in narasapuram
-
సాగర తీరం.. సుందర దృశ్యం
ఒక్కొక్కసారి ప్రకృతిలో ప్రతిచర్య మనిషిని ఆహ్లాదానికి గురి చేస్తుంటాయి. చినమైనవానిలంకలో సముద్ర తీరానికి ఒక భారీ వృక్షం కొట్టుకు వచ్చింది. స్థానిక శిథిల తుపాను భవనం సముద్ర గర్భంలో కలిసిన ప్రాంతంలో ఆ వృక్షం పడి ఉంది. సందర్శకులకు ఈ దృశ్యం ఆనందం కలిగిస్తుండటంతో పలువురు పర్యాటకులు ఈ సుందర దృశ్యాన్ని కెమేరాల్లో బంధిస్తున్నారు. – నరసాపురం రూరల్ -
ఉత్సాహంగా 5 కే మినీ ర న్
నరసాపురం :నరసాపురం 7 ఆంధ్రా నేవల్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో 5కే మినీ మారథా న్ ర న్ నిర్వహించారు. పీచుపాలెం నుంచి వలంధర్‌రేవు మీదుగా ఉత్సాహంగా ర న్ జరిగింది. కార్యక్రమాన్ని వైఎ న్కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీసీఎస్ అప్పారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేవల్ యూనిట్ కమాండర్ కెప్టె న్ కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ 68వ రిపబ్లిక్ డే వేడుకలను ప్రతి ఒక్కరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలని కోరారు. నేవల్, ఎ న్‌సీసీ అధికారులు ఏఆర్ఎస్ కుమార్, కె.వెంకటేశ్వర్లు, వైఎ న్వీవీఆర్ రామారావు, ఎస్ఎ న్ సింగ్, ఎం.రాము, 60 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. -
రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
భీమవరం టౌన్ : నాగర్సోల్–నర్సాపురం రైలు ఎస్–5 కోచ్‌లో మంగళవారం ప్రయాణిస్తూ అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. భీమవరం జీఆర్పీ ఎస్సై జి.ప్రభాకర్ కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తిని నర్సాపురం రైల్వే స్టేషన్లో ఉన్న పుష్కర వైద్య శిబిరం బృందం 108 అంబులెన్సులో నర్సాపురం ప్రభుత్వాస్పత్రికి పంపించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉండొచ్చు. ఎత్తు 5.6 అడుగులు, నలుపు రంగులో ఉన్నాడు. ముక్కుపొడి రంగు ఫ్యాంటు, క్రీమ కలర్ చొక్కా ధరించి ఉన్నాడు.