naveepet
-
జిల్లాలో 18 యువక్లినిక్‌లు
నవీపేట,న్యూస్‌లైన్ : కౌమార బాల బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా 18 యువ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని జాతీయ కౌమార ఆరోగ్య కార్యక్రమం(ఆర్కేఎస్కే) రాష్ట్ర కో ఆర్డినేటర్ జనార్దన్ తెలిపారు. గత నెల 24వ తేదీన నవీపేటలో ఏర్పాటు చేసిన క్లినిక్‌ను బుధవారం ఆయన డీఎంహెచ్ఓతో కలిసి పనితీరును పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు.ఈ క్లినిక్‌లలో 10-19 సంవత్సరాల వయస్సు గల కౌమార బాలబాలికలకు ఆరువారాల పాటు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు,గ్రామ పంచాయతీ కార్యాలయం,పాఠశాలల్లో ఈ క్లినిక్‌లను నిర్వహిస్తున్నామని చెప్పారు. కౌమార దశలోనే వయస్సుకు తగిన ఆహారాన్ని తీసుకోక ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని అన్నారు. కౌమార దశలోనే బాలబాలికలు అనారోగ్యాలతో బాధపడుతున్నారని చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యానికి కావల్సిన ఆరోగ్య నియమాలు క్లినిక్‌లలో వివరిస్తారని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆరోగ్యసిబ్బందిపై డీఎంహెచ్ఓ ఆగ్రహం మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి బుధవారం తనిఖీకి వచ్చిన డీఎంహెచ్ఓ గోవింద్ వాగ్మారే ఆరోగ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ కౌమార ఆరోగ్య కార్యక్రమం(ఆర్కేఎస్కే) పనితీరును పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర కో ఆర్డి నేటర్ జనార్దన్ వెంట ఆయన ఆస్పత్రికి వచ్చారు.ఆస్పత్రికి రాగానే గాయపడ్డ పాఠశాల విద్యార్థిని అసిఫా బేగమ్ వద్దకు వెళ్లారు.ఏమైందని ప్రశ్నిస్తుండగా ఆమె బంధువైన రెహ్మాన్ ఖాన్ జోక్యం చేసుకుని ‘ వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నరు..గంట సేపైనా మా పాపను పట్టించుకోవడం లేదని..’ తన గోడును విన్నవించుకున్నాడు.దీంతో ఆగ్రహానికి గురైన డీఎంహెచ్ఓ, సిబ్బందిపై మండిపడ్డారు.వైద్యులు రాకేష్‌ను మందలించారు. వెంటనే విద్యార్థినికి ప్రాథమిక చికిత్స చేయాలని ఆదేశించారు.ఆస్పత్రి సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మరికొంత మంది డీఎం హెచ్ఓకు ఫిర్యాదు చేశారు. -
సౌరశక్తితో ‘కోత’లకు విముక్తి
నవీపేట, న్యూస్‌లైన్: దేవుడు ప్రసాదించిన సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి సూచించారు. సౌరశక్తితో విద్యుత్ కోతలను అధిగమించవచ్చన్నారు. గురువారం నవీపేట శివారులో గల దాస్ గెస్ట్ హౌస్ వద్ద గల పంట పొలాల్లో అమర్చిన సౌరశక్తితో 5 హెచ్‌పీ మోటార్‌ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం విద్యుత్ సమస్యతో రైతులతో పాటు పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెరుగుతున్న వినియోగానికి అనుగుణంగా విద్యుత్ ఉత్తత్పి పెరగకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. సౌరశక్తితో ఇలాంటి ఇబ్బందులను అధిగమించవచ్చన్నారు. సౌరశక్తి ద్వారా 7 నుంచి 8 గంటల వరకు అందించే విద్యుత్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై అందజేస్తున్న సౌరశక్తి విద్యుత్ తయారీ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో గల 20 లక్షల వ్యవసాయ బోరు కనెక్షన్లకు సౌరశక్తి విద్యుత్‌ను వాడుకునేందుకు రైతులను ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. సౌరశక్తి విద్యుత్‌తో కోతలు,లో వోల్టేజి,మోటార్ కాలిపోవడం,అధిక బిల్లులు తదితర సమస్యల నుంచి గట్టెక్కవచ్చన్నారు. పంట పొలాల్లో సౌరశక్తిని వినియోగించడంతో పారిశ్రామికరంగానికి ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ను సరఫరా చేయవచ్చన్నారు. సౌరశక్తిని వినియోగిస్తున్న రైతులు స్మార్ట్ మీటరింగ్ ద్వారా మిగతా విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు అమ్ముకోవచ్చని, ఈ పద్ధతి త్వరలోనే అమలవుతుందని పేర్కొన్నారు. సౌరశక్తి వినియోగానికి ముందుకు వచ్చిన భవంతి దేవదాస్‌ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి, డీసీసీ చీఫ్ తాహెర్‌బిన్ హందాన్, కాంగ్రెస్ నాయకులు మోస్రా సాయరెడ్డి, డాంగె శ్రీనివాస్, రాంకిషన్రావ్, పాండురంగారెడ్డి, సూరిబాబు, టైటాన్ టెక్నో క్రాట్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్రతినిధి మురళీ కృష్ణ,డీలర్ కృష్ణ గౌడ్ రైతులు పాల్గొన్నారు.