National Math Day
-
జానకి అమ్మాళ్..టైలర్‌గా బతికిన గణిత మేధావి భార్య
శ్రీనివాస రామానుజన్ దేశం గర్వించే గణిత మేధావి. గణితంలో శేషం రాబట్టడం ముఖ్యం. కుడి చెవిలో అంకె ఎడమ చెవిలో అంకె ఇవే తెలుస్తుంటాయి. కాని ఆ లెక్కలు చేసే చేతులకు ఒక గుండె కావాలి. ఆ గుండె జానకి అమ్మాళ్. శ్రీనివాస రామానుజన్‌ను వివాహం చేసుకుని ఆమె ఎలాంటి జీవితం గడిపింది. భర్త ప్రేమ పొందిందా? 32 సంవత్సరాలకే భర్త మరణిస్తే ఆమె జీవితం ఎలా గడిచింది? మేధావులు లోకానికి తెలిసినట్టుగా వారి భార్యలు తెలియరు. మేధావులు తమ మేధస్సును దేశం కోసం ప్రపంచం కోసం ధారపోసి వెళ్లిపోతారు. వారితో పాటు బతికిన జీవిత భాగస్వాములు ఆ తర్వాతి జీవితాన్ని వారి జ్ఞాపకాలతో జీవిస్తారు. మహా గణిత మేధావి, భారత దేశానికి గర్వకారణం అయిన శ్రీనివాస రామానుజన్ (1887–1920) జన్మదినం డిసెంబర్ 22ను ‘జాతీయ గణిత దినోత్సవం’గా దేశం జరుపుకుంటుంది. అంతటి మహనీయుని భార్య అయిన జానకి అమ్మాళ్ భర్తతో పాటుగా, భర్త గతించాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అవన్నీ చాలా కాలానికి లోకానికి తెలిశాయి. చాలా ఏళ్ల తర్వాతే సమాజం, దేశం ఆమెను గుర్తించింది. 11 ఏళ్ల వధువు జానకి అమ్మాళ్కు రామానుజన్తో పెళ్లి నాటికి ఆమె వయసు 11. రామానుజన్‌కు 21. రామానుజన్ కుటుంబం కుంభకోణంలో నివసించేది. జానకి అమ్మాళ్ ఊరు మరుదూరు. జానకి తల్లితో రామానుజన్ తల్లికి స్నేహం ఉండేది. అలా జానకి తల్లిని రామానుజన్ తల్లి తన కుమారుడితో జానకి సంబంధానికి ఒప్పించింది. అయితే మరుదూరుకు, కుంభకోణానికి దాదాపు 7 గంటల దూరం ఉంది. అది ఈ కాలంలో. ఆ కాలంలో ఎంత సేపు పట్టేదో చెప్పలేము. జూలై 14, 1909 నాడు ముహూర్తం పెట్టుకుని ఐదు రోజుల పెళ్లి ప్లాన్ చేసుకుంటే తల్లి, బంధువులతోపాటు రామానుజన్ రావడం ఆలస్యం అయ్యింది. ముందే చేరుకోవాల్సిన పెళ్లికొడుకు రాకపోయేసరికి ఆడ పెళ్లి వాళ్లు చాలా ఆందోళన చెందారు. ఒక దశలో ముహూర్తం సమయానికి కూడా రాకపోతే ఇంకో అబ్బాయికి ఇచ్చి కట్టపెడదాం అనుకున్నారు. కాని రామానుజన్ రావడంతో పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో రామానుజన్ తండ్రి లేడు. ఆయన క్లర్క్ పని చేసేవాడు. సెలవులు కుదరక పెళ్లిళ్లకు తండ్రులు హాజరు కాకపోవడం ఆ రోజుల్లో మామూలుగా పరిగణించబడేది. 13వ ఏట నుంచి కాపురానికి పెళ్లి తర్వాత రెండేళ్ల పాటు జానకి తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోయింది. ఈడేరాకే ఆమెను 13 ఏళ్లకు కాపురానికి తీసుకెళ్లారు. కాని రామానుజన్ ఆరోగ్యం ఎప్పుడూ సున్నితమే. అతను తరచూ జబ్బు పడేవాడు. పెళ్లి తర్వాత కూడా ఒక సర్జరీ అవసరమయ్యి అందుకు డబ్బులేక బాధ పడ్డాడు. తర్వాత ఒక డాక్టరు ఫ్రీగా చేస్తానని ముందుకు రావడంతో ఆ అవస్థ తప్పింది. రామానుజన్ చాలా బిడియ స్వభావి. పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు. అతడు