nasa scientist
-
భూమి బరువు తగ్గుతోంది..
వాషింగ్టన్: భూమి రోజురోజుకూ తనపై ఉన్న వాయువులను కోల్పోతున్న అంశంపై అధ్యయనం చేసేందుకు నాసా సౌండింగ్ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. విజన్స్(విజువలైజింగ్ అయాన్ ఔట్‌ఫ్లో వయా న్యూట్రల్ ఆటమ్ సెన్సింగ్)–2 అనే రాకెట్‌ను పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. నార్వే నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీని ద్వారా భూమి తన వాతావరణంలోని ఆక్సిజన్‌ను అంతరిక్షంలోకి కోల్పోతున్న అంశాన్ని అధ్యయనం చేయనుంది. ‘భూమి రోజూ బరువును కోల్పోతుంది. వంద నుంచి కొన్ని వందల టన్నుల మేర వాతావరణంలోని వాయువులను భూమి అంతరిక్షంలోకి కోల్పోతున్నట్లు రుజువయింది. ఇదే వేగంతో భూమి తన వాయువులను తిరిగి నింపుకోవటానికి బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు పడుతంది’అని నాసా శాస్త్రవేత్త థామస్ మూరే వెల్లడించారు. హైడ్రోజన్ కంటే 16 రెట్లు బరువైన ఆక్సిజన్ భూ గురుత్వాకర్షణ వలయాన్ని తప్పించుకుని వెళ్లలేదని శాస్త్రవేత్తలు భావించేవాళ్లు. అయితే ప్రస్తుతం భూమి చుట్టుపక్కల ఉన్న అంతరిక్ష ఆవరణం ఎక్కువ శాతం భూమి మీద ఉద్భవించిన వాయువులతోనే నిండి ఉండటం కలవరపరిచే అంశం. సౌండింగ్ రాకెట్ అంటే.. సౌండింగ్ రాకెట్ అంటే నాటికల్ అర్థం ప్రకారం కొలతలు తీసుకునేది. ఈ రాకెట్ రాకెట్ నింగిలోకి ఎగిసిన తర్వాత మొదటి మోటార్ భాగంలోని ఇంధనంతో పైకి వెళ్తుంది. అనంతరం పేలోడ్‌ను వదిలేసి రాకెట్ భూమి మీదకి వచ్చేస్తుంది. పేలోడ్ మాత్రం అంతరిక్షంలోకి వెళ్తూ అధ్యయనాన్ని పూర్తి చేస్తుంది. గ్రాండ్ చాలెంజ్‌లో భాగంగా రానున్న 14 నెలల్లో పంపనున్న 9 సౌండింగ్ రాకెట్లలో మొదటి రాకెట్ విజన్స్–2 కావడం గమనార్హం. -
వరద ముప్పును గుర్తించే పరికరం
లాస్ఏంజెలిస్: భూతాపోన్నతి కారణంగా మంచు ఫలకాలు కరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఏయే నగరాలు వరదల బారిన పడతాయో తెలిపే పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. భూభ్రమణంతో పాటు గురుత్వాకర్షణ ప్రభావాల ఆధారంగా నీటి పంపిణీ ఎలా జరుగుతుందో ఈ పరికరం అంచనా వేస్తుందని వెల్లడించింది. వాయవ్య గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు ఫలకాలు కరగటం వల్ల లండన్ సముద్ర మట్టం పెరుగుతుందని శాస్త్రవేత్త ఎరిక్ ఇవాన్ చెప్పారు. -
నాసాలో భారతీయ శాస్త్రవేత్తకు అవమానం
నాసాలో పనిచేస్తున్న భారత సంతతి శాస్త్రవేత్తను అమెరికా కస్టమ్స్ అధికారులు అవమానించారు. ఆయనను అదుపులోకి తీసుకుని, బలవంతంగా ఫోన్ అన్‌లాక్ చేయించారు. సిద్ బిక్కన్నవార్ (35) ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హ్యూస్టన్‌లోని జార్జ్ బుష్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తాను వెళ్లినప్పుడు అక్కడి కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు తన సెల్‌ఫోన్ పాస్వర్డ్ అడిగారని, అది చెబితేనే వెళ్లనిస్తామన్నారని అన్నారు. తాను గత వారం అమెరికాకు తిరిగి వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని, ముస్లింలను నిషేధిస్తున్నప్పుడు అందులో భాగంగానే తనను కూడా నిర్బంధించారని ఆయన ఫేస్బుక్ పోస్ట్‌లో రాశారు. తొలుత తాను పాస్వర్డ్ ఇవ్వనన్నానని, అది నాసా వాళ్లు ఇచ్చిన ఫోన్ కాబట్టి అందులో ఏమున్నాయో అందరికీ చెప్పడం కుదరదని వివరించానని ఆయన తెలిపారు. నాసాలో పనిచేస్తున్న బిక్కన్నవార్ అక్కడ భారీ స్పేస్ టెలిస్కోపులకు కావల్సిన టెక్నాలజీని డిజైన్ చేస్తారు. తాను అమెరికాలో పుట్టిన పౌరుడినని, నాసాలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని, తనవద్ద అమెరికా పాస్‌పోర్టు ఉందని చెప్పినా, వాళ్లు మాత్రం తన ఫోన్ లాగేసుకున్నారని, అందులో ఉన్న డేటా మొత్తం కాపీ చేసుకున్న తర్వాతే తనకు ఫోన్ ఇచ్చి వెళ్లనిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సోలార్ కార్ల రేసింగులో పాల్గొనడం తన హాబీ కావడంతో దాని కోసం ఆయన కొన్నాళ్ల పాటు సెలవులో వెళ్లారు. పైగా ఆయన ఇమ్మిగ్రేషన్ బ్యాన్ ఉన్న దేశాలు వేటికీ కూడా ఎప్పుడూ వెళ్లలేదు. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత తన అధికారులు కూడా తన ఫోన్ చెక్ చేస్తున్నారని, అందులో కస్టమ్స్ వాళ్లు ఏవైనా ఇన్స్టాల్ చేశారేమో పరీక్షిస్తున్నారని తెలిపారు. దీనిపై నాసా అధికారులు మాత్రం ఇంకా స్పందించలేదు.