ప్యాసింజర్ ట్రైన్లో దారుణం
గుంటూరు : నరసరావుపేట - పిడుగురాళ్ల ప్యాసింజర్ ట్రైన్లో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. వినుకొండ వెళ్తున్న వ్యక్తి నుంచి దుండగులు రూ. 10 వేల నగదు దోచుకున్నారు. అనంతరం ట్రైన్ నుంచి సదరు వ్యక్తిని తోసేశారు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమీపంలోని స్థానికులు వెంటనే స్పందించి... ఆసుపత్రికి తరలించారు.
అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అనంతరం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని... బాధితుడిని దోపిడి దుండగులపై ఆరా తీస్తున్నారు. బాధితుడు గుంటూరు జిల్లా బెల్లంకొండకు చెందిన కోటేశ్వరరావు అని పోలీసులు చెప్పారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.