narrow roads
-
ఇరుకు వంతెనతో ఇక్కట్లు
సాక్షి,నల్లగొండ : పెద్దవూర మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో నాగార్జునసాగర్– హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఇరుకు వంతెనతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నాగార్జునసాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రం కావడం, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కలిపే ప్రధాన రహదారి ఇదే కావడం, అదీగాక మిర్యాలగూడెం పరిసర ప్రాంతాలలో రైస్ మిల్లులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అధిక సంఖ్యలో ఉండటంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఇరురాష్ట్రాలకు చెందిన వీఐపీలు సైతం ఈ రోడ్డు మార్గాన పోవాల్సిందే. రహదారి ఇరుకుగా ఉండి కేవలం ఒక్క వాహనం మాత్రమే వెళ్లటానికి వీలు ఉంది. దీంతో ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు వంతెన అవతలి వైపు ఉన్న వాహనాలు నిలుపు కోవాల్సిందే. ఒకే వాహనం పోవటానికి వీలు అవుతుండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయి. రెండు వాహనాలు వంతెనపైకి వచ్చి ఇరుక్కు పోయిన సందర్భాలు కోకొల్లలు. ఆ సమయంలో వాహనాలు వంతెన నుంచి రాలేక గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయిన దాఖలాలు ఉన్నాయి. వంతెన సమీపంలో ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి సమయాలలో లైట్ల వెలుతురులో వంతెన ఉన్నట్లు డ్రైవర్లకు కనపడక వాహనాలు ఢీ కొన్న పరిస్థితులు ఉన్నాయి. వంతెనపై ఇరువైపులా కంపచెట్లు మొలవడంతో పాటు రెండు అడుగుల వెడల్పులో ఇసుక పేరుకుపోయింది. వాహనాలు ఎదురుగా వస్తున్నప్పుడు ద్వి చక్రవాహనాలు ఆ ఇసుకలో స్లిప్ అయ్యి కింద పడి గాయాల పాలవుతున్నారు. రెండేళ్ల కిందట మండలంలోని నాయినివానికుంట గ్రామానికి చెందిన జానపాటి లింగమ్మ వంతెనపై నడుచుకుంటు వెళ్తుండగా వెనకనుంచి లారీ ఢీ కొనడంతో ఆమె మృతి చెందింది. కృష్ణా తాగునీటి నల్లా పెట్రోల్ బంక్ ఎదురుగా ఉండటంతో గ్రామస్తులు తాగు నీటి కోసం ఇరుకు వంతెనపై నుంచి నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకుంటారు. వంతెనపై నడిచి వెళ్లేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ప్రస్తుతం జడ్చర్ల–కోదాడ వరకు జాతీయ రహదారి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనైనా ఇరుకు వంతెనకు మోక్షం కలుగుతుందేమో చూడాలి మరి. అధికారులు స్పందించి నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఉన్న ఇరుకు వంతెనను వెడల్పు చేసి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి ఇరుకు వంతెనపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వంతెనపై రెండు వైపులా రెయిలింగ్‌కు మూడు నాలుగు అడుగుల వెడల్పులో ఇసుక ఉంది. దీనిపై బైక్‌లు స్లిప్ అయ్యి కింద పడి గాయాలపాలవుతున్నారు. ఒకే వాహనం పోవడానికి వీలుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. అధికారులు స్పందించి వంతెనను వెడల్పు చేయాలి. – కిలారి మురళీయాదవ్, పెద్దవూర -
ఘాట్‌రోడ్డుపై ఇరుక్కున్న బస్సులు
సారంగాపూర్(జగిత్యాల): సారంగాపూర్–బీర్పూర్ మండలాల మధ్య ఉన్న ఘాట్ రోడ్డుపై బుధవారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఇరుక్కున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. జగిత్యాల నుంచి జన్నారం వెళ్తున్న బస్సు, జన్నారం నుంచి జగిత్యాల వస్తున్న మరో బస్సు సారంగాపూర్ వైపు ఉన్న ఆంజనేయ ఆలయ సమీపంలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఒకదానికొకటి ఆనుకొనిపోయాయి. రెండు బస్సుల డ్రైవర్లు వెనక్కి తీసుకుని వారివారి గమ్యస్థానాలకు వెళ్లినట్లు కండక్టర్ సుంకరిపల్లి అశోక్ తెలిపారు. -
