నూతన మార్పులకు శ్రీకారం
జిల్లా కేంద్రమైన కడప నగరంలో ట్రాఫిక్ వాహనదారులకు ఓ సవాలే. ఇరుకైన రోడ్లు.. ఎక్కడంటే అక్కడ నిలిపే వాహనాలతో నిత్యం ట్రాఫిక్ జామే. ఆ దారుల్లో ప్రయాణించే వారికి అది నరకమే.. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ.. వాటన్నింటిని ఓ పరిష్కార మార్గం చూపిస్తూ జిల్లా ట్రాఫిక్ యంత్రాంగం కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. జరిమానాల విధింపేకాకుండా వాహనదారులకు అవగాహన కల్పిస్తూ.. బారికేడ్లు ఏర్పాట్లు చేస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నడుం బిగించింది.
కడప అర్బన్:జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఈ ఏడాది జనవరి నుంచి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.
ట్రాఫిక్‌లో ‘ ట్రిపుల్ ఈ ’ పాత్ర
ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ పని చేసిన కాలం నుంచి ప్రస్తుత ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ వరకు జిల్లాలో ఆరు సబ్ డివిజన్ల పరిధిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తగిన చర్యలు తీసుకుం టున్నారు. కడప కార్పొరేషన్‌తో పాటు, ప్రొద్దుటూరు, పులి వెందుల, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, బద్వేల్ పట్టణాలలో ట్రాఫిక్ నియంత్రణకు అడ్డంకిగా ఉండే ప్రదేశాలను గుర్తించారు. అవరమైన విస్తరణ పనులు చేశారు.
కడప నగరంలో బారికేడ్లు ఏర్పాటు..
గత ఎస్పీ హయాంలో వివిధ రకాల కార్పొరేట్ సంస్థల సౌజన్యంతో క డప ట్రాఫిక్ పోలీస్ సౌజన్య సంస్థ’ల పేరుతో బారికేడ్లను తయారు చేయించారు.
అవగాహన కల్పించ డం.. జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ ఆదేశాల మేరకు కడప ట్రాఫిక్ పోలీసులు పాత రిమ్స్‌లో జనవరిలో ప్రారంభించిన అవగాహన కేంద్రంలో ప్రతి రోజు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లే ఎల్‌ఎల్‌ఆర్, లెసైన్స్ దరఖాస్తుదారులు చేసుకునే అభ్యర్థులకు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు.
స్పెషల్ డ్రైవ్ ఫలితాలు..
వివిధ ఆటోయూనియన్ నాయకుల సహకారంతో ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు ఖాకీ చొక్కా వేసుకోవాలని నిబంధన పెట్టడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి బ్రీత్‌ఎనలైజర్, వాటిపై కూడా అవగాహన కల్పించారు. వారం నుంచి రాత్రి వేళ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
కడప నగరంలో సంధ్యసర్కిల్, సాయిబాబా థియేటర్, ఎస్పీబంగ్లా, బీకేఎం స్ట్రీట్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్‌రోడ్స్, వన్‌టౌన్ సర్కిల్, అప్సరా సర్కిల్ లాంటి 10 ప్రదేశాలలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కోటిరెడ్డి సర్కిల్‌లో సిగ్నల్ వ్యవ స్థ పని తీరువల్ల వా హనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్నారు.
ట్రాఫిక్ రూల్, లైట్ పరికరాలు, రిఫ్లెక్టర్ జాకెట్లను, హెల్మెట్‌లను పోలీసు విధిగా వాడుతుండడం విశేషం.
కడప నగరంలో మొత్తం 21 ట్రాఫిక్ పాయింట్లు, 14 సబ్ పాయింట్లు, ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.