ఒక పెద్ద పలక మీద తన థీరమ్స్ సాధన చేసేవాడు. నోట్ బుక్స్‌లో తన గణిత పరిష్కారాలు రాసేవాడు. ఆయన పిలిచినప్పుడు పలకడమే జానకి చేయవలసిన పని. ఇంట్లో రామానుజన్ తల్లి, బామ్మ ఉండేవారు. రామానుజన్‌ను, జానకిని ముద్దు చేస్తూ అన్ని వ్యవహారాలు వారే చూసుకునేవారు. వీరు ఒకరికి ఒకరే గాని రామానుజన్ మొదటి భార్య గణితమే కదా. రెండేళ్ల కాపురం జానకి అమ్మాళ్ రెండేళ్ల పాటే రామానుజన్తో కాపురం చేసిందని చెప్పాలి. 1912లో కాపురానికి వస్తే 1914 లో రామానుజన్ ఇంగ్లాండ్ వెళ్లాడు. 1919 లో జబ్బు పడి తిరిగి వచ్చే వరకూ అక్కడ ఒక్కడే ఉన్నాడు తప్ప భార్యను తెచ్చుకునే పరిస్థితి లేదు. జబ్బు పడినప్పుడు ఒక మనిషి తోడుగా ఉండాల్సి వచ్చినా మొదటి ప్రపంచ యుద్ధ రోజులు కనుక జానకి ఇంగ్లాండ్ వెళ్లలేక పోయింది. భార్యను పిలిపించుకుని ఇటలీ వంటి వెచ్చటి దేశానికి వెళ్లు అని డాక్టర్లు సలహా ఇచ్చినా వీలు లేకపోయింది. చివరకు చాలా అనారోగ్య స్థితిలో రామానుజన్ ఇండియా చేరుకున్నాడు. 1919లో ఏప్రిల్‌లో అతడు ఇండియా వస్తే 1920 ఏప్రిల్ 26న మరణించేనాటి వరకూ జానకి అతడికి సేవలు చేసింది. మరణించే నాటికి రామానుజన్ వయసు 32. ఆమె 20లలోనే ఉంది. అంత చిన్న వయసులో వైధవ్యం చూసిందామె. భర్త గొప్ప జీవితం చూడలేదు. ఆమె కూడా. దర్జీగా జీవించి భర్త మరణించాక కొన్నాళ్లు ముంబైలోని సోదరుడి దగ్గర ఉన్న జానకి అక్కడ టైలరింగ్ నేర్చుకుని మద్రాసు చేరుకుని రెండు గదుల ఇంట్లో దాదాపు 50 ఏళ్లు జీవించింది. ఆ ఇంట్లో ఉంటూ టైలర్‌గా బతుకుతూ నలుగురికీ టైలరింగ్ నేర్పించేది. ఆ తర్వాత ఆమె తన స్నేహితురాలు మరణిస్తే ఆమె ఏడేళ్ల కొడుకును దత్తత తీసుకుంది. ఆ పిల్లవాడే ఆమెకు ఆ తర్వాత అండా దండా అయ్యాడు. 1962లో పెద్ద గుర్తింపు 1962లో రామానుజన్ 75 వ జయంతి సందర్భంగా అందరి దృష్టి జానకి అమ్మాళ్ మీద పడింది. ఆమె ఒంటరిగా జీవిస్తున్నదని తెలిసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బెంగాల్ ప్రభుత్వాలు జీవిత కాల పెన్షన్‌ను మంజూరు చేశాయి. గణిత అభిమానులు అందరూ కలిసి ఆ రోజుల్లో ఆమెకు 20 వేల రూపాయల పర్సు ఇచ్చారు. హిందూజా ఫౌండేషన్ నుంచి నెలకు 1000 రూపాయల పెన్షన్ మంజూరు అయ్యింది. ఇంకా ఎందరో ఆమెను రామానుజన్ భార్యగా గౌరవించి సత్కరించారు. అయితే ఆమె తన భర్తలాగే ఎంతో మొహమాటస్థురాలు. సంప్రదాయవాది. ఎవరినీ పెద్దగా కలిసేది కాదు. ‘నా భర్త జీవించి ఉండగా ఆయన చివరి రోజుల్లో నా చేతులతో ఆయనకు అన్నం, మజ్జిగ ఇచ్చాను. కాళ్లు పట్టాను. ఆయనకు అవసరమైన వేడి నీళ్లు కాచడానికి వాడిన రెండు గిన్నెలను ఆయన జ్ఞాపకంగా ఉంచుకున్నాను.’ అంటుంది జానకి అమ్మాళ్. జానకి అమ్మాళ్ తన 94వ ఏట భర్త మరణించిన నెలలోనే ఏప్రిల్ 13, 1994న తుది శ్వాస విడిచింది. చదవండి: Toilet Cleaning Robot: టాయిలెట్ క్లీన్ చేసే రోబో.. ధర 40 వేల రూపాయలు! -
లెక్కలు ఈజీ గురూ...!
