేషాలు చెబుతుండేవాడు. ఉదా: ఫలానా సినిమాలో నృత్య బృందంలో కనిపించే అమ్మాయి ఆ తరువాత పెద్ద హీరోయిన్ అయింది...ఈ సినిమా పేరు చెప్పగానే ఆ హీరో నటవిశ్వరూపం గుర్తుకువస్తుందిగానీ, నిజానికి ఆ సినిమా కథ వేరొక హీరో కోసం తయారు చేసింది. ఆ హీరోకి నచ్చకపోవడంతో ఈ హీరోకి అవకాశం వచ్చి ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో గీతికకు అనిపించింది ఏమిటంటే... ‘మన సినిమాల పైనే వివిధ కోణాల్లో డాక్యుమెంటరీలు తీస్తే ఎలా ఉంటుంది? చెప్పడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కదా!’ విడుదలకు నోచుకోని ‘అమీర్ సల్మాన్ షారుఖ్’ ఫీచర్ ఫిల్మ్ నుంచి ‘అచ్చం ఫలానా హీరోలాగే ఉంటాను’ అని మురిసిపోయే జూనియర్ ఆర్టిస్ట్‌ల వరకు ఎన్నో విషయాలను తన డాక్యుమెంటరీలలోకి తీసుకువచ్చింది గీతిక. ఫిరోజ్ ఖాన్‌ను ‘మిమ్మల్ని చూసీ చూడగానే ప్రేక్షకులు నవ్వితే మీ స్పందన ఏమిటి?’ అని అడిగిందట. ‘ఆర్టిస్ట్‌లో హీరోయే కాదు జోకర్ కూడా ఉంటాడు’ అని హాయిగా నవ్వాడట ఫిరోజ్. ఇలా హాయిగా నవ్వే వాళ్లతో పాటు ‘అది నిన్నటి అభిప్రాయం మాత్రమే. ఈరోజు నా అభిప్రాయం మార్చుకున్నాను’ అని ఏ అభిప్రాయం మీద నిలకడలేని నటులతో చిత్రమైన అనుభవాలు ఎదుర్కొవలసి వచ్చింది గీతిక. నాటి ‘గుడ్‌నైట్’ నుంచి నేటి ‘ఏ.కె.ఏ’ వరకు రైటర్, ఎడిటర్, డైరెక్టర్‌గా గీతిక ఎన్నో విషయాలు నేర్చుకుంది. తనను తాను మెరుగుపరుచుకుంది. ఇటీవల కేరళలో జరిగిన ‘ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’లో గీతిక నారంగ్ తీసిన ‘ఏ.కె.ఏ’ డాక్యుమెంటరీకి మంచి స్పందన లభించడమే కాదు ‘బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డ్’ను గెలుచుకుంది. బాలీవుడ్ కథానాయకులు దేవానంద్, అమితాబ్ బచ్చన్, షారుక్ఖాన్లను పోలి ఉండే ముగ్గురు వ్యక్తులపై తీసిన డాక్యుమెంటరీ ఇది. మిమిక్రీ నుంచి స్టార్డమ్ వరకు చిత్రరంగానికి సంబంధించి అన్ని కోణాలు ఇందులో కనిపిస్తాయి. ‘నా డాక్యుమెంటరీల లక్ష్యం నవ్వించడం కాదు, సీరియస్‌గా ఆలోచింపజేయడం’ అంటుంది గీతికా నారంగ్. అలా అని నవ్వకుండా ఉండలేము, అలా అని సీరియస్‌గా ఆలోచించకుండా ఉండలేము. అదే కదా ఆమె డాక్యుమెంటరీల ప్రత్యేకత! -
సొంతగడ్డపై భారత్ ‘గురి’ అదిరేనా
