భారత పారాథ్లెట్స్‌కు అవకాశం
న్యూఢిల్లీ : భారత పారాలింపిక్ కమిటీపై నిషేధం ఉన్నప్పటికీ అంతర్జాతీయ పోటీల్లో భారత పారాథ్లెట్స్ పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) ప్రకటించింది. భారత క్రీడాకారులు జాతీయ పతాకం బదులుగా ఐపీసీ పతాకం కింద పోటీపడతారని వివరించింది. గత మార్చిలో ఘజియాబాద్‌లో జరిగిన జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆటగాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం...
అంతర్గత రాజకీయాల కారణంగా భారత పారాలింపిక్ కమిటీపై ఐపీసీ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో పారాలింపిక్ కార్యకలాపాల కోసం కేంద్ర ప్రభుత్వం అడ్‌హక్ కమిటీని నియమించాలని నిర్ణయించింది. దీనికి ఐపీసీ నుంచి సానుకూల స్పందన లభించింది.