గుడ్‌స్లీప్
మానసిక స్థితిగతులు మాత్రమే కాదు గది వాతావరణం కూడా నిద్రను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. బెడ్రూమ్ వాతావరణం కూల్‌గా ఉండేలా చూసుకోండి. బయటి శబ్దాలేవి వినబడకుండా ఏర్పాటు చేసుకోండి. మద్యపానం, ధూమపానం, అధిక భోజనం...మొదలైనవి సుఖనిద్రకు అడ్డుపడుతుంటాయి.
- నేషనల్ స్లీప్ ఫౌండేషన్