రోడ్డు ప్రమాదంలో నాట్కో అధికారి మృతి
శంషాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బూర్జుగడ్డ తండా సమీపంలోని పీ-వన్ రోడ్డుపై శుక్రవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. నాట్కో కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న పి.కృష్ణారావు(48) శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని కారులో వస్తుండగా రోడ్డుపైకి అడవి పందులు అడ్డుగా వచ్చాయి. వాటిని తప్పించబోయే క్రమంలో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణారావు అక్కడికక్కడే చనిపోయారు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.