నూతన మార్పులకు శ్రీకారం
జిల్లా కేంద్రమైన కడప నగరంలో ట్రాఫిక్ వాహనదారులకు ఓ సవాలే. ఇరుకైన రోడ్లు.. ఎక్కడంటే అక్కడ నిలిపే వాహనాలతో నిత్యం ట్రాఫిక్ జామే. ఆ దారుల్లో ప్రయాణించే వారికి అది నరకమే.. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ.. వాటన్నింటిని ఓ పరిష్కార మార్గం చూపిస్తూ జిల్లా ట్రాఫిక్ యంత్రాంగం కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. జరిమానాల విధింపేకాకుండా వాహనదారులకు అవగాహన కల్పిస్తూ.. బారికేడ్లు ఏర్పాట్లు చేస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నడుం బిగించింది. కడప అర్బన్:జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఈ ఏడాది జనవరి నుంచి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్‌లో ‘ ట్రిపుల్ ఈ ’ పాత్ర ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ పని చేసిన కాలం నుంచి ప్రస్తుత ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ వరకు జిల్లాలో ఆరు సబ్ డివిజన్ల పరిధిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తగిన చర్యలు తీసుకుం టున్నారు. కడప కార్పొరేషన్‌తో పాటు, ప్రొద్దుటూరు, పులి వెందుల, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, బద్వేల్ పట్టణాలలో ట్రాఫిక్ నియంత్రణకు అడ్డంకిగా ఉండే ప్రదేశాలను గుర్తించారు. అవరమైన విస్తరణ పనులు చేశారు. కడప నగరంలో బారికేడ్లు ఏర్పాటు.. గత ఎస్పీ హయాంలో వివిధ రకాల కార్పొరేట్ సంస్థల సౌజన్యంతో క డప ట్రాఫిక్ పోలీస్ సౌజన్య సంస్థ’ల పేరుతో బారికేడ్లను తయారు చేయించారు. అవగాహన కల్పించ డం.. జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ ఆదేశాల మేరకు కడప ట్రాఫిక్ పోలీసులు పాత రిమ్స్‌లో జనవరిలో ప్రారంభించిన అవగాహన కేంద్రంలో ప్రతి రోజు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లే ఎల్ఎల్ఆర్, లెసైన్స్ దరఖాస్తుదారులు చేసుకునే అభ్యర్థులకు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ ఫలితాలు.. వివిధ ఆటోయూనియన్ నాయకుల సహకారంతో ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు ఖాకీ చొక్కా వేసుకోవాలని నిబంధన పెట్టడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి బ్రీత్ఎనలైజర్, వాటిపై కూడా అవగాహన కల్పించారు. వారం నుంచి రాత్రి వేళ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కడప నగరంలో సంధ్యసర్కిల్, సాయిబాబా థియేటర్, ఎస్పీబంగ్లా, బీకేఎం స్ట్రీట్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్‌రోడ్స్, వన్‌టౌన్ సర్కిల్, అప్సరా సర్కిల్ లాంటి 10 ప్రదేశాలలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కోటిరెడ్డి సర్కిల్లో సిగ్నల్ వ్యవ స్థ పని తీరువల్ల వా హనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్నారు. ట్రాఫిక్ రూల్, లైట్ పరికరాలు, రిఫ్లెక్టర్ జాకెట్లను, హెల్మెట్లను పోలీసు విధిగా వాడుతుండడం విశేషం. కడప నగరంలో మొత్తం 21 ట్రాఫిక్ పాయింట్లు, 14 సబ్ పాయింట్లు, ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.