► నారంగ్, జీతూరాయ్లపై ఆశలు ► నేటి నుంచి ప్రపంచకప్ షూటింగ్ న్యూఢిల్లీ: రియోలో నిరాశపరిచిన భారత షూటర్లు సొంతగడ్డపై జరిగే మెగా ఈవెంట్లో పతకాలపై గురిపెట్టారు. శుక్రవారం నుంచి జరిగే ప్రపంచకప్ షూటింగ్లో సత్తాచాటేందుకు సిద్ధమయా్యరు. ఇక్కడి డాక్టర్ కర్నిసింగ్ షూటింగ్ రేంజ్లో పది రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి. భారత మేటి షూటర్లు గగన్ నారంగ్, జీతూరాయ్, హీనా సిదు్ధలపై భారత్ ఆశలు పెట్టుకుంది. 1999 తర్వాత... ఒలింపిక్ చాంపియన్ , భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా లేకుండా భారత బృందం తలపడుతున్న తొలి ప్రపంచకప్ ఇదే కావడం గమనార్హం. ప్రయోగాత్మక ఈవెంట్లకు ఈ ప్రపంచకప్ వేదికైంది. మహిళల ప్రాతినిధ్యం పెంచాలనే లక్ష్యంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సిఫార్సు చేసిన మిక్స్డ్ జెండర్ (మహిళా, పురుషులు కలిసి ఆడే పోటీలు) ఈవెంట్లను తొలిసారిగా ఈ టోర్నీలోనే పరిశీలించనున్నారు. 50 దేశాలకు చెందిన 452 మంది షూటర్లు ఈ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. ఆతిథ్య భారత్ నుంచి 63 మంది షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయా్యరు. భారత్‌లో గతంలోనూ ప్రపంచకప్ షూటింగ్ ఈవెంట్లు (1997, 2000, 2003) జరిగినప్పటికీ ఈ ఈవెంట్ మాత్రం ప్రత్యేకవైుంది. ఇప్పటిదాకా భారత్‌లో జరిగిన మెగా ఈవెంట్లన్నీ కేవలం షాట్‌గన్ పోటీల (ట్రాప్, డబుల్ ట్రాప్, స్కీట్)కు మాత్రమే పరిమితం కాగా... తాజా ప్రపంచకప్‌లో రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ ఇలా అన్ని కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు. టోక్యో ఒలింపిక్స్ (2020)కు ఇది తొలి క్వాలిఫయింగ్ ఈవెంట్ కావడం మరో విశేషం. ఈ ఈవెంట్లలో చివరిసారిగా... అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య త్వరలోనే కొన్ని ఈవెంట్లను ఒలింపిక్ క్యాలెండర్ నుంచి తొలగించనుంది. పురుషుల డబుల్ ట్రాప్, 50 మీ. పిస్టల్, 50 మీ. ప్రోన్ ఈవెంట్లు ఈ జాబితాలో ఉన్నాయి. మును్మందు ఇందులో పోటీపడే అవకాశం లేదని తెలిసినా... ఆఖరి సారిగా ప్రపంచకప్‌లో ఆయా ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు షూటర్లు బరిలోకి దిగుతున్నారు. కొత్తగా మిక్స్డ్ జెండర్ ఈవెంట్స్ యూరోపియన్ పియన్ ప్, జూనియర్ ప్రపంచకప్, యూత్ ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టిన మిక్స్డ్ జెండర్ పోటీలను తొలిసారిగా ఓ మేజర్ టోర్నమెంట్లో ఆడిస్తున్నారు. ఇందులో భాగంగా 10 మీ. ఎయిర్ రైఫిల్, 10 మీ. ఎయిర్ పిస్టల్, ట్రాప్, స్కీట్ ఈవెంట్లలో పురుషులు, మహిళలు కలిసి గురిపెటా్టల్సి వుంటుంది. అయితే ఇది పూర్తిస్థాయి పోటీలు కాకపోవడం... ప్రయోగాత్మక పరిశీలన నేపథ్యంలో ఇందులో గెలిచిన వారికి పతకాల బదులు బ్యాడ్జిలు అందజేస్తారు.