గణితానికీ మానవ జీవితానికి విడదీయరాని బంధం వుంది. ప్రతీ విషయానికీ లెక్కలే. పుట్టింది మొదలు చచ్చేంత వరకూ అన్నింటికీ లెక్కలే. అయినా గణితమంటే చిన్నతనం నుంచి ప్రతీ ఒక్కరిలోనూ తెలియని భయం. కానీ ఇష్టపడి చదివి, సాధన చేస్తే లెక్కలంత సులువైన పాఠ్యాంశం లేదని చాటి చెబుతున్నారు సాలూరుకు చెందిన రామానుజన్ గణిత క్లబ్ నిర్వాహకులు. గడచిన 18ఏళ్లగా మున్సిపల్ బంగారమ్మపేట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రజనీకాంత్, పిల్లల్లో గణితం పట్ల నెలకొన్న తెలియని భయాన్ని పోగొట్టేందుకు కృషి చేస్తున్నారు. గణితశాస్త్ర పితామహుడైన శ్రీనివాస రామానుజన్ పేరున 2001లో రామానుజన్ గణిత క్లబ్‌ను స్థాపించారు. అప్పటి నుంచి గణితంపై కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. విజయనగరం, సాలూరు: జిల్లాలో మరెక్కడా లేని విధంగా రజనీకాంత్ గణిత క్లబ్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. ఉత్తరాంధ్ర స్థాయిలో కూడా ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తూ గణితం పట్ల ఆసక్తి పెంచేందుకు కృషి చేస్తున్నారు. జిల్లా స్థాయిలో సాలూరు రామానుజన్ గణిత క్లబ్ 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఏటా ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏటా వేలాది మంది విద్యార్థులు ప్రతిభా పరీక్షలో పాల్గొనెలా చేస్తున్నారు. గణితం పట్ల ఆసక్తిని పిల్లల్లో పెంపొందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాణాన్ని కూడా అందిపుచ్చుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రామానుజన్మేథ్స్క్లబ్.ఆర్గ్ అనే వెబ్‌సైట్‌ను 2015లో క్లబ్ నిర్వాహకులు ప్రారంభించారు. అవార్డు తెచ్చిపెట్టిన సేవలు రామానుజన్ గణిత క్లబ్ ద్వారా అందిస్తోన్న సేవలతో పాటు విద్యావ్యాప్తికి రంభ రజనీకాంత్ చేస్తోన్న సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మాస్టారు చేస్తోన్న సేవలకు గుర్తింపుగా 2007లో కలెక్టర్ కిషోర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో గౌరవించారు. 2010లో ఉత్తరాంధ్ర స్థాయిలో రోటరీ ఎక్సలెన్స్ అవార్డ్‌ను కోలగట్ల వీరభద్రస్వామి అవార్డ్‌ను అందించారు. మిత్రుల సహకారం మరవలేనిది గడచిన 18ఏళ్లగా రామానుజన్ గణిత క్లబ్ సేవలు ఉత్తరాంధ్ర స్థాయిలో విస్తరించడం వెనుక తనకు మిత్రులు అందిస్తోన్న సహాయసహకారాలు ఎంతో కీలకమని రజనీకాంత్ చెప్పారు. ముఖ్యంగా ఎంవి.గౌరీశంకర్, బి.వీరభద్రరావు, ఎన్.అశోక్‌కుమార్ తదితరుల వెన్నంటి వుండి తోడ్పాటు అందిస్తున్నారు. నా వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా ప్రతిభా పరీక్ష పరీక్ష నిర్వహణలో స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. గణితంలో దిట్ట యాళ్ల విజయనగరం, బొబ్బిలి రూరల్: పూసల చట్రాలు....క్యాలిక్యులేటర్లు...కంప్యూటర్లు...రోబోలు ఎన్ని వచ్చినా అవన్నీ మానవ మేధస్సుతో వచ్చినవే. మానవ మేధస్సు ముందు ఇవన్నీ తీసికట్టు అని గతంలో ఆర్యభట్ట, శకుంతలాదేవి, లక్కోజు సంజీవరాయశర్మ, శ్రీనివాసరామనుజం వంటి వారు అనేక మంది నిరూపించారు. గణితంలో మరో అధ్యాయం వేదగణితం..దీనికి ఈ ప్రాంతంలో బీజం వేసిన నేరళ్ల నారాయణమూర్తి మాస్టారు వంటి వారు ఉన్న ఈ ప్రాంతంలోనే గణితంలో ఎన్నో సులభ ప్రక్రియలకు శ్రీకారం చుట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు యాళ్ల శ్రీనివాసరావు. సీతానగరం మండలం జానుమళ్లువలసకు చెందిన శ్రీనివాసరావు బొబ్బిలి సంస్థానం పాఠశాలలో బాలసాహిత్య రచయిత ఎన్వీఆర్ సత్యనారాయణమూర్తి శిష్యరికంలో గణితంలో పలు కీలకాంశాలు నేర్చుకున్నారు. ఎంఎస్సీ, బీఈడీ చదివిన శ్రీనివాసరావు బొబ్బిలిలో ఉంటూ ప్రైవేటు ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. గణితంలో తన ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికారŠుడ్సలో స్థానం సాధించారు. -
మహా గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్
