ముషారఫ్‌ను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు
ఇస్లామాబాద్: బలూచ్ నేషనలిస్ట్ పార్టీ నేత నవాబ్ అక్బర్ బుగ్తి హత్యకేసులో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను ప్రత్యేక కోర్టు దోషిగా పరిగణించింది. 2006 ఆగస్ట్‌లో బుగ్తి హత్య జరిగింది. ఆ సమయంలో ముషారఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడుగా ఉన్నారు. మరోవైపు ఈ కేసు విచారణ నిమిత్తం పలుమార్లు ముషారఫ్ గైర్హాజరు కావటాన్ని కోర్టు తప్పుబట్టింది.