nation wide bundh
-
‘బ్యాంకుల్లో ఉన్న రూ.10 లక్షల కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టేందుకే ఈ కుట్ర'!
కొరిటెపాడు (గుంటూరు): జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ, విలీనానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు రెండు రోజులపాటు బ్యాంకు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. యూనియన్ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో అన్ని జాతీయ బ్యాంకు ఉద్యోగులు మొదటి రోజు గురువారం చేపట్టిన సమ్మె విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా 12 జాతీయ బ్యాంకుల పరిధిలో 450 శాఖలు ఉన్నాయి. వీటిలో సుమారు 3 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రైవేటు బ్యాంకులు యథావిధిగా పనిచేశాయి. జిల్లాలోని 450 ప్రభుత్వరంగ బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకులు మూతపడటంతో దాదాపు రూ.120 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. శుక్రవారం కూడా ప్రభుత్వ బ్యాంకులు మూతపడనున్నాయి. సమ్మెలో భాగంగా గురువారం జీటీ రోడ్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.కిషోర్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రం తలపెట్టిన బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రతి పౌరుడు, ప్రతి ఖాతాదారుడు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బ్యాంకుల్లో ఉన్న రూ.10 లక్షల కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. గతంలో అనేక ప్రైవేటు బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్ రూపంలో పెద్ద మొత్తంలో సొమ్ము వసూళ్లు చేసి పారిశ్రామిక సామ్రాజ్యం అవసరాలకు వాడుకొని దివాళా తీయించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల కారణంగానే దేశ ఆర్ధిక వ్యవస్థ నిలదొక్కుకుందన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు. అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాలు, యూనియన్ల నేతలు వి.రాధాకృష్ణమూర్తి, సురేష్, హనుమంతరెడ్డి, లక్ష్మీనారాయణ, హరిబాబు, బాషా, మురళీ నాగేంద్ర, రవి, షరీఫ్, వేణు, రామారావు, క్రాంతి, పావని, జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక -
బంద్‌లో ఎవరికి వారే
పెద్దనోట్లకు రద్దుకు వ్యతిరేకంగా సోమవారం కలిసికట్టుగా బంద్ నిర్వహించాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించడంతో వామపక్షాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో తప్ప దేశంలో ఎక్కడా బంద్ ప్రభావం పెద్దగా కనపించలేదు. బెంగాల్లో వామపక్షాల ప్రాబల్యం ఎక్కువగానే ఉన్నా, మమతా బెనర్జీ నయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బంద్‌కు మద్దతు ఇవ్వకపోవడంతో ప్రభావం లేకుండా పోయింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు, రైలు సర్వీసులు యథావిధిగా నడవడంతో పాటు ప్రైవేటు వాహనాల రాకపోకలు కొనసాగాయి. వామపక్షాల కార్యకర్తలు, మమతా బెనర్జీ విడివిడిగా వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 12 గంటల బంద్‌కు వామపక్షాలు పిలుపునివ్వగా, ముందుగా మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో బంద్ నుంచి వెనక్కి జరిగి 'ఆక్రోశ్ దివస్'కే పరిమితమైంది. టీఆర్ఎస్, జనతాదళ్ (యూ) పార్టీలు ఆందోళనకే పూర్తి దూరంగా ఉన్నాయి. 'ప్రతిపక్షాలు కోరుకుంటున్నది అవినీతి బంద్‌నా, భారత్ బంద్‌నా' అంటూ ప్రధాని నరేంద్రమోదీ సకాలంలో ప్రశ్నించిన నేపథ్యంలో దేశ ప్రజల్లో మోదీకున్న ప్రభావాన్ని తలుచుకొని కాంగ్రెస్ పార్టీ బంద్ నుంచి వెనకడుగు వేసినట్లు ఉంది. పెద్ద నోట్ల రద్దుకు ప్రతిపక్ష పార్టీలు ఒకే వేదికపైకి కలిసిరాకపోవడం మోదీ ప్రభుత్వానికి కలిసొచ్చిన అంశం. పార్లమెంట్‌ను స్తంభింప చేయడం మినహా విపక్ష పార్టీలు ఏం చేయలేకపోతున్నాయి. ఇప్పటివరకు కనీసం పార్లమెంట్లో మోదీతో జవాబు చెప్పించలేకపోయాయంటే అది ఆ పార్టీల బలహీనతే. పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేయాలో ప్రతిపక్షాలకు ఓ స్పష్టత లేకపోవడం కూడా బలహీనతే. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ముందుగానే లీకయిందని, దానిపై పార్లమెంట్ సంయుక్త కమిటీతో దర్యాప్తు జరిపించాలని కొన్ని పార్టీలు, ప్రధాన మంత్రి క్షమాపణలు చెప్పాలని మరికొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మొదట్లో డిమాండ్ చేసిన పార్టీలు క్రమంగా ఈ అంశంపై మౌనం వహిస్తూ ప్రజల కష్టాలను తీర్చాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాయి. నల్లడబ్బుకు ఆశ్రయం ఇచ్చే రాజకీయ పార్టీలు ప్రజలతో కలిసి వస్తారని ఆశించడం అత్యాశే అవుతుందేమో! -
మోదీని వ్యతిరేకిస్తే దేశద్రోహులేనా
-
మోదీని వ్యతిరేకిస్తే దేశద్రోహులేనా: సురవరం
పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చెప్పారు. నోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రిని బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. నరేంద్ర మోదీని వ్యతిరేకించిన వాళ్లందరినీ దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని.. దీన్ని ఎంత మాత్రం సహించేది లేదని చెప్పారు. అదానీ, అంబానీలకు వేలకోట్ల రూపాయల రాయితీలను ఎందుకు ఇచ్చారని సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. బ్లాక్ మనీ పేరుతో పేదలను వేధించడం సరికాదని చెప్పారు. నల్లధనంలో కేవలం 6 శాతం మాత్రమే దేశంలో ఉందని, మిగిలినదంతా విదేశాల్లో ఎప్పుడో దాచేశారని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని, రిటైల్ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. కూరగాయలు అమ్ముకునే వారు, హెయిర్ కటింగ్ సెలూన్ల వారు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆరు నెలలు గడిచినా ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదన్నారు. జీడీపీ వృద్ధిరేటు 3.5 శాతానికి పడిపోయిందన్నారు. పాత కరెన్సీని మరికొంత కాలం అనుమతిస్తేనే గ్రామీణ పరిస్థితులు మెరుగుపడతాయని సురవరం చెప్పారు.