రేపు జాతీయ గణిత దినోత్సవం అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త మన శ్రీనివాస రామానుజన్. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఉత్తర అర్కాట్ జిల్లా ఈరోడ్‌లో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. ఆయన తలిదండ్రులు కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్. పన్నెండేళ్ల వయసులోనే అసాధారణ బాలునిగా గుర్తింపు పొందిన రామానుజన్ ‘ఆయిలర్’ సూత్రాలు, త్రికోణమితికి చెందిన అనేక సమస్యలను స్వయంగా సాధించాడు. రామానుజన్‌లోని తెలివితేటలను బయటకు తీసుకువచ్చిన గ్రంథం కార్ రాసిన ‘సినాప్సిస్’, అందులో ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ వంటి విషయాల మీద దాదాపు 6165 సిద్ధాంతాలున్నాయి. వీటి నిరూపణలు చాలా కష్టంగా ఉండేవి. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం ఎన్నో పుస్తకాలు రిఫర్ చేసినా అర్థం చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎటువంటి పుస్తకాలను తిరగేయకుండా వాటి సాధనలను అలవోకగా కనుక్కునేవాడు. అప్పటికే అందులో చాలా సమస్యలు నిరూపించబడ్డాయన్న విషయం తెలియకపోవడంతో వాటిని తన పద్ధతితో సాధించాడు. కుంభకోణం గవర్నమెంటు కాలేజీలో చేరిన రామానుజన్ ఎఫ్.ఎ. పరీక్ష తప్పాడు. తర్వాత మద్రాస్‌లోని వచ్చయ్యప్ప కాలేజీలో చదువుకు చేరాడు. అక్కడ గణితోపాధ్యాయునిగా ఉన్న ఎన్.రామానుజాచారి సమస్యలను కఠినంగా చెప్తుంటే, రామానుజన్ వాటిని తనదైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించే వాడు. రామానుజన్ ప్రతిభను గమనించిన ప్రొఫెసర్ సింగారవేలు ముదలియార్, రామానుజన్తో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలను చర్చించి సాధిస్తుండేవారు. తర్వాత రామానుజం 1909లో జానకి అమ్మాళ్‌ను పెళ్లి చేసుకున్నాడు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ వంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించేవాడు. 1913లో మద్రాస్ పోర్ట్‌ట్రస్ట్‌కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డా॥వాకర్ రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్యర్యపోయి, రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆ కాలంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జి ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్డి (1877-1947)కి పంపాడు. ఉన్నతస్థాయి గణితజ్ఞుడు రాయగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామానుజన్‌ను జి.హెచ్.హార్డీ కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. అక్కడ రాత్రనకా, పగలనకా గణితం పైనే ఏకాగ్రత పెట్టి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టాడు రామానుజన్. ఫిబ్రవరి 28, 1918లో ‘ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ’ గౌరవం పొందిన రెండవ భారతీయుడిగా, 1918 అక్టోబర్‌లో ‘ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి’ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా చరిత్రకెక్కాడు. 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. మనదేశ ఔన్నత్యాన్ని జగతికి చాటిన రామానుజన్, అనారోగ్య కారణంగా చివరకు ఏప్రిల్ 26, 1920న అస్తమించాడు. అప్పటికి ఆయన వయసు 33. చివరిదశలో ‘మ్యాజిక్ స్క్వేర్’, ‘ప్యూర్ మాథ్స్‌కు చెందిన నంబర్ థియరీ’, ‘మాక్ తీటా ఫంక్షన్స్’ చాలా ప్రసిద్ధి పొందాయి. వీటి ఆధారంగా ఆధునికంగా కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986-87 రామానుజన్ శతజయంతి ఉత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. రామానుజన్ నోటు పుస్తకాలపై, గణిత సిద్ధాంతాలపై రామానుజన్ ఇనిస్టిట్యూట్‌లో, అమెరికాలోని ‘ఇలినాయిస్’ యూనివర్సిటీలో నేటికీ రీసెర్చ్ జరుగుతోంది. గణితశాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును ‘జాతీయ గణితదినోత్సవం’గా ప్రకటించింది. 1729 ను రామానుజన్ సంఖ్యగా పిలుస్తారు. దీనిని రెండు సంఖ్యల ఘనాల మొత్తంగా రెండు విధాలుగా రాయవచ్చు. 1729 = 103+93 = 123+13 - నాగేష్